For faster navigation, this Iframe is preloading the Wikiwand page for వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 9.

వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 9

వికీపీడియా నుండి

మరీ ఇన్ని చిత్రాలా!!!!!!!!

[మార్చు]

మితృలు చంద్రకాంతరావు గార్కి, చిన్న అంశాలకు కూడా ఎక్కువ చిత్రాలు కొంతమంది చేరుస్తున్నారు.భూచక్ర గడ్డ కు ఇన్ని చిత్రాలేల. అన్ని చిత్రాలలో ఉన్న అంశం కూడా ఒక్కటే. వారికి చిత్రాలను చేర్చాలని ఉంటే మొక్క పటం, ఆకు, పూవులు, కాయలు, వేరువ్యవస్థ అది పెరిగే భూములు వంటి రకరకాల చిత్రాలను చేర్చాలి. కెమేరా ఉందని ఒకే అంశానికి ఇన్ని చిత్రాలను చేర్చడం సబబుగా లేదు. వైవియస్ రెడ్డి గారు వ్యాసానికి ఇచ్చే ప్రాధాన్యత 2% అయితే అనవసర చిత్రాలకు ఇచ్చే ప్రాధాన్యత 98% ఉన్నది. కంకుల గడ్డ అనే అంశం టూకీగా వ్రాసారు. దాన్ని లోహిత్ గారు సరిచేసినారు. ఈ అంశంలో గొడ్డ నిర్మాణం పనిచేయు విధానం అవసరం. నిర్మాణం గూర్చి వారు ఒక చిత్రం, లోహిత్ గారు వారు తయారుచేసిన చిత్రం ఉంచారు. చిత్రం చేర్చినందుకు ధన్యవాదాలు. కాని ఒకే అంశంపై ఇన్ని చిత్రాలా! కంకుల గడ్డ ముందునుంచి,వెనుకనుంచి,ప్రక్కనుంచి, 45 డిగ్రీల కోణంలో ఇలా పోటోలు తీస్తే కొన్ని వందల చిత్రాలను తీయవచ్చు.వాడుకరులు అంశానికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారు.వారు చిత్రాలను చేర్చాలనుకుంటే కంకుల గడ్డ,చిత్రము, కల్లం లో నూర్చుతున్న దృశ్యం అనే చిత్రాలు సరిపోతాయి. ఇటువంటి విషయాలను మీరు గమనించాలి.వాడుకరులకు సరియైన సలహాలను యిచ్చి తెవికీ ప్రమాణాలను పెంచమలి చెప్పండి.(106.206.192.85 00:38, 5 డిసెంబర్ 2012 (UTC))

వ్యాసాలలో ఎన్ని బొమ్మలు ఉండాలనే విషయంపై ఇప్పటివరకు తెవికీలో ఎలాంటి నియమాలు, పద్దతులు లేవు. ఇదివరకే ఈ విషయంపై కొన్ని సార్లు చర్చ జరిగింది కాని ఎటూ నిర్ణయం జరగలేదు కాని వ్యాసానికి అవసరం లేని బొమ్మలు, ఆ వ్యాసానికి ఎలాంటి ప్రత్యేకత లేని బొమ్మలు ఉండరాదనీ, ... ఇలా కొందరు సభ్యులు బొమ్మలను వ్యతిరేకించిననూ వ్యాస పరిమాణం అధికంగా ఉన్నప్పుడూ బొమ్మలూ అధికంగా ఉండటంలో తప్పులేదనీ, బొమ్మలు చేర్చే సభ్యుల ఉత్సాహాన్ని నీరుకార్చరాదనీ ... ఇలా ఒక్కో సభ్యుడు ఒక్కో రకమైన అభిప్రాయం వెలిబుచ్చారు (చూడండి). ఇప్పుడు మీకు బొమ్మలపై కొత్తగా చర్చను కూడా లేవనెత్తవచ్చు. సభ్యుల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:24, 5 డిసెంబర్ 2012 (UTC)

బీటా వల్గరిస్ నుండి బీటా కణం బయటకు తీయండి.

[మార్చు]

గౌరవనీయులు చంద్రకాంత రావు గారికి
మీరు నేను తయారుచేసిన బీటా కణం నకు అయోమయ నివృత్తి కోసం దారి మళ్ళించారు. మీరు బీటా కణం అనే అంశాన్ని వేరుగా ఉంచండి. ఎందువలనంటే బీటా అనగా 24 గ్రీకు అక్షరములలో రెండవది. దానికి వేరుగా పేజీ ఉండాలి. బీటా కణం అనగా హీలియం కేంద్రకం. దీనికి వేరుగా పేజీ ఉండాలి. బీటా విఘటనం అనగా భార కేంద్రకం నుండి బీటా కణం వెలువడితే యేర్పడే మార్పు. బీటు దుంప అనగా ఒక వేరు. ఇన్ని తేడాలు ఉన్నప్పు వాటిని వేరుగా చూపండి. పదాలలో అర్థాలలో మార్పులు ఉన్నవి కావున. పేజీలను వేరుగా ఉంచండి. ఒకే పదమునకు రెండు అర్థాలుంటే అయోమయ నివృత్తి చేయండి. వేర్వేరు అంశాలకు చేయకూడదని నా అభిప్రాయం.( కె.వి.రమణ- చర్చ 14:08, 5 డిసెంబర్ 2012 (UTC))

బీటా అయోమయంవృత్తి నేను చేయలేదండి. రాజశేఖర్ గారు చేశారు. దాన్ని మీరు మార్చవచ్చు కూడా, లేదా దాన్ని అలాగే ఉంచి బీటా (కణం), బీటా (అక్షరం)..... ఇలా పేజీలను కూడా సృష్టించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:14, 5 డిసెంబర్ 2012 (UTC)

అడ్డుకొలత వ్యాసంపై సలహా కొరకు

[మార్చు]

చంద్రకాంతరావు గారికి,

డయామీటర్ అనే ఆంగ్ల వ్యాసానికి తెలుగులో అనేక పేర్లు కలవు. ఉదాహరణకు కొన్ని అడ్డుకొలత, వ్యాసరేఖ, వృత్తము మధ్య రేఖ, వ్యాసం, వృత్త వ్యాసం. అయితే డయామీటర్‍కు మూల అర్థం అడ్డుకొలత, అదే పేరు మీద నేను వ్యాసాన్ని ప్రారంభించి వ్యాసం (అడ్డుకొలత) నుంచి దారి మార్పు ఇచ్చి వ్యాసం అయోమయ నివృత్తి కూడా ఏర్పాటు చేసాను. అయితే కె.వి.రమణ గారు అడ్డుకొలత అనే పేరు సరియైనది కాదని వ్యాసము(diameter) అనే కొత్త వ్యాసాన్ని ప్రారంభించారు, దానిలో నేను వ్రాసిన విధంగానే వ్రాసి మరికొంత సమాచారాన్ని జోడించారు. అడ్డుకొలత అనే పేరు సరియైనది కాదు అని అనిపిస్తే సరియైన పేరుకు తరలించి వ్యాసము(diameter)ను విలీనం చేయవలెనని మనవి.YVSREDDY (చర్చ) 05:25, 23 డిసెంబర్ 2012 (UTC)

