శుక్రవాహిక
వికీపీడియా నుండి
శుక్రవాహిక | |
---|---|
పురుష జననేంద్రియ వ్యవస్థ | |
వృషణాలు, నిలువు కోత శుక్రవాహికలను చూపిస్తుంది. | |
గ్రే'స్ | subject #259 1245 |
ధమని | Inferior vesical artery, Artery of the ductus deferens |
లింఫు | external iliac lymph nodes, internal iliac lymph nodes |
Precursor | Wolffian duct |
MeSH | Vas+Deferens |
శుక్రవాహికలు (ఆంగ్లం: Vas deferens; లాటిన్: "carrying-away vessel") పురుష జననేంద్రియ వ్యవస్థలో వృషణాలలోని ఎపిడిడైమిస్ నుంచి మొదలైన పొడవైన, కండరయుత నాళాలు. ఇరువైపుల నుంచి బయలుదేరిన శుక్రవాహికలు వాంక్షణకుల్యల ద్వారా ఉదరకుహరంలోకి ప్రవేశించి, మూత్రనాళాలను చుట్టి, వెనుకకు వ్యాపించి శుక్రకోశంలోకి తెరచుకొంటాయి.
నిర్మాణం
[మార్చు]శుక్రవాహికలు రెండు కుడి, ఎడమ ఎపిడిడైమిస్ ల నుండి శుక్ర కణాల్ని తరళించడానికి ఉపయోగపడతాయి. మనుషులలో ఒక్కొక్కటి సుమారు 30 సెంటీమీటర్ల పొడవు ఉండి నునుపు కండరాలు కలిగివుంటాయి. లోపలివైపు స్థూపాకార కణజాలపు మ్యూకస్ పొర కప్పివుంచుతుంది. ఇవి రెండు స్పెర్మాటిక్ కార్డ్లో ఒక భాగము.
వాసెక్టమీ
[మార్చు]కుటుంబ నియంత్రణ పద్ధతులలో ఒక శాశ్వతమైన పద్ధతి వాసెక్టమీ. ఈ విధమైన శస్త్రచికిత్సలో రెండు వైపులా శుక్రవాహికలలో చిన్న భాగాన్ని కత్తితించి తొలగిస్తారు. కొన్ని ఆధునిక పద్ధతులలో శుక్రవాహికలోనికి ప్రవాహాన్ని నిరోధించే పదార్ధాలను లోపలికి పంపిస్తారు. అన్ని పద్ధతులలోనూ వీని ముఖ్య ఉద్దేశం శుక్రవాహికలలో వీర్యం యొక్క ప్రవాహాన్ని నిరోధించి, వీర్యకణాలు బయటికి రాకుండా చేయడము.
మూలాలు
[మార్చు]మానవ శరీర భాగాలు | |
---|---|
శరీరంలో వ్యవస్థలు | జీర్ణ వ్యవస్థ · మూత్ర వ్యవస్థ · రక్త ప్రసరణ వ్యవస్థ · నాడీ వ్యవస్థ · శ్వాస వ్యవస్థ · పురుష జననేంద్రియ వ్యవస్థ · స్త్రీ జననేంద్రియ వ్యవస్థ · శోషరస వ్యవస్థ · అస్థిపంజర వ్యవస్థ |
తల, మెడ | మెదడు · ముఖం · చెవులు · కళ్ళు · నోరు · నాలుక · పళ్ళు · ముక్కు · స్వరపేటిక · గొంతు · లాలాజల గ్రంధులు · పియూష గ్రంధి · అవటు గ్రంధి (థైరాయిడ్) · పారాథైరాయిడ్ గ్రంధి |
వీపు | |
ఛాతీ | |
ఉదరము | జీర్ణకోశం · పేగులు (చిన్న ప్రేగు+పెద్ద ప్రేగు) · కాలేయం · ప్లీహము · క్లోమము · మూత్రపిండాలు
· అధివృక్క గ్రంధి (అడ్రినల్ గ్రంధి) · ఉండుకము (అపెండిక్స్) |
కటి | కటి (పెల్విస్) · త్రికాస్థి/త్రికము · గుదాస్థి/అనుత్రికము · అండాశయాలు
· ఫెలోపియన్ నాళాలు · గర్భాశయం · యోని · క్లైటోరిస్ · మూత్రాశయం · వృషణాలు · శుక్రకోశం · శుక్రవాహికలు · పౌరుష గ్రంథి · పురీషనాళము · గుదము · శిశ్నము |
కాళ్ళు, చేతులు | |
దంతములు |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.