For faster navigation, this Iframe is preloading the Wikiwand page for వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 6.

వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 6

వికీపీడియా నుండి

Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

బాధ కలిగించిన విషయం/వ్యాఖ్య

కాసుబాబుగారూ, ఈ కామెంటును చాలా బాధగా వ్రాస్తున్నాను. రంగారావుగారు, ఈ కింది వ్యాఖ్య చేసి నాకు మనస్తాపం కలిగించారు.

శివ గారు, మీరు ఒక మంచి వ్యాసాన్ని చాలా అసంబద్దంగా తీర్చిదిద్దారు. నేను మళ్ళీ దానిని సరి దిద్దాను. ఇంకొకసారి మార్పులు చేసే ముందు దయచేసి ఇతర వ్యాసాలను పరిశీలించమని కోరుతున్నాను. - --Svrangarao 14:29, 6 ఏప్రిల్ 2008 (UTC)

నేను వారికి ఈ కిందివిధంగా జవాబు వ్రాశాను: రంగారావుగారూ! నమస్తే. నేను అసంబంద్ధంగా తీర్చి దిద్దాను అని అరోపణ చేసారు కాని, నెను చేసిన మార్పులు ఏవిధంగా అసంబద్ధమో వ్రాయలేదు. దయచేసి తెలియ చేయమని మనవి.--SIVA 18:35, 14 ఏప్రిల్ 2008 (UTC) ఈ పైన విషయం ప్రముఖ సినీ నటుడు ఎస్వీ రంగారావు వ్యాసంగురించి జరిగింది.

నేను సినీ నటుడు S.V.RANGARAO గురించి ఉన్న వ్యాసాన్ని కొంత సరిచేసాను. ఆ పనిలో ఒక పేతికను అమర్చాను, వారి చిత్రాలను వేరొక పేజీకి మార్చాను, బాపు చమత్కార భాషణను, వ్యాసానికి ఆరంభంలో ఉంచాను. తరువాత వ్యాస విషయాలు ఒక పద్దతి ప్రకారం కూర్పు చేసాను. ఈ మాత్రానికి, రంగారావుగారు పై విధంగా స్పదించి నేను చెసిన మార్పులు "అసంబద్ధంగా" తీర్చి దిద్దానని వ్యాఖ్య చేసారు. నేను చేసిన ఏ మార్పు అసంబంద్ధం?? నేను అమర్చిన పేటిక అలాగే ఉంచారు, చిత్రాల జాబితా table format లో ఉంచారు(నేను చర్చలో స్పందిచిన ప్రకారం,ఇలా చేస్తే వ్యాస నిడివి అసహజంగా పెరగకుండా కొంతవరకు కాపాడవచ్చు, 2వ పేజీ ఏర్పరచటంఇష్టంలేకపోతే).

నేను చిత్రాల జాబితాను వేరొక పేజీకి మార్చినప్పుడు, మీరు చూచి, అలా అవసరమా, చర్చించండి అన్నారు. నేను, నా స్పందన వెంటనే, చర్చా పేజీలో వ్రాసాను. ఇప్పుడు చూస్తే, నేను వ్రాసిన స్పందన చర్చా పేజీలో లేదు, రెండు పేజీలు ఒకటిచేసారు. సరే, మీరు నిర్ణయించి రెండుపేజీలు ఒకటి చేసారు అనుకుందాము, ఈ మాత్రానికి చర్చకు ప్రదిపాదించటం దేనికి? ఇతర సభ్యులు ఎవరూ కూడా స్పందించకుండానే ఎక పక్ష నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? OK రెండు పేజీలు ఒకటి చేసారు. ఈ విషయం మీద నా స్పందన చర్చా పేజీలో నుండీ తొలగించటం దేనికి?(ఎవరు తొలగించారో నాకు తెలియదు)

తరువాత, వికీ లో వ్యాసం వ్రాసినప్పుడు, ఇతరులు ఆ వ్యాసాన్ని "EDIT" చేస్తారు, చెయ్యచ్చు అన్న విషయం మౌలికమయినది (basic)కదా. ఒకవేళ ఇతరులు చేసిన మార్పులు నచ్చకపోతే, చర్చించాలి, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలి, లేదా ఆ మార్పును నిశ్శబ్దంగా తిరిగి మార్చుకోవాలి. ఇతరులు చేసిన మార్పుల గురించి ఇలా దురుసుగా, కటువుగా వ్యాఖ్యలు చెయ్యటం సమంజసమా?? మీరు దయచేసి ఈ విషయం పూర్తిగా పరిశీలించి తెలుపగలరు. ఈ విషయం ఎవరికి ఫిర్యాదు చెయ్యలి కూడా తెలియ చేయగలరు.--SIVA 18:11, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అరుదైన చలం చిత్రం గురించి