నేను రోడ్డు నియమాలు వ్యాసాన్ని ప్రారంభించినప్పుడు రాజశేఖర్ గారు దానిని పేజీ చరితం చెడిపోకుండా రహదారి నియమాలుకు తరలించారు. పేజీ చరితం చెడిపోకుండా పేరు మార్పు చేయగలిగినప్పుడు సరియైన పేరును సూచించి పేరు మార్చమని విన్నవించుకోవాలి గాని ఆ పేరు తప్పుగా ఉంది అని మరొక పేరుతో వ్యాసం సృష్టించడం ఏమిటి, అడ్డుకొలత పేరు సరియైనదిగా లేదని వ్యాసము(diameter) పేరుతో కె.వి.రమణ గారు కొత్తగా వ్యాసం ప్రారంభించారు, ఈ పేరు బాగా లేదని మరొకరు వ్యాస రేఖ అని ప్రారంభిస్తారు, ఈ పేరు కూడా బాగాలేదని మరొకరు మరొక వ్యాసం ప్రారంభిస్తారు, అలా ప్రారంభించవచ్చా సరైన సలహా ఇవ్వండి. మీ YVSREDDY (చర్చ) 14:06, 23 డిసెంబర్ 2012 (UTC)


అడ్డుకొలత వ్యాసానికి కె.వి.రమణ గారు సూచించిన సరియైన పేరు మార్పుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. మీ YVSREDDY (చర్చ) 15:44, 23 డిసెంబర్ 2012 (UTC)

చంద్రకాంతరావు గారికి నమస్కారములు, కొన్ని ఆంగ్ల పదములకు వేర్వేరు అర్థాలు ఉండవచ్చు. ఒక పదానికి సమానార్థం యిచ్చే పదం ఉండదు. కాని యించుమించు సమానార్థం యిచ్చె పదాలు లభిస్తాయి. ఉదాహరణకు 'bat' అనె పదమునకు రెండు అర్థాలుంటాయి. అవి 'బ్యాటు ' మరియు "గబ్బిలం" రెండు అర్థాలున్నాయని "గబ్బిలం" వ్యాసం వ్రాసేటప్పుడు మనకి నమానర్థం యిచ్చే పదాన్ని విస్తరించాలి కాని క్రికెట్ లో బ్యాట్ ను విస్తరించరాదు. అదే విధంగా cricket అనే పదమునకు "క్రికెట్"మరియు "మిడుత" అనే రెండు అర్థాలుంటాయి. మనవ్యాసమునకు సంబంధం ఉన్న అంశాన్ని తీసుకోవాలి. ప్రస్తుత విషయానికొస్తే "అడ్డు కొలత " అనే వ్యాసాన్ని రెడ్డి గారు ప్రారంభించారు. దాని సరియైన ఆంగ్ల పదం diameter అవ్వచ్చు లేదా measure of the cross section కావచ్చు. diameter అను పదమునకు రెండు అర్థాలుండవచ్చు. కాని జన సామాన్యంలో ఏ పదం ఎక్కువ వినియోగమే ఆ పేరుతో వ్యాసం వ్రాస్తే బాగుంటుంది. అందువలన వ్యాసము(diameter) పేరుతో వ్యాసం విస్తరించాను. ఇంకా విస్తరిస్తాను. తెవికీ లో వ్యాసములు తయారుచేయటం మన కొరకు కాదని రెడ్డి గారు గుర్తించాలి. సమాజం లో విధ్యార్థుల అవసరానికని గుర్తించాలి. ఎవరైనా విషయాన్ని విస్తరిస్తే ప్రోత్సహించాలి. గాని వివిధ రకాల పేర్లు పెట్టి దారి మార్పులు చేస్తూ వాడుకరులను అయోమయం లోకి నెట్టివేస్తున్నారు. అయినా తెవికీ వ్యాసాలలో మన పేరు ఉంటుందా! సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని వ్యాసాలు చేయాలి. ఆయన చేసిన వ్యాసాలు అడ్డుకొలత, వ్యాసం (అడ్డుకొలత),వ్యాసము(డయామీటరు),వ్యాసరేఖ వంటివి అనేకం ఉంచి అయోమయంలోని నెట్టివేస్తున్నారు.నేను యింకను ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేయదలచితిని. అందువలన దీనిని విలీనం చేయవద్దు. ఎవరైనా విశేషంగా వ్రాసినట్లయితే అందులో విలీనం చేయండి లేదా తొలగించండి.( కె.వి.రమణ- చర్చ 10:04, 23 డిసెంబర్ 2012 (UTC))
మీరిద్దరు పైన ఇచ్చిన విషయాలను మాత్రమే కాకుండా నేనూ రోజూ అందరి రచనలను పరిశీలనలో భాగంగా గమనించబడిన విషయాల ఆధారంగా నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే తెవికీ సంప్రదాయం ప్రకారం ఏదేని వ్యాసం మొదట ప్రారంభించినదే ఉంచి తర్వాత చేర్చిన వ్యాసాలను తొలిగించడం కాని దారిమార్పులు చేర్చడం కాని చేయడం జరుగుతుంది. చాలా వ్యాసాలు తెవికీలో ఇదివరకే ఉన్ననూ కొందరు ఆ విషయం గ్రహించక మళీ కొద్దిపేరుమార్పుతో ఇదివరకే ఉన్న వ్యాసం కన్నా పెద్దగా, నాణ్యతతో రచించిననూ తర్వాత చేర్చబడిన వ్యాస సమాచారాన్ని మొదటగా సృష్టించిన వ్యాసంలోకి విలీనం చేయడం జరుగుతుంది. 5 రోజుల క్రితం Sampathg185 అనే సభ్యుడు ఇదివరకే ఉన్న సినిమా వ్యాసాలను చివరన ...(సినిమా) పేరుతో కొత్తగా సృష్టించినాడు. పాత వ్యాసాలలోని సమాచారమే అందులో చేరి పాత వ్యాసాన్ని అతను సృష్టించిన వ్యాసానికి దారిమార్పు ఇచ్చాడు. (పాత వ్యాసానికి తరలింపు ద్వారా కొత్తపేరు ఇస్తే చరితం కూడా కొత్తవ్యాసానికి బదిలీ అవుతుంది కాని ఇలా చేయలేడు). అలా చేయడం వల్ల వ్యాసం అతనే సృష్టించినట్లు అవుతుంది. పాత వ్యాసం అభివృద్ధికి కృషిచేసినవారి పేరు కొత్తవ్యాసం చరితంలో కనిపించదు. కాబట్టి ఆ విషయం ఆ సభ్యునికి తెలియజేసి నేను అతను సృష్టించిన వ్యాసాలను తొలిగించి ఆ తర్వాత నేను కొత్తపేరుకు తరలించాను, ఇదీ పద్దతి. ఇదంతా చెప్పేది ఎందుకంటే ఎవరైననూ ఇప్పటికే ఉన్న వ్యాస సమాచారానికి పోలిన కొత్త వ్యాసం సృష్టించిననూ మొదటగా సృష్టించిన వ్యాసం మాత్రమే ఉంచబడుతుందని, అయితే వ్యాసం పేరు మాత్రం ఏదైనా ఉంచవచ్చు. ఇక మీ విషయానికి వస్తే మొదటగా YVSREDDY గారు అడ్డుకొలత పేరుతో ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పేరు నచ్చకనో మరే కారణమో కాని కె.వి.రమణ గారు వ్యాసము(diameter) పేరుతో మరో వ్యాసం ప్రారంభించారు. రమణగారు రెడ్డి గారు ప్రారంభించిన వ్యాసానికి కొత్తపేరుకు తరలింపునకు చర్చ ప్రారంభిస్తే బాగుండేది. ఏకంగా మరో వ్యాసం ప్రారంభించడం దానికీ, దీనికి కొన్ని దారిమార్పులు ఇవ్వడం కొంత అయోమయానికి దారితీసింది. చివరగా నేను చేప్పేది- రెడ్డి గారు ప్రారంభించిన వ్యాసమే ఉంచి, పేరు మాత్రం రమణ గారిది ఉంచితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీరిద్దరికీ అంగీకారమేననుకుంటాను. ఎందుకంటే వ్యాసం చరితం ప్రకారం రెడ్డి గారు సృష్టించినట్లు, వ్యాసం పేరు రమణగారు సూచించినట్లు ఉంటుంది. ఇది ఇద్దరికీ అంగీకరమైతే నేను వెంటనే ఆ పనిచేస్తాను. లేకుంటే మాత్రం తెవికీ నియమాలు, సంప్రదాయం ప్రకారం, ఇతర సభ్యుల మెజారిటీ నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకోబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:06, 23 డిసెంబర్ 2012 (UTC)

