నచికేతుడు
వికీపీడియా నుండి
నచికేతుడు (సంస్కృతం:नचिकेता, IAST: Naciketā) వాజశ్రవుడు అనే బ్రాహ్మణుని కుమారుడు.
"నాకు నచికేతుడిలా చెప్పినది మారుమాటాడక చేసే వాళ్ళుంటే ఒక పదిమందిని ఇవ్వండి. నేను ఈ ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తాను" అన్నాడు స్వామి వివేకానంద.
ఇంతకూ నచికేతుడు అంటే ఎవరు? అతని గొప్పతనం ఏమిటి?
కఠోపనిషత్తులో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.
వాజశ్రవుడు (ఉద్దాలకుడు) అను బ్రాహ్మణుడు ఒక యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగంలో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి. కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను, గొడ్డులను, ముసలి ఆవులను దానం చేయసాగాడు. ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా! నేనూ నీకు గల సంపదనే కదా. మరి నన్ను కూడా దానం చెయ్యి" అన్నాడు. దీన్ని ఒక బాల్యచేష్టగా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు. కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను యముడికి ఇస్తున్నాను" అని అన్నాడు. (ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).
కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు. అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా! ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్య దోషం వస్తుంది. మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి." అని యముని వద్దకు వెళ్ళాడు.
నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయంలో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు. నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రోజులు నిరాహారంగా ఉన్నాడు. యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథిని మూడు రోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను. అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.
అప్పుడు నచికేతుడు " ఓ యమధర్మరాజా! మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి (ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమానపడకుండా ఉండడానికి), అతని పాపాలన్నీ పోవాలి. రెండవ వరంగా స్వర్గ ప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని, దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు. యముడు సంతోషంతో నేర్పించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేత యజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు. ఇక మూడవ వరంగా మరణానంతర జీవితం గురించి, బ్రహ్మఙ్ఞానం గురించి ఆడిగాడు. యముడు అది చెప్పడం ఇష్టం లేక ధన, వస్తు, కనక, వాహన, కాంతలను అనుగ్రహిస్తానని అన్నాడు. కాని నచికేతుడు నిరాకరించడం వలన యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.
తర్వాత నచికేతుడు సంతోషంతో తన ఇంటికి రాగా తన తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు.
ఈ కథను కఠోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది.
మూలాలు
[మార్చు]- Sister Nivedita & Ananda K.Coomaraswamy: Myths and Legends of the Hindus and Bhuddhists, Kolkata, 2001 ISBN 81-7505-197-3
- Sri Krishna Prem: The Yoga of the Kathopanishad, London, John M. Watkins, 1955 (No ISBN)
- కఠఉపనిషత్తు
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]సప్త ఋషులు |
| ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఇతరులు | సనత్కుమారులు · అగస్త్య · అగ్నివేశ మహర్షి · అరుణి మహర్షి · అష్టావక్ర మహర్షి · ఆస్తిక మహర్షి · అథర్వణ మహర్షి · ఆత్రేయ మహర్షి · ఔపమన్యవ మహర్షి · ఔరవ మహర్షి · భృగు మహర్షి · భృంగి మహర్షి · చ్యవన · దధీచి మహర్షి · దేవల మహర్షి · దీర్ఘతమ మహర్షి · దూర్వాస మహర్షి · గర్గ మహర్షి · గృత్సమద మహర్షి · జాహ్న మహర్షి · జైమిని మహర్షి (మీమాంస) · కాంభోజ మహర్షి · కంబ స్వాయంభువ మహర్షి · కాండ్వ మహర్షి (వైశేషిక మహర్షి) · (కౌండిన్య మహర్షి) · కణ్వ మహర్షి · కపిల మహర్షి (సాంఖ్య మహర్షి) · కిందమ మహర్షి · కుత్స మహర్షి · మృకండు మహర్షి · మాండవ్య మహర్షి · మార్కండేయ మహర్షి · నచికేత మహర్షి · నారద మహర్షి · పరాశర మహర్షి · రురు · ఋష్యశృంగ మహర్షి · సాందీపుడు · శతానంద మహర్షి · శంకృతి మహర్షి · శృంగి ఋషి · శుక్ర మహర్షి · శుక మహర్షి · తండిమహర్షి · ఉపమన్యు మహర్షి · వాదుల మహర్షి · వైశంపాయన మహర్షి · వాల్మీకి మహర్షి · వర్తంతు మహర్షి · విభాండక ఋషి · వ్యాస మహర్షి (వేదములు, వేదాంతములు) · యాజ్ఞవల్క మహర్షి | ||||||||||||||
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.