మీరు సూచించినట్లు, జిళ్ళెల్లమూడి అమ్మతో చలం ఫొటో కు తగిన వివరాలు జత పరిచాను-ఏ వెబ్ సైట్ లోంచి ఆ ఫొటొ తీసుకొనబడిందో. అక్కడకూడా ఫొటొ గాలరీలో ఈ ఫొటో ప్రదర్శనలో ఉన్నది. కాబట్టి, మీరు పరిశీలించి, లైసెన్సు గురించి తగిన మార్పు చేయగలరు.--SIVA 01:10, 4 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసము

కాసుబాబుగారూ! నేను హామ్ రేడియో వ్యాసాన్ని వ్రాసాను. దయచేసి చూసి మీ అభిప్రాయం తెలుపగలరు. నేను కూడా ఒక హామ్ ను. ఈ వ్యాసం "ఈ వారపు వ్యాసం" గ తగునేమో పరిశీలించండి.--SIVA 20:27, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక సలహా

కాసుబాబుగారూ! నమస్తే. వ్యాసాలు వ్రాసేటప్పుడు చాలాసార్లు ఒక చిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాను. అదేమిటంటే, వాడవలసిన పదం ఆంగ్ల భాషలో స్పురిస్తుంది. ఆ పదానికి సరయిన తెలుగు పదం ఎంత గింజుకున్నా గుర్తుకురాదు. అతి సామాన్యమైన మాటలు "verify" "allotted" వంటి మాటలకు మంచి నాణ్యమైన తెలుగు మాటలు (ధూమ శకటము లాంటి భయం పుట్టించే మాటలు కాకుండా)దొరికితే బాగుంటుంది. "FREQUENCY" అనే ఆంగ్ల పదానికి తెలుగులో ఒక కంకర్రాయి లాంటి మాట "దైర్ఘ్యమానము" అనుకుంటాను ఉన్నది. ఇటువంటి ఉచ్చరించటానికి కూడా శ్రమ పడవలసిన పదానికి బదులు, ఆంగ్ల పదమే తెలుగులో ఫ్రీక్వెన్సీ అని వ్రాస్తే అందరికీ సులభంగా ఉండగలదు. ఈ సమస్య నాలా చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది.ఈ మాట నామవాచకము కాబట్టి, ఆంగ్ల పదమే తెచ్చి తెలుగు లిపిలో వ్రాస్తే, మన భాషలోకి సులభంగా కలిసిపోతుంది-రైలు రోడ్డు వంటి పదాలలాగా. కానీ, ఇతర నామవాచకములు (verb, pronoun మొదలగునవి)విషయంలో ఇలా చేస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. నా సలహా లేక వినతి ఏమంటే, మన తెలుగు వికీపీడియాలో ఒక ప్రత్యేక పుట ఏర్పరిచి, అందులో ఎవరికైనా ఏ పదానికైనా సరయిన తెలుగు పదం దొరకకపోతే, సహాయం పొందటానికి వీలుగా ఏర్పరిస్తే బాగుంటుంది. ఇతర సభ్యులు తమ అనుభవంద్వారా ఆ మాటకు సరయిన తెలుగు పదం సూచించవచ్చు, కొంత చర్చ (అవసరమైతే) జరిగిన తరువాత దాదాపు అందరికీ అమోదయోగ్యమైన చక్కటి తెలుగు మాట తయారు అవుతుంది. నిఘంటువులలోని పదాలకన్నా, నలుగురూ చర్చించి ఒక పదానికి రూపకల్పన చేస్తే మంచి ఫలితాల్నిస్తుందని నా ఉద్దేశ్యం. దయచేసి పరిశీలించి, మీ అభిప్రాయం తెలియచెయ్యండి. ఇప్పటికే, ఇటువంటి సౌలభ్యం లభిస్తున్నట్లయితే, వివరాలు తెలుపగలరు.--SIVA 02:33, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏక వచన ప్రయోగం