కాఫీ హక్కుల సలహా కొరకు

[మార్చు]

చంద్రకాంతరావు గారికి, నేను కంప్యూటర్ డిక్షనరీ (ఇంగ్లీషు - తెలుగు) అనే వ్యాసాన్ని తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష అనే పుస్తకం నుంచి తు.చ.తప్పకుండా రాస్తున్నాను. ఇలా రాయవచ్చా, ఇంతకు ముందు ఎవరైనా ఇటువంటి వ్యాసాన్ని ప్రారంభించారా తెలియ జేయగలరు. నేను మూసలు మరియు వర్గాలు సృష్టించడానికి కారణం, ఆంగ్ల వికీపీడియా నుండి అధిక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాను. మీ YVSREDDY (చర్చ) 15:44, 25 డిసెంబర్ 2012 (UTC)

గాజుల సత్యనారాయణ గారు రాసిన పెద్దబాలశిక్షపై కాపీరైట్ హక్కులు పూర్తిగా అతనికే ఉన్నాయి కాబట్టి ఆ గ్రంథం నుంచి యధాతథంగా కాపీచేయడానికి వీలుండదు. అలా చేస్తే కాపీహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. అలాంటి వ్యాసాలు పూర్తిగా తొలిగించబడతాయి. రచయిత అనుమతి కాని, లేదా కాపీహక్కుల కాలపరిమితికాని ముగిసిన వాటికి మాత్రము కాపీ చేయవచ్చు. ఇక మూసలు వర్గాల విషయానికి వస్తే మూసలు అధిక సంఖ్యలో ఉన్ననూ ఎలాంటి ఇబ్బంది లేదు కాని వర్గాలు మాత్రం మరీ లోతుగా లేనట్లు చూసుకోండి చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:50, 25 డిసెంబర్ 2012 (UTC)

రావుగార్కి,మూసలను సవరించినందుకు మరియు మీసలహకు ధన్యవాదాలు.నాకు మూసల గురించి అవగాహన లేదు.రమణగారు చెట్లనుంచి వచ్చే నూనెగింజలు మూసను చేసారు.దాని లోని లోపాన్ని సరిదిద్దేప్రయత్నంలో,అనుభవరాహిత్యం వలన అలాజరిగింది.పాలగిరి (చర్చ) 15:55, 27 డిసెంబర్ 2012 (UTC)

ప్రైవేటు సంస్థల వివరములు చేర్చుట గూర్చి

[మార్చు]

తెవికీ లో గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల వంటి వ్యాసాలు ప్రకటనల క్రిందికి వస్తాయని నా అభిప్రాయం. ఇటువంటి వ్యాసాలు చేర్చవచ్చా!-శర్మ(223.177.98.99 13:00, 9 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ప్రకటనలు తెవికీ మూల సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ విషయంలో కొన్ని సార్లు ఎటూ తేల్చుకోని పరిస్థితి ఎదురుకావచ్చు. కొన్ని వ్యాసాలు ఒక రకంగా చూస్తే ప్రకటనల వలె, మరో రకంగా చూస్తే ప్రజాప్రయోజనాల వలె ఉండవచ్చు. మీరు తెలియజేసిన వ్యాసం కూడా ఈ రకమైనదే. ప్రకటనలు, ప్రచారం అని మనం వ్యాసాలు తొలిగిస్తే ఒక రకంగా ఇక్కడ వ్యాసాలేవీ మిగలకపోవచ్చు. ఉదా:కు ఒక రాజకీయ నాయకుడి వ్యాసం అతనికి ప్రచారం కలిగిస్తుందని తొలిగించలేము కదా, అలాగే రాజకీయ పార్టీల వ్యాసాలు కూడా. ప్రైవేటు కర్మాగారాల గురించి, ఉత్పత్తుల గురించిన వ్యాసాలు కూడా ఉన్నాయి. కాబట్టి శర్మగారు, ఒక విషయం గుర్తించుకుందాం- వ్యాసంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా కేవలం సమాచారమే ఉన్నదా? లేదా కరపత్రం/ పత్రికా ప్రకటనల వలె ప్రచారం కూడా ఉన్నదా? వ్యాసంలో అధిక సంఖ్యలో బయటిలింకులు ఉన్నవా? అని పరిశీలించండి. ఒకవేళ వ్యాస సమాచారం చేర్చిన వారి ఉద్దేశ్యం ప్రచారం కలిగించాలనేది అని గమనించబడితే వ్యాసం లేదా వ్యాస సమాచారం తప్పకుండా తొలిగించబడుతుంది. అలాగే కళాశాలకు చెందిన స్వంత వెబ్ సైట్ వలె వ్యాసం సుధీర్ఘంగా, వారి స్వంత వివరాలతో కూడిన సమాచారంతో ఉండనవసరం లేదు. అయితే నేను ఇలాంటి వ్యాసాలను సమర్థించడంకాని, తొలిగించాలని చెప్పడం లేను. ఈ వ్యాసంపై మీకు ఇంకనూ ఎలాంటి అభ్యంతరం ఉన్నా చర్చా పేజీలో తెలిపితే మిగితా సభ్యులు కూడా తమతమ అభిప్రాయలు తెలియజేస్తారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:42, 9 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండ గూర్చి

[మార్చు]

చంద్రకాంతరావు గారికి నమస్కారములు,
తెవికీ లో రచ్చబండ లో కొన్ని చర్చలు ఉంచినపుడు వాటిలో క్రియాశీలక సభ్యులు కూడా కొంతమందే పాల్గొనుచున్నారు. చర్చ జరగవలసిన అంశం "రచ్చబండ" లో చేర్చినపుడు వాడుకరులందరికీ సదరు విషయం మెయిల్ రూపంలో వెళితే మరికొంతమంది పాల్గొను అవకాశం కలుగునని నా అభిప్రాయం. రచ్చబండ వేదికను ఒక చర్చా వేదికగా కాక ప్రచారానికి కొందరు సందేశాలు యిచ్చుటకు కొందరు వినియోగిస్తున్నారు. ఇది సరియైనదేనా?( కె.వి.రమణ- చర్చ 03:52, 10 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

