For faster navigation, this Iframe is preloading the Wikiwand page for రేలంగి (ఇరగవరం మండలం).

రేలంగి (ఇరగవరం మండలం)

వికీపీడియా నుండి

రేలంగి (ఇరగవరం మండలం)
పటం
రేలంగి (ఇరగవరం మండలం) is located in ఆంధ్రప్రదేశ్
రేలంగి (ఇరగవరం మండలం)
రేలంగి (ఇరగవరం మండలం)
అక్షాంశ రేఖాంశాలు: 16°42′N 81°41′E / 16.700°N 81.683°E / 16.700; 81.683
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
మండలంఇరగవరం
విస్తీర్ణం15.88 కి.మీ2 (6.13 చ. మై)
జనాభా
 (2011)[1]
14,559
 • జనసాంద్రత920/కి.మీ2 (2,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు7,335
 • స్త్రీలు7,224
 • లింగ నిష్పత్తి985
 • నివాసాలు4,166
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534225
2011 జనగణన కోడ్588653

రేలంగి, పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలానికి చెందిన గ్రామం.[2].ఇది మండల కేంద్రమైన ఇరగవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తణుకు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది.

విశేషాలు

[మార్చు]

గ్రామ చరిత్ర

[మార్చు]

తూర్పు చాళుక్యుల కాలంలో ఈ గ్రామంలో రత్నాలు అమ్మేవారని, కనుక ఈ గ్రామాన్ని రతనాల అంగి అని పిలిచేవారని చెబుతారు.

ప్రముఖులు

[మార్చు]

సమీప గ్రామాలు

[మార్చు]

అత్తిలి, గుమ్మంపాడు, వేల్పూరు, తణుకు ఈ గ్రామం తణుకు పట్టణం నుండి అత్తిలి నకు వెళ్ళు మార్గములో ఉంది. ఇక్కడ రైల్వే స్టేషను కూడా ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]

ఈ గ్రామంలో గొస్థని నది తీరమున ఉన్న మంటాలమ్మ ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. శ్రీ అమ్మవారికి జాతర మహోత్సవాలు అత్యంత వైభవముగా గ్రామస్థులు మరియూ భక్తులు దేవాదాయశాఖ వారు సంయుక్తముగా నిర్వహించుచున్నారు.మరియూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, శ్రీ తాటకేశ్వర స్వామి వారి దేవస్థానము, శ్రీగోపాల&ఆంజనేయ స్వామి వారి దేవస్థానము,శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానములు ఉన్నాయి. ఈ దేవస్థానములు దేవాదాయ ధర్మాదాయశాఖ వారిచే నిర్వహించబడుచున్నవి. ఈ దేవాలయముల నిర్వహణకు ఉయ్యూరు జమిందార్లు సుమారు నూట ఏబై ఎకరముల మాగాణి పొలమును దానము చేసారు. ఆ పోలము పై వచ్చు శిస్తుతో ఉత్సవములు, కల్యాణమహోత్సవములు, అన్నదానములు మొదలగు కార్యక్రమములు దేవాదాయశాఖ వారు వైభవముగా నిర్వహించుచున్నారు. ఈ గ్రామంలో గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానమును పునర్నిర్మాణము చేస్తున్నారు.గ్రామస్థులు, భక్తులు రు.10,00,000/-లు సి జి ఎఫ్ మ్యాచింగ్ కంట్రిబ్యూషనుగా చెల్లించారు.రు.20,00,000/-లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దేవాదాయాశాఖ వారు మంజూరు చేసారు.మొత్తం రు.30,00,000/-లక్షల రూపాయలతో ఆలయము పునర్నిర్మాణము పని జరుగుచున్నది. ప్రస్తుతము గ్రూపు ఆలయములకు శ్రీ మంగళంపల్లి వెంకటరామయ్య,. కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. ఈ గ్రామం నుండి దేవాదాయశాఖలో శ్రీ గాదిరాజు శివాజీ రాజు ఈ.ఓ, శ్రీ గాదిరాజు సూరిబాబు సహాయ కమీషనరు,శ్రీ అడ్డాల మెంటారావు మేనేజరు, శ్రీ చీమలకొండ సాయి ఈ.ఓ, శ్రీ మంగళంపల్లి వెంకటరామయ్య ఈ.ఓ,గా ఉన్నత స్థాయికి చేరుకున్నారు.ప్రస్తుతము శ్రీ మంగళంపల్లి వెంకటరామయ్య ఈ.ఓ,తణుకు గ్రూపు దేవాలయములకు బదలీ పై 3-08-2017 తెదీన వెళ్ళినారు. వారు 2010 ఆగస్టు నుండి ఆగస్తు 2017 వరకూ రేలంగిలో పనిచేశారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

ఈ ఊరు మంచి పాడి పంటలకు నెలవు. జామ తోటలకు ఈ గ్రామ పరిసరాలు ప్రసిద్ధి. ఈ గ్రామంలో గల పోలాలలో వరి, అరటి, చెరకు బాగా పండిస్తున్నారు.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4166 ఇళ్లతో, 14559 జనాభాతో 1588 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7335, ఆడవారి సంఖ్య 7224. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2503 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 120. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588653[3].

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14694.[2] ఇందులో పురుషుల సంఖ్య 7440, మహిళల సంఖ్య 7254, గ్రామంలో నివాస గృహాలు 3763 ఉన్నాయి

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, తణుకు లోనూ ఉన్నాయి. అనియత విద్యా కేంద్రం ఇరగవరం లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

రేలంగిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 0 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

రేలంగిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 17 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

రేలంగిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 246 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1340 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1340 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

రేలంగిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 1340 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

రేలంగిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, కొబ్బరి, అరటి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. 2.0 2.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2013-11-23.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
రేలంగి (ఇరగవరం మండలం)
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?