అవునండీ, ఈ విషయం గురించి తప్పకుండా మరికొంత చర్చ కొనసాగాలి. మనకున్న మహా నాయకులు, రచయితలు, నటులగురించి వ్రాసేటప్పుడు, "అతను" వచ్చాడు" అని వ్రాయటం ఎబ్బెట్టుగా ఉన్నది. దిన పత్రికలలో కూడా చూస్తుంటాము, ఏ విశ్వనాధ సత్యనారయణగారి గురించో వ్రాసేటప్పుడు "అతను" అని, ఏ నక్సలైటు నాయకుడి గురించి వ్రాసేటప్పుడు "ఆయన" అని వ్రాస్తుంటారు. ఇలా వ్ర్రాయటం ఆ పత్రికల సంపాదకీయ విధానమో లేక ఆ వ్రాసిన విలేఖరి యెక్క సొంత ఇష్టాఇష్టాలమీద ఆధారపడి ఉంటుందో తెలెయదు. ఆంగ్ల భాషలో వ్యక్తుల గురించి, ఏకవచన ప్రయోగం మానేసి శతాబ్దాలవుతోంది( thou art లాంటివి). దీని వల్ల ఇప్పుడు ఆంగ్ల భాషలో అసలు ఏక వచన ప్రయోగం లేదనుకొంటున్నారు. మన తెలుగులో అలా వ్యక్తుల గురించి వ్రాసేటప్పుడు ఏకవచన ప్రయోగం కాకుండా (రాముడు వచ్చాడు అంటామా లేక రాముడు వచ్చారు అంటామా అనే వితండవాదనకు దిగకుండా{ఎందుకంటే రాములవారు వచ్చారు అనేవారు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు})బహువచనంలో వ్రాస్తే (వారు జీవించి ఉన్నాలేక స్వర్గస్తులయినాకూడా)మన సొమ్ము ఏమి పోయింది??? మనం ఇతరులను గౌరవిస్తున్నాము కదా అంతకన్నా ఇంకా ఏమీ చేయటంలేదుకదా!! తక్కువలో తక్కువ, బహువచనంలో ఎవరయినా వ్రాస్తే పట్టుబట్టి అన్నీ మార్చకుండా ఉంటే చాలు.--SIVA 18:41, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చలం గురించి

ఈ క్రింద తెలిపిన విధంగా నేను రంగారావు గారికి ఒక మనవి చేసాను, ఆయన వ్రాసిన విషయాలు చదివి. కొంత సమయం గడచినా ఆయన దగ్గరనుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. మీరు ఒక్కసారి ఆయన వ్రాసిన విషయాలు, నేను వ్రాసిన మనవి చూసి మీ అభిప్రాయం తెలుపగలరు--SIVA 18:41, 28 మార్చి 2008 (UTC) "చలం వ్యాసంలో మార్పులు రంగారావుగారూ! నమస్కారం.[ప్రత్యుత్తరం]

మీరు చలం వ్యాసంలో చేసిన మార్పులు జత పరచిన విషయాలు చూసాను. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. కాని, ...."చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆకుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది' వ్రాసిన దాంట్లో నాకెందుకో పూర్తి సబబుగా లేదనిపిస్తున్నది. చలం తన విమర్శలలో ఎప్పుడూ కూడా కుటంబ జీవితంలో స్త్రీలను ఎంత తక్కువగా, ఒక వస్తువను చూసినట్లుగా చూస్తారో, ఎంత తమ అవసరాలకు వాడుకుంటారో వ్రాశారేకాని, కుటంబ జీవితం మీద వేరే విమర్శలు వ్రాసినట్లు నాకు తెలియదు. ఆయన కుటుంబ జీవనాన్ని ఏ కథలో/నవలలో విమర్శించారో చెప్తే బాగుంటుంది.

తరువాత "....తన కుటుంబసభ్యులు అరుణాచలం(తమిళనాడు) లోని రమణ మహర్షి శిష్యులుగా మారి అచటికే వెళ్ళటంతో....." తన కుటుంబ సభ్యులు మాత్రమే రమణ మహర్షి శిష్యులుగా మారితే, చలం గతిలేక తనూ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ కథ ప్రకారం, దీక్షితులుగారు (అప్పటి తరం మరో రచయిత, చల స్నేహితులు)మొదటిసారి చలాన్ని రమణమహర్షి దగ్గరకు ఎప్పుడో తీసుకొని వెళ్ళారు. క్రమంగా చలం రమణ మహర్షి పట్ల ఆకర్షితులయినట్లు ఆయన ఆత్మ కథలో తెలుస్తుంది. "వొయ్యి" అని పిలుచుకునే ఆయన వదినగారు, విజయవాడలో పేరొందిన వైద్యురాలు. ఆవిడ మరణం తరువాత, సమాజం తన పట్ల చూపుతున్న శతృ వైఖరిని భరించలేక తన కుటుంబంతో సహా చలం విజయవాడ వదలి అరుణాచలం వెళ్ళిపొయ్యరు.ఈ విషయం ఆయన ఆత్మ కథలో స్పష్టంగా ఉన్నది. దయచేసి మీరు మరొక్కసారి verify చెయ్యమని మనవి.--SIVA 17:09, 24 మార్చి 2008 (UTC)"