సామాజిక అంశాలు చర్చించవచ్చా?తెవికి వ్యాసాలపైన మాత్రమే చర్చలు ఉండాలా? కె.వి.రమణ- చర్చ 04:42, 10 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
1)రమణ గారు, తెవికీ అనేది ఎవరికి వారు స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం కాబట్టి ఎవరినీ బలవంతం చేయడం గాని వత్తిడి చేయడం గాని చేసే అవసరం లేదు. కాబట్టి వారికి మెయిల్ పంపి చర్చలలో పాల్గొనేటట్లు చేసే అవసరం లేదనుకుంటాను (సెట్టింగ్ లో కొద్దిగా మార్చుకుంటే చాలు వారి చర్చా పేజీలో ఇతరులు దిద్దుబాటు చేసినప్పుడు మాత్రం మెయిల్ వస్తుంది). చర్చలలో సభ్యులు అరుదుగా పాల్గొనమనేది మొదటి నుంచి ఉన్నదే. రాజశేఖర్ గారు లాంటి వారు రోజూ ఎన్నో దిద్దుబాట్లనూ చేసే సమయంలో కూడా చర్చలలో చాలా అరుదుగా పాల్గొన్నారు. అంతేకాకుండా చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడనని అతను స్వయంగా చెప్పారు కూడా. చురుకైన సభ్యులు దిద్దుబాట్లు చేస్తున్నారంటే రచ్చబండ కాని ఇతర చర్చాపేజీలు కాని తప్పకుండా వీక్షిస్తున్నారనే అనుకోవచ్చు. చర్చలలో పాల్గొనకపోవడం వారి ఇష్టం. అసలు దిద్దుబాటు చేయని వారు కూడా రోజూ తెవికీలో జరిగే పరిణామాలు చూస్తుంటారు. జనవరి 2013 మాసంలో ఇప్పటివరకు (9 రోజులలో) రచ్చనుబండకు 628 వీక్షణలు జరిగాయి (చూడండి)
2)రచ్చబండను ప్రచార వేదికగా ఉపయోగించడం తప్పే. ఇదివరకు కూడా కొందరు కొత్త సభ్యులు ప్రచారంకోసం ఉపయోగించ ప్రయత్నించారు. అలాంటి సమాచారాన్ని ఎవరైనా సరే వెంటనే తొలిగించవచ్చు.
3)తెవికీలో సామాజిక సమస్యలు చర్చించడానికి అవకాశం లేదు. ఎందుకంటే తెవికీ సామాజిక ఉద్ధరణ సంస్థ కాదు, మనం సంఘసంస్కర్తలము కాము (ఇక్కడ మాత్రమే). అయితే సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాల చర్చలలో భాగంగా ఇలాంటివి కూడా చర్చలలో వచ్చాయి, వస్తుంటాయి కాని వీటిని వ్యాసాలకే పరిమితం చేయాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:53, 10 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మొదటి పేజి సవరణ

[మార్చు]

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వ్యాసంలో నవంబరు 11 న జన్మించినట్లు ఉన్నది.దీనిని మొదటి పేజీలో కూడా సరిచేయగలరు. కె.వి.రమణ- చర్చ 01:39, 11 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారు మార్పు చేశారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:09, 11 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

2012 లోమీ కృషికి అభివందనలు

[మార్చు]
,--అర్జున (చర్చ) 07:02, 15 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాద్యత

[మార్చు]

తెవికీ అభివృద్ధికి రచ్చబఁడ లోని చర్చలు ఎంతో దోహదపడతాయనే విషయం మీకు తెలియనిది కాదు. నిర్వహణాధికారిగా మీరు స్పందించ వలసిన అవసరం ఉంది. కొత్త సభ్యులకు దిశానిర్ధేశం చేయవలసిన మీరు చర్చల పట్ల ఉదాసినంగా ఉండటం మాకు బాథ కలిగిస్తుందిః దయచేసి రచ్చబండలో "ఏకవాక్య వ్యాసాలు" కు మీస్పందనను తెలియజేయండి.(Rojarani (చర్చ) 04:04, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

పూర్తికాలం నిషేధం ఎందుకు విధించాలి?

[మార్చు]

చంద్రకాంతరావు గార్కి నమస్కారములు,

మీకు నేసు చేసిన చర్యలు దుశ్చర్యలుగా భావించినట్లయితే మీరుకూడా నిర్వాహకులే కదా! నన్ను కారణం చూపి పూర్తి కాలం నిషేధించండి. తెవికీకి మీరే శాశ్వత సభ్యులుగా ఉండండి. సంతోషిస్తాను. నేను ఏఒక్కరి వ్యాసాల పైనావివక్ష వహించడం లేదు. ఎన్నో పూర్తిగా విషయం లేని వ్యాసాలను తెలియజేశాను.అజ్ఞాత వాడుకరులు సృష్టించిన అనవసర పేజీలలో తొలగింపు మూసలుంచాను. వ్యాసాలలో తప్పులను తెలియజేశాను. అలా తెలియజేయతం తప్పంటారా! నేను ఏనాడు ఏ ఒక్క వ్యాసాన్ని గాని, వ్యాస భాగాన్ని గాని తొలగించటం చేయలేదని గమనించగలరు. చాలా మంది సభ్యుల వ్యాసాల పై అభిప్రాయాలను తెలియ జేశాను. మీరు నా రచనలు లో చూసి పరిశీలించండి. నాకు "తొలగింపు", "విలీనం","విస్తరణ " , "అనువాదం" మూసలు ఉంచే హక్కు లేదంటారా? నేను ప్రతిపాదన చేసిన తర్వాత దానిపై చర్చ జరిగి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలి. నేను తొలగించమంటే మీ నిర్వాహకులు తొలగిస్తారా? దానిపై చర్చ అవసరం లేదా! అటువంటి మూసలు ఉంచటం తప్ప నేను తెవికీ ప్రమాణాలను, నాణ్యతను ఏ విధంగా తగ్గించలేదని మీరు గమనించాలి. అటువంటి మూసలు ఉంచటం తెవికీ విధివిధానాలకు అనుగుణంగా లేకపోతే అటువంటి మూసలు పూర్తిగా నిషేధించండి. నేను ప్రతిపాదన చేసిన తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నాను. మీరెవరూ చర్చలో పాల్గొనకుండా తొలగించి ఆ తప్పు, వివక్ష నాపై జల్లడం భావ్యమా! మీకు పైన నేను తెలిపిన చర్యలు యిష్టం లేనట్లయితే నన్ను నిషేధించండి. నిషేధించే ముందు ఈ రచ్చబండలో నేను చేసిన తప్పులను తెలియజేయండి. యిక సెలవు.(Somu.balla (చర్చ) 14:41, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

