For faster navigation, this Iframe is preloading the Wikiwand page for రిలయన్స్ ఇండస్ట్రీస్.

రిలయన్స్ ఇండస్ట్రీస్

వికీపీడియా నుండి

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
రకంపబ్లిక్
ISININE002A01018
పరిశ్రమసంఘటిత సంస్థ
స్థాపన8 May 1973; 51 సంవత్సరాల క్రితం (8 May 1973)
స్థాపకుడుధీరుభాయ్ అంబానీ
ప్రధాన కార్యాలయం
ముంబై, మహారాష్ట్ర
,
సేవ చేసే ప్రాంతము
ప్రపంచవ్యాప్తం
కీలక వ్యక్తులు
ముకేష్ అంబానీ
(ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్)
ఉత్పత్తులు
  • పెట్రోలియం
  • సహజ వాయువు
  • పెట్రో రసాయనాలు
  • వస్త్రాలు
  • రీటైల్
  • టెలీకమ్యూనికేషన్స్
  • మీడియా
  • టెలివిజన్
  • వినోదం
  • మ్యూజిక్
  • బ్యాంకింగ్
  • సాఫ్ట్వేర్
రెవెన్యూIncrease ₹6,59,205 crore (US$92 billion)[1] (2020)
Operating income
Increase 1,02,280 crore (US$13 billion) [1] (2020)
Net income
Increase 44,324 crore (US$5.6 billion) [1] (2020)
Total assetsIncrease 11,65,915 crore (US$150 billion)[1] (2020)
Total equityIncrease 4,46,992 crore (US$56 billion) [1] (2020)
యజమానిముకేష్ అంబానీ (50.49%)[2]
ఉద్యోగుల సంఖ్య
195,618 (2020)[1]
అనుబంధ సంస్థలు
  • జియో ప్లాట్ ఫార్మ్స్ (67.03%)
  • ఫ్యూచర్ గ్రూప్
  • జియో పేమెంట్స్ బ్యాంక్ (70%)
  • రిలయన్స్ రీటైల్
  • రిలయన్స్ పెట్రోలియం
  • నెట్వర్క్ 18 గ్రూప్ (64%)
  • ఫుట్ బాల్ స్పోర్ట్స్ డెవెలప్మెంట్ లిమిటెడ్
  • ముంబై ఇండియన్స్
  • అలోక్ ఇండస్ట్రీస్
వెబ్‌సైట్www.ril.com Edit this on Wikidata

రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశానికి చెందిన ఒక బహుళజాతీయ సంఘటిత సంస్థ. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ముఖేష్ అంబానీ దీనికి సారథ్యం వహిస్తున్నాడు. రిలయన్స్ కు దేశవ్యాప్తంగా ఎనర్జీ, పెట్రో రసాయననాలు, వస్త్రాలు, సహజ వనరులు, రీటెయిల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేసే అనేక సంస్థలు ఉన్నాయి. ఇది భారతదేశంలో అత్యంత లాభదాయకమైన కంపెనీ.[3] మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం బహిరంగ మార్కెట్లో ట్రేడ్ చేయబడుతున్న అతి పెద్ద కంపెనీ.[4] ఇటీవలే భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను అధిగమించి అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే సంస్థగా నిలిచింది.[5] 2020 సెప్టెంబరు 10 నాటికి 200 బిలియన్ డాలర్లు మార్కెట్ విలువ దాటిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.[6]

2020 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో కంపెనీ 96 వ స్థానంలో ఉంది.[7] ఇది 2016 నాటికి టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీలలో 8 వ స్థానంలో ఉంది. రిలయన్స్ భారతదేశపు అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతోంది. భారతదేశం యొక్క మొత్తం వస్తువుల ఎగుమతుల్లో 8% అంటే 1,47,755 కోట్ల రూపాయల విలువ గలిగినది. 108 దేశాలలో మార్కెట్లలో అందుబాటులో ఉంది.[8] కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా భారతదేశ మొత్తం ఆదాయంలో దాదాపు 5% రిలయన్స్ ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వస్తుంది. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారు.[8][9]

చరిత్ర

[మార్చు]