కమ్యూనిజం వ్యాసం

కమ్యూనిజం వ్యాసంలో కమ్యూనిస్ట్ పార్టీ చిహ్నం గురించి నా వాఖ్యలు మీ పేజీలో వ్రాసినవి చూసి తెలుప గలరు.--SIVA 18:41, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


సినిమా వ్యాసాలు

కాసుబాబు గారికి, వ్యాసపరిమాణం గురించి మీరు చేసిన సూచన (2కెబి) పాటించుతాను.కాలాభావం తో క్లుప్తత పాటిస్తున్నాను. ఇప్పటి వరకు వ్రాసిన వ్యాసాలు ముందుముందు విస్తరించే ప్రయత్నంచేస్తాను.ఎక్కువభాగం నేను చిన్నతనంలో చూసిన సినిమాలు,నాకు గుర్తున్నంతలో రాస్తున్నాను.ప్రత్యేకంగా విషయసేకరణ (రిఫరెన్సులద్వార),యా దృచ్చికంగా దొరికితే తప్ప , చేయట్లేదు. పోస్టర్లు కొన్ని చిత్రనటుల బయోగ్రఫీలలో చూసాను. అవి స్కాన్ చేసే ప్రయత్నం చేస్తాను. సినిమా స్టిల్స్ స్వంతంగా స్కెచ్ లు చేసినవి అప్ లోడ్ చేయవచ్చా? దయచేసి తెలియజేయగలరు.Deepasikha 09:45, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వ్యాసాల జాబితా

కాసుబాబు గారు, మీరు రాసిన/రాస్తున్న వ్యాసాల జాబితా మొత్తం ఎక్కడయినా లభ్యమవుతుందా? లేనిచో అలాంటిది ఒకటి ఉంటే (ఉదాహరణకు మీ పేజీలోఒక table లా) ముందు ముందు అందరికీ (ముఖ్యంగా పాఠకులకు!) చాలా ఉపయోగకరం అవుతుందని భావిస్తున్నాను.--Svrangarao 14:50, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా కష్టం. ప్రస్తుతం ఆ పని (వ్యాసాల జాబితా చేయడం) మొదలుపెట్టలేను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:07, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నాకొకటి తెలుసు. కాసుబాబు గారు ఇప్పటి వరకు 5896 పేజీలకు మార్పులు చేసారు. :) సాయీ(చర్చ) 03:54, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
కాని రంగారావు సూచన బాగుంది. త్వరలో ఈ పని మొదలు పెడతాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:29, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కాపీ హక్కుల హెచ్చరిక

ప్రదీప్! (1) ఒక బొమ్మను అప్‌లోడ్ చేసినవారికి ఆ బొమ్మ కాపీ హక్కుల గురించి హెచ్చరిక పంపడావికి ఏదైనా మూస ఉందా? అంటే ఆటోమాటిక్‌గా కాదు. మాన్యువల్‌గా. (2) ఏప్రిల్ నెలనుండి కాపీ హక్కులు సరిగా లేని పాత బొమ్మలు కూడా తొలగిద్దామనుకొంటున్నాను. ఈ పనిలో కొందరి స్వీయచిత్రాలు కూడా చెరిగిపోతాయి. నిజానికి వాటికి వాఱికి సరైన కాపీ హక్కులు ఉండవచ్చు. కాని వారు వివరాలు ఇవ్వలేదు. నీ అభిప్రాయం ఏమిటి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:34, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాంటి హెచ్చరికలు ఇవ్వటానికి ((subst:లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు|బొమ్మ పేరు|((PAGENAME)))) వాడండి. స్వీయచిత్రాలు వికీపీడియాకు; అంటే వ్యాసానికి పెద్దగా ఉపయోగపడవని అనుకుంటే తొలగించేయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 21:14, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