నాపై గౌరవనీయ నిర్వాహకులు చంద్రకాంతరావు గారు చేసిన వ్యాఖ్యకు స్పందించండి.నిర్వాహకులు,సహసభ్యులు నేను చేసిన విధానం తప్పు అంటే తప్పుకుంటాను.(Somu.balla (చర్చ) 14:41, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
నా వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారు. సాక్పిప్పెట్ అయితేనే పూర్తికాలం నిషేధం అన్నాను కాని మాటిమాటికి ఒక సభ్యుని జోక్యం చేసుకున్న మాత్రానికే పూర్తినిషేధం అనలేను. అయిననూ ఒక సభ్యునికి వ్యతిరేకంగా మరీ ఇంతగా అతని దిద్దుబాట్ల విషయంలో జోక్యం చేసుకోవడం అవసరమా అని మీరే ఆలోచించండి. చిన్న వ్యాసాల సమస్య అనేది మొదట నుంచే ఉన్నది. సంవత్సరాల నుంచీ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి కాని ఏ ఒక్క సభ్యునిపై ప్రత్యేకించి ఇలాంటి వ్యతిరేక భావనలు రాలేవు. ఆ సంగతి వదిలేయండి. ఇక మీ విషయానికి వస్తే మీరు ఏ సభ్యునికీ సాక్పిప్పెట్ కాకపోతే మీకు అభ్యంతరం ఎందుకు? ఒకవేళ సోముబల్లా, రోజారాణి, సంతు కొత్త సభ్యపేర్లు సాక్పుప్పెట్ అయితే సంబంధిత సభ్యులు ముందే ఒప్పుకోవడం మంచిది. మెటావికీలో స్టీవార్డులను సంప్రదిస్తే మొత్తం తెలిసిపోతుంది. ఇదివరకే ఒక సభ్యత్వం ఉండి ఉద్దేశ్యపూర్వకంగా మరో సభ్యత్వంతో ఇతరులను ఇబ్బందిపరిస్తే మాత్రం తప్పకుండా పూర్తికాలం నిషేధం విధించాల్సిందే. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. అలాగే మీరు పైన చెప్పిన కొన్ని వ్యాఖ్యలు సమంజసంగా లేవు. "అటువంటి మూసలు ఉంచటం తెవికీ విధివిధానాలకు అనుగుణంగా లేకపోతే అటువంటి మూసలు పూర్తిగా నిషేధించండి" అనడం తెవికీ వ్యవస్థ పైనే దాడిచేయడం లాంటిది. మూసలున్నంత మాత్రాన ఎలా ఉపయోగించాలో మరీ చెప్పే అవసరం లేదనుకుంటాను. కత్తిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు అంత మాత్రాన దుర్వినియోగపర్చినందుకు తెలియజేస్తే కత్తి ఎందుకు తయారుచేశారు అని అనగలమా? సి. చంద్ర కాంత రావు- చర్చ 15:45, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కత్తి కంటే కలం పదునైనది. కలాన్ని కూడా కొందరు సభ్యులు చెత్త రాతలతో,ఏక వాక్యాలతో దుర్వినియోగపరుస్తున్నారు. వాటిపై మీ అభిప్రాయం తెలియజేయండి. తప్పును ఎత్తిచూపే వారిపై ఎందికంత కోపం. తొలగింపు మూసలు ఉంచినపుడు మీరు చర్చించవచ్చు కదా! మీరు "రెడ్డి గారి వ్యాసాలు" అంటున్నారు. తెవికీలో వ్యాసాలు ఒకరి స్వంతమా! మీకు తేవికీ ప్రయోజనాలే ముఖ్యమైతే వ్యక్తులను ఎందుకు వెనకేసుకొస్తారు? మీరేందుకు తెవికీకి దూరంగా ఉంటారు. తెవికీ లో పనిచేయటం నా వృత్తి కాదు. ప్రవృత్తి. నాసభ్యత్వాన్ని నిషేధిస్తే నా కేమి నష్టం లేదు. నాకు మీరు చేయాల్సిన పనులు చేసే శ్రమ తప్పుతుంది. ఉంటాను. మీ సోము (ఈ చర్చ 106.206.13.149 అడ్రస్ తో వ్రాయబడినది, 01:48 17 ఫిబ్రవరి 2013)
ఏకవాక్యాలపై నా అభిప్రాయం ఎప్పుడో తెలియజేశాను. అదేవిషయాన్ని మళ్ళీమళ్ళీ తెలియజేయనవసరం లేదు. తప్పును ఎత్తిచూపే వారిపై నేనేమి కోపం ప్రదర్శించలేను. నిబంధనలకు, పద్దతులకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి ఉద్దేశించే చెప్పాను. "రెడ్డి గారి వ్యాసాలు" పదాన్ని సందర్భం బట్టి అర్థం చేసుకోవాలి. నా పెన్ను, నా ఇల్లు అంటే అర్థం ఉంటుంది కాని నా ఊరు, నా దేశం అంటే నా స్వంతం అన్నట్లుగా అనుకోవద్దు. అలాగే ఇక్కడ నేను ఏ సభ్యుడినీ వెనుకేసుకోవడం లేదు. అతనికి కాని, అతని చర్యలకు కాని మద్దతు పలకడం లేదా అతను చేసింది సరైనదేనని ఎప్పుడూ చెప్పలేను. రెడ్డిగారి పొరపాట్లను తొలుత బయటపెట్టినది నేనేనని తెలుసుకుంటే మంచిది. సభ్యనామంతో బొమ్మపేర్లు చేర్చుతున్నప్పుడు, చిన్నవ్యాసాలకు కూడా పదేసి దారిమార్పులు పెడుతున్నప్పుడు, లోతు వర్గాలు సృష్టిస్తునప్పుడు ఇలా అనేకసార్లు నేనే తెలియజేశాను కదా. తెవికీలో ఎవరితోనూ నాకు ప్రత్యక్ష సంబంధం లేదు, అలాగే శతృత్వమూ లేదు. సెలవులోకి వెళ్లకముందు వరకు కూడా నిర్వహణలో భాగంగా అందరి దిద్దుబాట్లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా చేసిన వారినందరికీ చెప్పాను. ఇప్పుడు నేనెందుకు తెవికీకి దూరంగా ఉన్నారని అడుగుతున్నారు కాని దానికి కారణం అప్పుడే తెలియజేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:08, 17 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దిగజారటం మొదలైంది కనుక నేనూ దిగజారిపోవాలని నిర్ణయించుకొన్నాను అదీ చంద్రకాంతరావు దయవలన అతడికి ఏకవచనం తప్పుకాదు కనుక ఇలా రాస్తున్నాను. ఒక సభ్యుని తప్పులను సరిదిద్దుతూ అతనికి సహాకారము అందించుట సీనియర్ సభ్యుల భాద్యత. రెడ్డి పై మొదట్లో ఎవరికీ ఏ భావమూ లేదు కొంతవరకూ అందరూ సహకరించారు. కాని ఎందరు సరిదిద్దలని ప్రయత్నించినా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయడం వలన ఈ సమస్య తలెత్తింది. అతడు చెప్పినా ఎందుకు చేయడం లేదు అనేదే సమస్య. తెలియనపుడు నేర్చుకోవడం అనేది మమూలే కాని ఎందరు రాసినా చూడనట్టుగా తనపని తాను చేసుకు వెళ్ళడం ఇతర సభ్యులను అగౌరవపరచడం అవుతుంది. సభ్యులు వీటి గురించి అతడి సభ్యపేజీలో రాసిన సమాచారము అంతా చెరిపేయడం చేస్తాడని నీకు తెలియనట్టున్నది. నాకెందుకులే వదిలేద్దాం అనుకోవడానికి ఇది నాదీ నీదీ రెడ్డి యొక్క సొంత సైట్ కాదు. నాకు అతడు ఎవరో తెలియదు. రెండు వ్యాసలకు సంభందించిన సమాచారం ఒకేవిధంగా ఉండుట వలన విలీనం చేసాను. దానిని అతడు మళ్ళీ సృష్టించాడు. నేను విలీనం చేసాను అని చెప్పి మళ్ళీ సృష్ట్ంచవద్దని మళ్ళీ తొలగించాను అతడు మళ్ళీ సృష్టించాడు. ఇదేమన్నా ఆటా పనీ పాటా లేకుండా చేస్తూ పోవడానికి. వ్లీనం చేసిన వ్యాసాన్నే ఎందుకు అభివృద్ది పరచకూడదు. అలా జరిగితే అతడు నువ్వు అనే అవసరమే ఉండదు. ఎవరినైనా సమర్ధించాలనుకొన్నపుడు అతడు ఏం చేస్తున్నాడు అని చూసి మొదట అతడికి చెప్పి నీమాట వింటే అపుడు సమర్ధించు. కనుక అతడిని సంస్కరించే పనిలో ఉండు.