మరీచి మహర్షి
వికీపీడియా నుండి
మరీచి మహర్షి (మరీచి అంటే కాంతి రేఖ అని అర్థం) బ్రహ్మ కుమారుడు. సృష్టి కార్యమునకు తనకు సాయముగా ఉండేందుకు శక్తి సంపన్నులగు 10 మంది ప్రజాపతులను సృష్టించాడు. వారిలో మరీచి ఒకరు. అందులో తొమ్మండుగురిని తన శరీరము ద్వారా ఒకరు మానసము నుండి ఉద్భవించారు. మరీచి బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు లేదా కశ్యప ప్రజాపతి.
జీవిత విశేషాలు
[మార్చు]మరీచి మహర్షి యొక్క జీవితము ఆయన సంతతి వల్ల ఎక్కువగా తెలియబడుతుంది. ముఖ్యంగా ఆయన కుమారుడైన కశ్యపమహర్షి వల్ల. మరీచి మహర్షి కళ అను యువతిని పెండ్లియాడి కళ వల్ల కశ్యపునికి శ్రీమహావిష్ణువు అంశగా జన్మనిచ్చాడు. (కశ్యప మహర్షి తన తండ్రినుండి ప్రజపతిత్వాన్ని కూడా పొందినట్టు చెప్పబడినది).[1] రాజస్తాను రాష్ట్రములోని పుష్కర్ ప్రాంతములో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినట్టు, ద్వాపరయుగములో మహాభారత కాలములో భీష్మునికి అంపశయ్య మీదనుండగా దర్శనమిచ్చినట్టు కూడా చెప్పబడింది. బ్రహ్మాండపురాణము తదితర పురాణములలో మరీచి ప్రస్తావన ఉంది. కృతయుగమునందు ధ్రువునికి తపస్సు చేయమని సలహా ఇచ్చినవాడు మరీచి.[2]
శ్రీహరి నాభినుండి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ తనకు సహాయకారులుగా నవబ్రహ్మలను సృష్టించాడు. వారిలో మరీచి ఒకడు.
- మరీచి మహర్షి
- అత్రి
- అంగీరసుడు
- పులహుడు
- పులస్త్యుడు
- క్రతు మహర్షి
- వశిష్ట మహర్షి
- ప్రాచేతస మహర్షి
- భృగు మహర్షి
- నారద మహర్షి
- అధర్వుడు
మరీచి కర్ధముని కుమార్తెయగు కళను వివాహం చేసికొన్నాడు. కర్దమ ప్రజాపతి, దేవహుతిల తొమ్మిది మంది సంతానలో పెద్ద కుమార్తె కళ.
ఒకనాడు కళ మనసులోని మాటను తన భర్తతో; మనకన్నా మిన్న అయిన, సర్వ జీవ రాశులను సృష్టించ గల సామర్ద్యము గల ఓక పుత్రుడు కనాలని కోరిక అన్నది . కొంత కాలమునకు మరీచి అనుగ్రహంతో కళ గర్భవతి అయింది. మాసములు నిండగానే ఒక పుత్రుని కన్నది. అతనే కశ్యపుడు. కశ్యపుడు పెద్దవాడయి, దక్షప్రజాపతి పుత్రికలను పెండ్లాడి, సృష్టి ప్రారంభించాడు. సమస్త లోకముల యందు కీర్తి నీయురాలు అగు ఒక ఉత్తమ పుత్రికను ప్రసాదించమని, కోరుకోవడము జరుగుతుంది. అనంతరం కొంతకాలమునకు కళ మరల గర్భవతి అయినది. పూర్ణిమ అను కుమార్తెకు జన్మనిచ్చింది.
మరీచిస్మృతి
[మార్చు]- మరీచి మహర్షి మహాతపస్వి, విరాగి, మహాజ్ఞాని, స్మృతికర్త. మరీచి మహర్షి పేరున ఒక ధర్మశాస్త్రము మరీచి స్మృతి ఉంది. మరీచి స్మృతి మనకు లభించుట లేదు. పరమ పవిత్రుడు. నవ బ్రహ్మలలో ఒకడు, కశ్యపుని తండ్రియగు మరీచి మనకు ప్రాత:స్మరణీయమైనది.
మూలాలు
[మార్చు]- ↑ Wilkins, W.J (2003). Hindu Mythology. New Delhi: D.K. Printworld (P) Limited. p. 370. ISBN 81-246-0234-4.
- ↑ Sathyamayananda, Swami. Ancient sages. Mylapore, Chennai: Sri Ramakrishna Math. pp. 14–16. ISBN 81-7505-356-9.
ఋగ్వేద మండలములు | 1 · 2 · 3 · 4 · 5 · 6 · 7 · 8 · 9 · 10 |
---|---|
ఋగ్వేద దేవతలు | |
ఋగ్వేద నదులు | |
ఋషులు |
సప్త ఋషులు |
| ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఇతరులు | సనత్కుమారులు · అగస్త్య · అగ్నివేశ మహర్షి · అరుణి మహర్షి · అష్టావక్ర మహర్షి · ఆస్తిక మహర్షి · అథర్వణ మహర్షి · ఆత్రేయ మహర్షి · ఔపమన్యవ మహర్షి · ఔరవ మహర్షి · భృగు మహర్షి · భృంగి మహర్షి · చ్యవన · దధీచి మహర్షి · దేవల మహర్షి · దీర్ఘతమ మహర్షి · దూర్వాస మహర్షి · గర్గ మహర్షి · గృత్సమద మహర్షి · జాహ్న మహర్షి · జైమిని మహర్షి (మీమాంస) · కాంభోజ మహర్షి · కంబ స్వాయంభువ మహర్షి · కాండ్వ మహర్షి (వైశేషిక మహర్షి) · (కౌండిన్య మహర్షి) · కణ్వ మహర్షి · కపిల మహర్షి (సాంఖ్య మహర్షి) · కిందమ మహర్షి · కుత్స మహర్షి · మృకండు మహర్షి · మాండవ్య మహర్షి · మార్కండేయ మహర్షి · నచికేత మహర్షి · నారద మహర్షి · పరాశర మహర్షి · రురు · ఋష్యశృంగ మహర్షి · సాందీపుడు · శతానంద మహర్షి · శంకృతి మహర్షి · శృంగి ఋషి · శుక్ర మహర్షి · శుక మహర్షి · తండిమహర్షి · ఉపమన్యు మహర్షి · వాదుల మహర్షి · వైశంపాయన మహర్షి · వాల్మీకి మహర్షి · వర్తంతు మహర్షి · విభాండక ఋషి · వ్యాస మహర్షి (వేదములు, వేదాంతములు) · యాజ్ఞవల్క మహర్షి | ||||||||||||||
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.