కాసుబాబు గారు, ఓపిక చేసుకొని నా వ్యాసములు చదివినందుకు ధన్యవాదాలు. నా మిత్రులద్వారా కాపానీడు ఫొటొ సంపాదిస్తాను. మాలిక్ మక్బూల్ ఫొటోలు అప్లోడ్ చేయలేక పోయాను. (నాకు కంప్యూటరు జ్ఞానము తక్కువ). నా ఐడి kumar.metla@gmail.com మీరు మెయిలు పంపినచో ఫొటోలు పంపుతాను. మక్బూల్ సమాధి రక్షణ గురించి ఇచట పురాతత్వ విభాగములో మరియు వేరు విధములుగా చర్యలు చేపట్టుతాను. Kumarrao 07:55, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం ఈ మెయిల్

ప్రదీప్! ఈ వారం వ్యాసం ఈ మెయిల్ ద్వారా పంపే విషయంపై ఇదివరకు నేను అసలు ధ్యాస పెట్టలేదు. అది ఉపయోగకరమా! అన్న భావనతో. ఒకసారి ఈ commitment ను పునస్సమీక్షించమని కోరుతున్నాను. (అందరూ బిజీగా ఉన్నారు గనుక నీ అభిప్రాయం చాలు). పంపాలని నిర్ణయిస్తే ఇకముందు నేను కూడా పంపడం మొదలు పెడతాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:01, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఈ-మెయిలు పంపించే ఒక గూగుల్ గుంపుకు, ఇదే ప్రశ్నను ఇంకొంచెం విపులంగా పంపించాను. కింద లింకు ఇచ్చాను, ఆ లింకును అనుసరిస్తే అక్కడ ఆ గుంపుసభ్యుల అభిప్రాయాలు చూడవచ్చు. ఇప్పటవరకూ వచ్చిన repliesలో అవసరం అని అన్నారు కానీ కారణాన్ని ఎవరూ పేర్కొనలేదు. http://groups.google.com/group/teluguwiki/browse_thread/thread/33ff1862c5255ddc

వికీ డైరీ ఐకాన్

బావుందా? సాయీ(చర్చ) 09:16, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

"నా గురించి" ఐకాన్ మార్చాను. బావుందా? హ హ హ అలాగే. ఖచ్చితంగా తెలుపుతాను. సాయీ(చర్చ) 12:27, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీ ప్రయోగశాలకు ఒక మూస తగిలించాను. చూడండి సాయీ(చర్చ) 07:02, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ బొమ్మ చాలా బావుంది. మీరు ఏ సాఫ్ట్‌వేర్ వాడతారు? సాయీ(చర్చ) 10:54, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

can you please Restore this page to this version?

మూసలు

మీరడిగిన మూసలు తయారయ్యాయి. δευ దేవా 23:05, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

PD-USer

ప్రదీప్! బొమ్మల అప్‌లోడ్ డ్రాప్ డౌన్ లిస్టులో పబ్లిక్ డొమెయిన్ సెక్షన్ లో 100యేళ్ళు పైబడినది, భారతీయ కాపీహక్కుల క్రింద 60 యేళ్ళు పైబడినవి అనే ఛాయిస్ లు మాత్రమే వస్తాయి. ((PD-User)) - User Created Public Domain మూస కూడా ఈ డ్రాప్ డౌన్ లిస్టులో చేర్చడం కుదురుతుందా? (If possible, with a parameter) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:29, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దీనిని ((PD-user|sign=~~~)) అనివాడి దీనిని కూడా ఆ డ్రాపుడవును లిస్టులో పెట్టొచ్చు. కానీ అన్ని సమయాలలో సరిగ్గా పని చేస్తుందని నాకు నమ్మకం లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:47, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖబూస్ మస్జిద్

కాసుబాబు గారూ నమస్తే, భేష్, మీరు అప్లోడు చేసిన మస్జిద్ బొమ్మ, మీ అభిరుచీ రెండూ అందంగా వున్నాయండి. ఇంకొకటి, మీ పేజీ అంతా గందరగోళంగా కనబడుతోంది ఎందుకూ, నాకు మాత్రమే అలా అనిపిస్తావుందా లేదా అందరికీనా? మిత్రుడు nisar 21:01, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు మాత్రం బాగానే కనిపిస్తోంది సాయీ(చర్చ) 12:07, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లాల కలరు పొటోలు