విశ్వనాధ్ (చర్చ) 13:03, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిజంగానే దిగజారినందులకు చాలా సంతోషం. పూర్తిగా దిగజారిన సభ్యునికి ఇక చెప్పడం అంటూ ఏమీ ఉండదు. తెవికీ సమాజానికి నేను చెప్పదలుచుకున్నదేమంటే అసలు ఈ చర్చ ఇన్ని నెలలు సుధీర్ఘకాలం జరిగిందంటే అది ఎలా మొదలైంది అనేది పరిశీలిస్తే కేవలం ఒక్క ఏకవచనం పదం వల్లనే. నెలల తరబడి సభ్యునిపై దాడులపై దాడులు విషయం అందరికీ తెలుసు కాని ముగింపు కావడం లేదు. నిర్వాహకులు వారికి తోడు కొందరు కొత్త సభ్యులు (?) జతకావడంతో సమస్య మరింత ముదిరిపోయింది. చివరగా నేను చెప్పిన అభిప్రాయాలలో రెడ్డిగారికి ఏకోశాన మద్దతు పలకడం కాని, అతను చేసింది సరైనదేనని ఎక్కడా చెప్పలేను. నిర్వాహకులు, కొందరు సభ్యులు కలిసి పదేపదే దాడి చేయడాన్ని మాత్రం తప్పుపట్టాను. నిర్వాహకహోదా దుర్వినియోగపర్చడాన్ని తప్పుపట్టాను. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారికి మద్దతు ఇవ్వకపోవడమే నేను చేసిన తప్పు!! కొందరి పొరపాటు వల్ల సభ్యుడు తన వ్యాసాలను రక్షించుకోవడానికి దీనంగా నిర్వాహకుల సహాయం అర్థింస్తుంటే, తప్పు చేస్తున్నవారికి మీది తప్పు అనడమే సరైనది కాకుంటే ఇది నిరంకుశమే తప్ప ప్రజాస్వామ్యమనిపించుకోదని అర్థం చేసుకోని వారికి నేను చెప్పేదేమీ ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:33, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త సభ్యులకు ప్రోత్సాహం ఇవ్వండి విశ్వనాద్ గారు అని హెడ్డింగ్ పెట్టి మరీ మొదలెట్టారు. 2006 నుండి నేను వికీలో పని చేస్తున్నాను. ఇంతవరకూ ఏ సభ్యుడినీ నేను ఇబ్బంది పెట్టిన సంధర్భం లేదు. ఉంటే చూపించండి నేను తెవికీ నుండి తప్పుకుంటాను శాశ్వతంగా. ఇక అదే 2006 నుండి ఇప్పటి వరకూ ఎందరినో సభ్యులను చూసాను ఎవరూ ఎవరినీ ఏకవచనంతో రాయడం జరగలేదు. మరి మీ ఇద్దరే ఎందుకు చేస్తున్నారు. ఎవరు ముందుగా దిగజారినట్టు. నువ్వా నేనా. చాలా రోజుల ముందు రెడ్డి సభ్య పేజీలో ఇదే విషయం రాసాను. దయచేసి ఏకవచనంతో సంభోదించకండి అని (దించకం'డీ అని) అతడు మళ్ళీ అదే చేసాడు. అప్పుడు అది నీకు చాలా బావున్నట్టున్నది. ఇక నుండి అందరూ మర్యాద లేకుండా ఎవరిని బడితే వాళ్ళను ఎలాగైనా సంభోదించవచ్చునని నువ్వు శెలవిచ్చావు, కాదు నువ్వు మరియు రెడ్డి కలిసి వికీలో ఒక సరికొత్త ఒరవడి ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. రెడ్డి యొక్క ఒక వ్యాసాన్ని విలీనం చేసినందుకే నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ రెడ్డి గురించి ఇలా రాసావు" దీనిపై మరెవరూ మళ్ళీమళ్ళీ అతని దిద్దుబాట్లుకు భంగం కలిగించరాదు. అని ఇదేమైనా రూలా చంద్రకాంతరావూ. అంటే ఇక ఏ సభ్యుడూ రెడ్డి ఏం రాసినా దానికి అభ్యంతర పెట్టకూడదా. అంతేనా ఇంకా మరేమైనా రూల్సు ఉన్నాయా.నీకు మాత్రమే తెల్సినవి. తెలియచేస్తే మేమంతా పాఠిస్తాం.విశ్వనాధ్ (చర్చ) 15:57, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అభిప్రాయభేదాలు ఎప్పుడూ ఉండేవే. విశ్వనాధ్ గారూ, చంద్రకాంతరావూ గారూ మీరిద్దరూ తెవికీ అభివృద్ధి చాలా కృషి చేశారు. కాస్త ఆగి ఆలోచించండి. చర్చలు, ఖండనలు, విభేదాలు అవతలి వాళ్ళూ సదుద్దేశంతోనే చేస్తున్నారని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ రెడ్డి గారికి ఆయన వ్రాసిన వ్యాసాలను ఎవరైనా మార్పులు చేర్పులు చేసే వీలుందని తెలియజెప్పాలి. --వైజాసత్య (చర్చ) 07:22, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నాపై ఏకవచన ప్రయోగం చేసినా నాకేమి ఇబ్బంది లేదు. నా దృష్టిలో అది తప్పేమి కాదు కాని తప్పు అనుకుంటూ కూడా ఏకవచనం ప్రయోగం చేయడం అతడి విచక్షణకే వదిలివేస్తున్నాను. తనకు వ్యతిరేకంగాఒక్క ఏకవచనవ్యాఖ్య చేసినందుకు కక్ష్యగా తీసుకొని (దీనితర్వాత ఏమైందీ చెప్పడం చర్వితచరణమే) సభ్యుడి ముసుగు తొలిగిపోయి నిజస్వరూపం బయటపడింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:39, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, చాలా రోజుల తర్వాత నా చర్చా పేజీలో మీ దిద్దుబాటుకు సంతోషం. ప్రస్తుత దశలో ఒక్కో సభ్యుడు తమకిష్టమైన విధంగా ప్రవర్తించడం కారణంగా నేను తెవికీకి దూరంగా ఉండవలసివచ్చింది. ఒకప్పుడు మీమార్గదర్శకత్వంలో వైభవంగా వెలుగొందిన తెవికీకి మళ్ళీ 2008 నాటివలె చూడాలని ఉంది. మీరు మళ్ళీ తెవికీని ముందుండి నడిపిస్తారంటే నేనూ మళ్ళీ చురుగ్గా దిద్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సెలవులోకి వెళ్ళకముందు గ్రామవ్యాసాలను అభివృద్ధి పర్చే దశలో ఉంటిని. దానికొరకు రాష్ట్రంలోని అన్ని 26వేల గ్రామాలకు సంబంధించిన సమస్త సమాచారం, బొమ్మలతోసహా సేకరించాను. అలాగే తెవికీ రచనల కోసం 1128 మండలాల గురించి పూర్తిసమాచారం సంగ్రహించాను. తెలుగు ప్రజలకు ఎంతో విలువైన ఆ సమాచారంతో ఏమి చేయాలనేది త్వరలోనే నిర్ణయిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:18, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంత్ రావు గారికి తిరిగి స్వాగతం. మీరు తిరిగి వస్తారని తెలుసు. తెవీకికి మీరు అంత సులువుగా దూరం కాలేరు. తెవీకి మీద మీకున్న అభిమానం అలాంటిది. మీ రన్నట్ట్లు వైజాసత్యగారి నిర్వాహంలో నడిచిన కాలం తెవీకి స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. తిరిగి ఆయన తన అధికార పగ్గాలను చేత పడితే పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకం నాకున్నది. గ్రామాల గురించి, మండలాల గురించి మీరు