1958 సంవత్సరంలో ధీరూభాయ్ అంబానీ ఈ సంస్థను స్థాపించాడు.  ప్రస్తుతం ఆయన కుమారుడు ముకేశ్ అంబానీ ఆధ్వర్యం లో పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, రిటైల్, టెలీకమ్యూనికేషన్స్, ప్రచార సాధనారంగాలలో ( మీడియా) తో  సహా, భారతదేశంలోని అతిపెద్ద సంస్థలలో ఒకటిగా, దాని అనుబంధ సంస్థలైన,   రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ పెట్రోలియం వంటివి  ఉన్నాయి. రిలయన్స్ పరిశ్రమ సాంకేతిక, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో,  టెలికాం, ఇంటర్నెట్ వ్యాపారాల ద్వారా భారతదేశం డిజిటల్  రంగం పురోభివృద్ధిలో ఒకటిగా ఉన్న సంస్థ.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముంబైలో ఒక చిన్న వస్త్రాల (టెక్స్టైల్) తయారీ యూనిట్ తో  ప్రారంభమైంది.మొట్టమొదట రిలియన్స్ టెక్స్టైల్ పరిశ్రమపై దృష్టి పెట్టి, మార్కెట్లో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా అయింది. 1970 లలో, కంపెనీ పెట్రోకెమికల్స్, రిఫైనింగ్  పరిశ్రమలలోనికి  విస్తరించి, 1980 సంవత్సరమల వరకు  ప్రపంచంలోని అతిపెద్ద పెట్రోకెమికల్ కంపెనీలలో ఒకటిగా మారింది.

1986 లో, రిలియన్స్ ఇండస్ట్రీస్ ( ఆర్ఐఎల్)  పబ్లిక్ కంపెనీగా మారి,మరుసటి సంవత్సరం మూలధనాన్ని సమీకరించడానికి, కార్యకలాపాలను విస్తరించడానికి, తన మొదటి ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) ను జారీ చేయడం జరిగింది.1990 సంవత్సరాలలో రిలియన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమ విస్తరణలో భాగంగా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, ఆర్థిక సేవల వంటి రంగాలలో ప్రవేశం చేయడం జరిగింది.

2002 లో, ఆర్ఐఎల్ ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐపిసిఎల్) తో విలీనమై, కంపెనీ  పెట్రోకెమికల్, రిఫైనింగ్ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి సహాయపడింది.

2005 లో, ఆర్ఐఎల్ రిటైల్ రంగంలోకి ప్రవేశించి ముంబైలో తన మొదటి రిటైల్ దుకాణం (స్టోర్) ప్రారంభించింది. అప్పటి నుండి, కంపెనీ తన రిటైల్ కార్యకలాపాలను కిరాణా దుకాణాలు, హైపర్ మార్కెట్లు, ఆన్లైన్ రిటైల్ రంగంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది .

2016 లో, కంపెనీ తన టెలికాం సేవ జియోను ప్రారంభించి, భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటిగా మారింది. పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సేవలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కూడా  రిలియన్స్ (ఆర్ఐఎల్)  గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం రిలియన్స్ ఇండస్ట్రీస్  100 కి పైగా దేశాలలో తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తూ, భారతదేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా, దేశంలోని అనేక రంగాలలో అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందింది[10].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "RIL Annual Report 2020". RIL. Archived from the original on 24 April 2019. Retrieved 19 April 2020.
  2. "Reliance Industries Ltd. Share holding pattern". NDTV Profit. Archived from the original on 11 April 2017. Retrieved 8 November 2016.
  3. "Top companies in India by Net Profit". Moneycontrol.com. Archived from the original on 19 July 2017. Retrieved 20 July 2017.
  4. "Top '100' companies by market capitalisation as on July 19, 2017". Bseindia.com. Archived from the original on 15 July 2017. Retrieved 20 July 2017.
  5. "RIL becomes India's biggest company in revenue terms". The Economic Times. 21 May 2019. Retrieved 21 May 2019.
  6. "RIL becomes first Indian company to cross $200 billion in market valuation". Retrieved 10 September 2020.
  7. "Fortune Global 500 list". Archived from the original on 7 August 2019. Retrieved 18 October 2019.
  8. 8.0 8.1 "Reliance Industries AGM full text". 21 July 2017. Archived from the original on 6 August 2017. Retrieved 21 July 2017.
  9. "Reliance Industries Consolidated Balance Sheet, Reliance Industries Financial Statement & Accounts". moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 30 June 2020.
  10. "History of Reliance Group". Groww (in ఇంగ్లీష్). Retrieved 2024-07-08.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
రిలయన్స్ ఇండస్ట్రీస్
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?