కాసుబాబుగారు, జిల్లాల కలరు ఫొటోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైటు నుండి సేకరించాము. కాబట్టి వాటికి GFDL అనే లైసెన్సు ఇవ్వలేము. అంతే కాదు వాటిని తెలుగు వికీపీడియాలో వాడటం కూడా కాపీహక్కు ఉల్లంఘన అవుతుంది. త్వరలో నేను వాటికి ప్రత్యామ్నాయాలను అప్లోడు చేస్తాను, అప్పుడు ఈ బొమ్మలన్నిటినీ తొలగించవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:36, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయం నాకు తెలియదు. మీరే చేశారనుకొన్నాను. నేను చేసిన మార్పులను రద్దు చేయగలవా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:57, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ-మెయిలు

కాసుబాబు గారు, మీకభ్యంతరము లేనిచో ఈ-మెయిలు ఐడి తెలుపగలరా?Kumarrao 11:20, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


మొదటి పేజీ వ్యాసాలు

కాసుబాబు గారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను తెవికీ కోసం ఖచ్చితమయిన/నిర్ణీత సమయాన్ని కేటాయించలేను కానీ తప్పకుండా ప్రయత్నిస్తాను. మీరు దారి చూపించడమే తరువాయి! --Svrangarao 12:06, 29 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాట్ల సారాంశము సూచనలు

కాసుబాబు గారూ, దిద్దుబాట్ల సారాంశము గురిచి మీ సూచనలు బాగున్నాయి. తప్పక పాటించడానికి ప్రయత్నిస్తాను.--Svrangarao 23:30, 29 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు పంపిన మెసేజ్ కి జవాబు

కాసుబాబు గారూ,కానీ నీరు చిరంజీవి బొమ్మ గురించి చెప్పిన తరువాత...నేను లైసెన్సు వివరాలు...కొంచెం చూసే బొమ్మలు అప్లోడ్ చేస్తున్నాను. ఉదా: శోభన్ బాబు.... వారి బొమ్మలు http://telugupedia.com నుండి తెచ్చి పెట్టినవి. వారు, తమ కాంటెంటును...నేను పేర్కొన్న లైసెన్సు (GFDL) మీద లభ్యం అని చెప్పరు. ఇది మీకు నచ్చలేదంటే చెప్పగలరు! --సూరపనేని 02:26, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

నా స్వీయ నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యుడను రవిచంద్ర(చర్చ) 04:47, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మెదటి పేజి

ఒక సారి సభ్యులు:Sai2020/ప్రయోగశాల/మెదటి_పేజి చూసి ఏలా ఉందో చెబుతారా? సాయీ(చర్చ) 05:19, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతర వెబ్‌సట్ల వలే తయారుచేయడం కష్టం కాసుబాబు గారు. ఎందుకంటే, వికి మార్కప్ హెచ్‌టీఎంఎల్ అంత శక్తివంతమైన భాష కాదు. ఇంకొకటి వాళ్ళు వాడే బొమ్మలు వగైరాలు ఉచితం కావు. వేరొక వికీనుండైతే సులభంగా చేయచ్చు. ఇంకొకటి, నేను రంగులు సరిగా పెట్టలేదు. ఒకో పెట్టెకు ఒకో రంగు ఉంది. అందులో ఏది బావుంటే అది అన్నిటికి పెడతాను.సాయీ(చర్చ) 06:50, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతిపాదన చేసాను కాసుబాబు గారు. ఇదే నా ఫైనల్ ప్రపోసల్. సాయీ(చర్చ) 10:43, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు పంపిన మెసేజ్ కి జవాబు

కాసుబాబు గారూ, మీ జవాబు ఒక రకంగా బాగున్నా, మీరు మరీ ఎక్కువ జాగ్రత్త తీస్కుంటున్నట్లు అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి ఫొటో కాపీ హక్కులతో దొరకాలి అంటే జరిగే పని కాదండీ. మీరు ఇలా పర్టికులర్ గా ఉండకుండా కొంచెం liberal గా ఉండడం బెటర్. ఒక వేళ మనం తెలుగు వారి ఫొటోలకు కాపీహక్కులు సంపాదించినా, వేరే వారి హక్కులు ఎలా సంపాదిస్తాము? ఆలోచించండి!

"మనం వాడుకున్న ఫొటొని ఎవరూ క్లెయిం చెయ్యకుండా ఉంటే చాలు అని నా అభిప్రాయం." మనం ఏమీ వాల్పేపర్ బిజినెస్ చెయ్యట్లేదు కదా, ఎవరన్నా కంప్ల్ చెయ్యడానికి???