సేకరించిన విషయం సంభ్రమాశ్ఛర్యాలకు గురి చేస్తుంది. మీరు తప్పక ఆ విషయాలను చేర్చి తెవీకిని సుసంపన్నం చేయండి. మరొక్క విషయం కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే మీ ధైర్యానికి జోహార్లు. అనేకమార్లు మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను. అయినప్పటికీ వివాదాలు చర్చల వంటి విషయాలలో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించకుండా వ్యాసాల అభివృద్ధి వంటి విషయాల మీద దృష్టి సారించండి. మొదటి పేనిర్వహణ నిర్వహణలో మీ కృషి స్వేచ్చగా కొనసాగించండి. ఇది కేవలం సలహా మాత్రమే --t.sujatha (చర్చ) 04:48, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావుకు తెవికీలో ఎవరు ఎవరనేది ఎవరికీ తెలియదు. నువ్వెవెవరో నాకు తెలియదు, నేనెనవరో నీకు తెలియదు. తెలియని వాళ్ళను గురించి మర్యాదగా చెప్పడం నా మర్యాద. మర్యాద వదిలేసిన వాళ్ళను సమర్ధించి అమర్యాద పొందడం నీ మర్యాద. నెనవరినీ ఇంతవరకూ అలా అమర్యాద చేయలేదు. కాని మీరు ప్రారంభించిన నువ్వులు, వాడులు అనేవాటిని కొనసాగిస్తేనే ముసుగు తొలగడం లాంటి పదాలు వాడుతున్నావు. నువ్వు నేర్పిన పదములే నీరజాక్షా ఇవి. నీ మీద బురద చల్లడం నా పని కాదు కాని నా మీద బురద చల్లే వాడిని కలుపుకొని తోటి సభ్యుడనైన నా మీద అకారణ ద్వేషంతో బురద చల్లాలని చూస్తున్నావు. దీనిని నీకున్న కారణం కొన్ని సంధర్భాలలో అర్జునరావు గారు మరియు నీ మద్య చర్చలలో ఆయనకు మద్దతు పలకటం అని చాలా మందికి తెలుసు. సంధర్భం కలిసింది కనుక మనమూ ఒక రాయేద్దాం అనుకోవడం మూర్ఖత్వం. కనుక దయచేసి ఇలాంటి వాఖ్యానాలు తోటి సభ్యులపై మానుకొమ్మని నా సలహా.ఇక ముందు దీనిపై చర్చలలో నేను పాల్గొనడం లేదు.మీరివురూ ప్రారంబించిన నువ్వు, వాడు లాంటి ప్రయోగాలను వాడటం నాకూ చాలా కష్టంగా ఉంది ( అలా సంభోదిస్తే ఎంత కటినంగా ఉంటుందో నీకీపాటికే తెలిసుండాలి). కనుక వాటిని మీకే వదిలేస్తాను.విశ్వనాధ్ (చర్చ) 10:07, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నీకు బాగా తెలిసినట్లు మాట్లేడే అవసరం లేదు. ఏకవచనం తప్పుకాదని చెప్పినపిదప దాన్ని అమలుచేసింది నువ్వే. నేనేమీ ఎవరినీ కలుపుకోలేను. నీకు మద్దతు ఇవ్వనందుకే నామీద కోపం ప్రదర్శిస్తున్నావు. నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి కూడా ఇప్పుడిలా చెప్పడం నీ పద్దతికాదు. ఆ సభ్యుడిపై నేను ఇదివరకే కొన్ని తప్పులను చూపినప్పుడు గుర్తురాలేదు ఆ తర్వాత ఎందుకు ఎగిఎగిరిపడ్డావో నాకు తెలుసు. నేనిచ్చే సలహా ఏమీలేదు కాని నీ ఉచిత సలహా నాకక్కరలేదు. ఏకవచనం వాడినంతసేపు వాడి ఇప్పుడు కష్టమని నాకు చెప్పే అవసరం లేదు, అసలు నీకు ఎవరు వాడమన్నారు, అలావాడటం తప్పు కాదని మాత్రమే చెప్పాను. నేను కూడా చూసి చూసి చివరగా నీపై ఏకవచనం ప్రయోగించాల్సి వచ్చింది. నీ పద్దతే నేను అనుసరించాను. మూర్ఖపు పనులు చేసే అవసరం నాకు లేదు అలా రాయడమే మూర్ఖత్వం. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:17, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సుజాత గారికి, నాపై ఉన్న అభిమానానికి, గౌరవానికి, నమ్మకానికి వేనవేల కృతజ్ఞతలు. ప్రారంభం నుంచి మీరు నా దిద్దుబాట్లను పరిశీలిస్తున్నారు కాబట్టి నా గురించి మీకు పూర్తిగా తెలిసి మాట్లాడుతున్నారు. తెవికి వైభవోపేతమైన దశలోనూ మీ హస్తం ఉన్నందుకు మీకూ గర్వకారణమే. నేను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ధైర్యానికి మీరర్పించిన జోహార్లకు మరోసారి కృతజ్ఞతలు. ఏ విషయంపై నయిననూ అలా చెప్పడానికే నేనిష్టపడతాను. అలాచెప్పేటప్పుడు కొందరు సభ్యులు అనుకుంటున్నట్లు ఇదివరకు నాకు మద్దతు ఇచ్చినవారు లేదా విమర్శించిన వారు అనేది దృష్టిలో పెట్టుకోను. అలాగే నేను ప్రతీ చర్చలలో పాల్గొనను, నాకు పట్టు ఉన్న రంగాలలో కొనసాగిస్తాను కాబట్టి ఆ విషయంపై ఎంత సుధీర్ఘంగా చర్చ జరిగిననూ సమాధానం ఇవ్వగలుగుతాను. నియమాలను ఉల్లంఘించిన సభ్యులకు వారు ఎంత సీనియర్ సభ్యులైననూ చెప్పడానికి వెనకాడను. వైజాసత్యగారు తెవికి పగ్గాలు చేపడితే మళ్ళీ తెవికీకి స్వర్ణయుగం వస్తుందని అనడం నా అభిప్రాయానికి సరైనదే. అలాగే నాకు మీరిచ్చిన సలహా కూడా సరైనదే కాని తప్పనిసరి పరిస్థితుల్లో చర్చలలో పాల్గొనవలసి వస్తున్నది. అలాచేయడం మీరన్నట్లు సమయం వృధాయే కాని నియమాలకు విరుద్ధంగా జరిగినప్పుడు చూస్తూ ఊరకుండటం నా మనస్సు ఒప్పుకోదు. ఈ మధ్యలో నియమాలను ఉల్లంఘించడం అధికమైంది, అందుకే నేను తెవికీ సెలవులోకి జారుకున్నాను. (అవసరమైతే చర్చలకు మినహాయించి). మీరన్నట్లు మొదటిపేజీయే కాకుండా ఒక ప్రత్యేక విజ్ఞానసర్వస్వమే నిర్వహించగలను. సెలవులో ఉంటూ నెలరోజుల నుంచి పాలమూరు జిల్లా విజ్ఞాన సర్వస్వం అనే బ్లాగు రూపకల్పనలో ఉన్నాను. అలాగే పుస్తకాలు, కవితలు, జనరల్ నాలెడ్జి రచనలు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గ్రామాలు, మండలాలు, జిల్లాలు, నియోజకవర్గాలు, పట్టణాలే కాకుండా వేలాది ప్రముఖులకు చెందిన వ్యాస సమాచారం నా వద్ద ఉంది. త్వరలోనే అది అందరికీ అందుబాటులోకి తీసుకువస్తాను. మళ్ళీ తెవికీ గురించి చెప్పాలంటే వైజాసత్యగారి ప్రతిస్పందన చూస్తాను, లేనిచో పరిస్థితులు చక్కబడే వరకు సెలవే మరి. చివరగా మీకు నా నుంచి ఏదేని సహాయ సహకారాలు కావాలంటే మెయిల్ పంపడం కాని, నాచర్చాపేజీలో వ్రాయడం కాని చేయండి. ధన్యవాదములతో........ సి. చంద్ర కాంత రావు- చర్చ 13:48, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం C.Chandra Kanth Rao గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 ((Talkback)) ను లేదా ((Tb)) మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

మీ అభిప్రాయం తెలుపగలరు

[మార్చు]
వైజాసత్య గారు, చాలా రోజుల తర్వాత నా చర్చా పేజీలో మీ దిద్దుబాటుకు సంతోషం. ప్రస్తుత దశలో ఒక్కో సభ్యుడు తమకిష్టమైన విధంగా ప్రవర్తించడం కారణంగా నేను తెవికీకి దూరంగా ఉండవలసివచ్చింది. ఒకప్పుడు మీమార్గదర్శకంలో వైభవంగా వెలుగొందిన తెవికీకి మళ్ళీ 2008 నాటివలె చూడాలని ఉంది. మీరు మళ్ళీ తెవికీని ముందుండి నడిపిస్తారంటే నేనూ మళ్ళీ చురుగ్గా దిద్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సుజాతగారు కూడా నా చర్చాపెజీలో ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. మీ ప్రతిస్పందన చూసి నేను తెవికీ భవిష్యత్తు కార్యక్రమం గురించి ఆలోచిస్తాను. లేనిచో పరిస్థితులు చక్కబడేవరకు సెలవులోనే ఉంటాను. ప్రస్తుతానికి "పాలమూరు జిల్లా విజ్ఞాన సర్వస్వం" బ్లాగు రూపకల్పనలో నిమగ్నమైయున్నాను, వాటిని త్వరలోనే ఆవిష్కరించగలను. నా తెవికీ భవిష్యత్తు కార్యక్రమం ఆలోచించడానికి మీ అభిప్రాయం వెల్లడించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:25, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ తెవికీ ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడకూడదు. అప్పుడూ అభిప్రాయ భేదాలుండేవి, ఇప్పుడూ ఉన్నాయి. కానీ చాలా చర్చలు వ్యక్తిగత దూషణలకు దిగజారిపోవటం బాధాకరం. ఇలాంటి చర్చలు మనల్ని ఎక్కడికీ నడిపించవు. అందరిని కలుపుకొని ముందుకు సాగుతేనే అభివృద్ధి. ఆ మధ్యన జిల్లాల వ్యాసాలను అందరూ కలిసి చక్కగా విస్తరించినట్టున్నారు. అంతలోనే ఏమైంది సమైఖ్యతకు. కొత్త సభ్యులతో ఎలాగు చర్చలూ, వాదోపవాదాలు ఉండేవే. నిర్వాహకులు కూడా కొత్త సభ్యుల్లాగా ప్రవర్తించడం బాగోలేదు. మీరు తిరిగి క్రియాశీలకంగా పాల్గొని మండల, గ్రామాల వ్యాసాలు అభివృద్ధి చేపడతానంటే నేను క్రియాశీలంగా నిర్వహణ బాధ్యతలు చేపడతాను. సరేనా? చంద్రకాంతునికి చందనపు పూతలు, వింజామరలు సిద్ధం చేయండి :-) --వైజాసత్య (చర్చ) 08:46, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు మీరు మళ్ళీ తెవికీ నాయకత్వానికి సమీపిస్తున్నందుకు సంతోషమే. కాని ఒక సభ్యుడి చర్చాపేజీలో నన్ను రెడ్డిగారితో కలిపి నందుకు బాధవేసింది. రెడ్డిగారితో నాకు ఎలాంటి సంబంధం లేదని మీరు తెలుసుకుంటే మంచిది. నిబంధనలకు విరుద్ధంగా మిగితా సభ్యులు ప్రవర్తించినప్పుడు వద్దని చెప్పాను కాని రెడ్డిగారికి మద్దతు ఇస్తున్నట్లు మీరు అనుకోనవసరం లేదు. అలా రాయడానికి మీ ఉద్దేశ్యం ఏమిటో కాని నన్ను మాత్రం ఆలోచనలకు గురిచేసింది. నేను ఎవరి వ్యక్తిగత విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోను. తప్పని పరిస్థితుల్లోనే కొన్ని సార్లు అలా చేయవలసి వచ్చింది. నాలుగైదు ఐదురోజుల నుంచి ఒక సభ్యుడు నాపై ఏకవచనం ప్రయోగిస్తే చూసిచూసి చివరకి నేనూ అలాగే సమాధానం ఇవ్వవలసి వచ్చింది. ఏకవచనం తప్పు కాదని చెప్పిన ఒక్క మాటకే ఆ సభ్యుడే ఏ విధంగా ప్రవర్తించాడో మీకు తెలుసు. అంతమాత్రాన నేనెవరినీ బలపర్చలేను. సెలవులో ఉండటం మూలానా చర్చలు పూర్తిగా తెలిసిరాలేదు. అసలు ఆ వాక్యం కోసమే ఇంత సుధీర్ఘ చర్చ జరిగిందని తర్వాత అర్థమైంది. ఇంతవరకు నేనైనేను మొదటగా ఎవరినీ ఇబ్బంది పెట్టలేను. ఒకటిరెండు సార్లు చూసి నేను వారి విధానాన్నే అవలంబించాను. అయితే మొదట చెప్పిన వారిని కాకుండా తర్వాత చెప్పినవారినే దోషిగా నిర్థారించడం సమంజసం కాదని తెలియజేస్తున్నాను. మొత్తం నిర్వహణ బాధ్యత మీరు చేపట్టాలని నేను చెప్పిన ఉద్దేశ్యం కూడా అదే. మొత్తం నిర్వహణ మీరే చేపడితే నేను నిర్వహణ చేసే పరిస్థితి ఉండడు, ఈ తలనొప్పులు ఉండవు, ఇతరుల నుంచి చివాట్లూ ఉండవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:39, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావుగారికి ఇక ఈ విషయం దయచేసి వదిలేయండి. ఒకవేళ నా వలన మీరు నొచ్చుకొంటే క్షమించండి. వికీలో ఇంతవరకూ నిర్వహకుల మద్య ఇంత అద్వాన్నపు చర్చ నడిచినట్టుగా లేదు. అది ఎవరి వలన మొదలైనా ముందు ముందుకు సాగటం మంచిది కాదు. ఎంతవరకూ ఇందులో పని చేస్తామో ఎవరికీ తెలియదు. పది మందికి ఉపయోగపడుతున్నది కనుక చేస్తున్నాం. అసలు మీరెవరో నేనెవరో మనకే తెలియదు. వీలున్నంత వరకూ చేద్దాం, చేస్తూ పోదాం. దయచేసి ఇక ఈ చర్చ వదిలేయండి.విశ్వనాధ్ (చర్చ) 14:06, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాథ్ గారి వ్యాఖ్యకు స్వాగతిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:43, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 9
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?