(2) ఇంకా, నాకు మూసలు చెయ్యడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఐతే, నాతో పాటు ఇంకా ఎవరన్నా ముందుకొస్తే, నాకు సహకరించమని చెప్పగలరు! మూసల విషయమై కొన్ని అక్కర్లేని పేజీలు, కొన్ని డూప్లికేట్లు ఉన్నాయి. వాటిని తొలగించడానికి నాకు హక్కులు ఇవ్వగలరేమో చూడగలరు.

సెలవు. --సూరపనేని 22:03, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

(1) మధ్యలో మాట్లాడున్నందుకు క్షమించండి. ఇండియా లో కాపిహక్కులంటే ఎక్కవ లెక్క చేయరు. కాని ఇతర దేశాలలో ఇది ఒక పెద్ద సమస్య. కాపిహక్కులు చట్టాల ప్రకారం కాపిరైట్ ఉన్న బొమ్మలను ఏ పనికి అనుమతి లేకుండా వాడకూడదు. అది బిసినెస్ ఐనా సరే, not for profit సంస్థలైనా సరే. అసలు వికీపీడియా ఉన్నందే ఉచిత సమాచారాన్ని పంచడానికి. కాబట్టి కాపి హక్కులు ఉన్న బొమ్మలు వాడటం వికీ పాలసీ కి వ్యతిరేకం. (2) నేను చేస్తాను మూసలు మీతో పాటు. సాయీ(చర్చ) 12:56, 1 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ల గురించి

నేను విక్షనరీలోని పదాలను వర్గీకరించడానికి ప్రదీపు గారు మొదట్లో రాసిన బోటును వాడవచ్చా? రవిచంద్ర(చర్చ) 12:32, 1 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏలూరు వ్యాసం

కాసుబాబు గారు ! ఏలురు వ్యాసం లో ఒక పేరా కలిపె ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం లో కొంత ఇంగ్లీషు టెక్స్ట్ పోయినట్లనిపించింది. అది తిరిగిపొందగలమా? Deepasikha 12:20, 2 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సౌరకుటుంబం / సౌరమండలము వ్యాసం

కాసుబాబు గారు నమస్కారం, సౌరకుటుంబం, సౌరమండలము వ్యాసాలను విలీనం చేస్తే బాగుంటుందేమో కొంచెం చూడండి. వాడకంలో వున్న పేరునూ సూచించండి. ధన్యవాదాలు. మిత్రుడు nisar 20:00, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే. పరిశీలించి చేస్తాను. --62.231.248.122 05:48, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మెదటి పేజిలో ఫెయిర్ యూస్ బొమ్మలు

ఈ రోజి ఆంగ్ల వికీ మెదటి పేజి చూడండి. Today's Featured Articleకి బొమ్మ ఉన్నప్పటికి ఫెయిర్ యూస్ కాబట్టి మెదటి పేజిలో ప్రదర్శించలేదు. సాయీ(చర్చ) 10:24, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

గమనించాను. ఇకనుండి మనం కూడా అమలు చేద్దాము. వికీపీడియా:కాపీహక్కులులో ఈ విషయం వ్రాయాలి--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:18, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి వ్యాసంలో అతను దాదాసాహెబ్ ఫాల్కే అవార్దు పొందిన తొల దక్షిన భారతీయుడని ఉంది. కాని ఆంగ్ల వికీలో en:Dadasaheb Phalke Award చూస్తే దేవికా రాణి మెదటి దాదాసాహెబ్ ఫాల్కే పొందింది. en:Devika Raniని బట్టి ఆమే ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించింది. వ్యాసంలో తప్పు ఉంది కదా. సాయీ(చర్చ) 11:08, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పరిశోధించాలి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:18, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిట్కాలు

మీరు కూడా చిట్కాలు వ్రాస్తున్నందుకు సంతోషం. ఇలాగే ప్రతీ సభ్యులూ తమవంతు సహాయం అందిస్తే బాగుంటుంది. మీరన్నట్లు మూస:ఈ నాటి చిట్కాలో ఇతర చిట్కాలను వాడడానికి ఉన్న లింకు Wikipedia:Tip of the day/July 21కి అనుగుణంగా తయారు చేద్దామని ఉద్దేశించినది. ఒకటి రెండు ఇతర చిట్కాల మూసలు తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. δευ దేవా 20:56, 11 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Gita-kalamkari-painting.JPG కు మీరు GFDL లైసెన్సు ట్యాగు తగిలించారు. కాని ఆ బొమ్మ మీరు గీయలేదు కదా. మీరు ఫోటో మాత్రమే తీసారు. కాబట్టి ఆ బొమ్మ కాపిహక్కులకు మీకు ఏ సంబంధము ఉండదు. ఆ బొమ్మ కాపిహక్కులు ఆ painting గీసిన వారికే చెందుతాయి. ఉదాహరణకు Image:Leonardo self.jpg చూడండి. ఆ బొమ్మ కాపిహక్కులు డా వించికే చెందుతాయి. కాబట్టి PD ట్యాగు తగిలించారు. సాయీ(చర్చ) 18:13, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

en:Image:Dora Maar Au Chat.jpg కూడా చూడండి. ఆ painting గీసింది పికాసో. ఫోటో తీసింది, అప్లోడ్ చేసింది, en:User:El C. ట్యాగ్ ఫెయిర్ యూస్ ఉంది. సాయీ(చర్చ) 18:27, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. నాకూ ఈ సందేహం ఉంది. నా వుద్దేశ్యం ఫొటోను గురించే. అయితే FAir Use లైసెన్సు ఇవ్వాలా? లేకపోతే PD ఇవ్వాలా? వీలు చూసుకొని పరిశీలిస్తాను. మరయితే బొమ్మ:Kalamkari.JPG సంగతేమిటి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:08, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

PD ఏలా ఇస్తారు? ఆ బొమ్మ 1948 కంటే ముందే గీయబడిందా? ఆ బొమ్మ వికీపీడియా కు అవసరమైతే Fair Use ట్యాగ్ తగిలించండి. లేదంటే తీసేసేయండి. Image:Kalamkari.JPG నేను చూసాను. కామన్స్‌లో Deletion Request పెడతాను. సాయీ(చర్చ) 19:16, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చ బొమ్మపై చర్చ:Gita-kalamkari-painting.JPGలో కొనసాగుతుంది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:03, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాళహస్తి బొమ్మలు

నేను కాళహస్తి బొమ్మలు ఏవీ తొలగించలేదండీ! ఏదో పొరపాటున జరిగిఉండవచ్చు. కానీ వ్యాసం బాగా కనిపించడం కోసం బొమ్మలు స్థానాలు మార్చాను. ఇప్పుడు ఒకసారి వ్యాసాన్ని చూసి బొమ్మలను అందంగా అలంకరించండి. రవిచంద్ర(చర్చ) 05:30, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా

కాసుబాబు గారూ! హృదయపూర్వక ధన్యవాదాలు. Deepasikha 11:19, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుడి పేజి

అది ఎందుకు జరుగుతుందో నాకు తెలియటంలేదు కాసుబాబు గారు. మీరు ఇక్కడ చూడండి. కుడి పక్కన నా పేజి. ఏడమ పక్కన మీ పేజి. అక్కడ ఉన్న తేడాలలో ఏది దీనికి కారణం కాలేదు... Templateలలో ఏదైనా తప్పు ఉందేమో చూస్తాను. సాయీ(చర్చ) 08:23, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడు నా పేజికి మీ పేజి కి టెంప్లేట్ల తేడా కూడా లేదు. ఇప్పుడో సారి ఫైర్‌ఫాక్స్ లో చూడండి. సాయీ(చర్చ) 08:33, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పథకం లేదా పతకం

మీరనగానే నాకూ అనుమానం వచ్చింది. ఏది సరైనదో అలా మార్చండి. δευ దేవా 20:59, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాగభూషణం వ్యాసం

కాసుబాబు గారికి, తెవికి లో నాగభూషణం గారి పై వ్యాసం,దానికి ఆధారమైన తెలుగు పీపుల్.కామ్ లో వ్యాసం చదివాను. ఈ వ్యాసం 'రావికొండలరావు గారి బ్లాక్ అండ్ వైట్' పుస్తకంలోని చాప్టరు.(పద నిర్మాణంతో సహా). తెవికీ లో వ్యాసం కూడా ఎక్కువభాగం ఒరిజినల్ వ్యాసం లానే ఉంది. వీలైతే పరిశీలించగలరు. Deepasikha 04:09, 16 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

{{bottomLinkPreText}} {{bottomLinkText}}
వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 6
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?