For faster navigation, this Iframe is preloading the Wikiwand page for బ్రిటిషు భారతదేశంలో బిరుదు పతకాలు.

బ్రిటిషు భారతదేశంలో బిరుదు పతకాలు

వికీపీడియా నుండి

బిరుదు పతకాలు
Typeబిరుదు చిహ్నాలు
Awarded forవిశ్వాసపాత్రమైన సేవ లేదా ప్రజా సంక్షేమ కృషి
అందజేసినవారుభారత చక్రవర్తి
Eligibilityస్థానిక భారతీయులు, వైస్రాయి నియమించిన అధికారులు
Statusఇవ్వడం లేదు
Established1911 December 12
మొదటి బహుమతి1912 జూన్
Last awarded1947

Ribbon: 1st class

Ribbon: 2nd class

Ribbon: 3rd class

భారతదేశంలో బ్రిటిషు పాలనలో కొన్ని అధికారిక బిరుదులను పొందిన భారతీయ పౌరులకు బిరుదు పతకాలను (బ్యాడ్జీలు) అందజేశారు. 1947 లో స్వాతంత్ర్యం తరువాత ఈ అవార్డులు ఇవ్వడం ఆగిపోయింది.

స్థాపన

[మార్చు]

ప్రముఖ భారతీయులకు బిరుదులు ప్రదానం చేసే వ్యవస్థ భారతదేశంలో బ్రిటిషు వారు రాకమునుపే ఉండేది. విస్తృత పురస్కారాల వ్యవస్థలో భాగంగా, బ్రిటిషు వారు ఈ సంప్రదాయ భారతీయ బిరుదులను స్థానిక భారతీయ పౌరులకు, వైస్రాయ్ నియమించిన భారతీయ సైన్యానికి నమ్మకమైన సేవ, ప్రజా సంక్షేమ చర్యలకు ప్రతిఫలంగా ప్రదానం చేసేవారు. [1]

1911 లో ఢిల్లీ దర్బార్ వేడుకలలో, కింగ్ జార్జ్ V, బిరుదు పొందిన వారు ధరించేందుకు పతకాల శ్రేణిని స్థాపించాడు. తద్వారా వారు పొందిన బిరుదును బహిరంగంగా ప్రదర్శించడానికి వీలు కల్పించాడు. [2] స్వాతంత్ర్యానంతరం 1947 లో అవార్డును తొలగించారు.

తరగతులు

[మార్చు]

బిరుదు పొందిన వారి మతాన్ని, కొన్నిసార్లు ప్రాంతాన్నీ ప్రతిబింబించేలా మూడు తరగతులున్నాయి. [3] [4]

మొదటి తరగతి

రెండవ తరగతి

  • ఖాన్ బహదూర్, ముస్లింల కోసం;
  • రాయ్ బహదూర్ (ఉత్తర భారతదేశం) లేదా రావు బహదూర్ (దక్షిణ భారతదేశం), హిందువుల కొరకు;

మూడవ తరగతి [b]

  • ఖాన్ సాహిబ్, ముస్లింల కోసం;
  • రాయ్ సాహిబ్ (ఉత్తర భారతదేశం) లేదా రావు సాహిబ్ (దక్షిణ భారతదేశం), హిందువుల కోసం.

ఇతర మతాలకు చెందిన వారికి, అత్యంత సముచితమైన బిరుదును ఇచ్చేవారు. ఉదాహరణకు హిందూ పేరుగా ధ్వనించే పేరున్న భారతీయ క్రైస్తవులకు హిందూ బిరుదును ఇచ్చేవారు. [5] యూదులకు ముస్లిం బిరుదును ఇచ్చేవారు. [6]

ప్రాధాన్యతా క్రమంలో ముందు బ్రిటిషు, భారతీయ ఆర్డర్లు, అలంకరణలు, తరువాత బిరుదు పతకాలు, ఆ తరువాత ప్రచార పతకాలూ ఉంటాయి. [7] చాలా సందర్భాలలో, గ్రహీతలు నిమ్న తరగతి నుండి ఉన్నత తరగతులకు వెళ్ళేవారు. వారు,తాము పొందిన వాటిలో అత్యంత సీనియర్ బిరుదును, దాని బ్యాడ్జినీ మాత్రమే ఉపయోగించేవారు. వీటి ర్యాంకింగు నైట్ హుడ్ కంటే తక్కువ. నైట్ ఆఫ్ ఎ బ్రిటిషు ఆర్డర్ పొందిన వారు ఈ బిరుదులను వదిలేసేవారు. ఉదాహరణకు ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా గానీ, ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ గాని పొందినవారు ఈ బిరుదులను వాడేవారు కాదు. [8]

ఆర్డర్ ఆఫ్ బ్రిటిషు ఇండియా మొదటి తరగతి సభ్యులు సర్దార్ బహదూర్ అనే బిరుదును కూడా ఉపయోగించవచ్చు. రెండవ తరగతి సభ్యులు బహదూర్‌ను ఉపయోగించవచ్చు. ఈ సందర్భాలలో, బిరుదు బ్యాడ్జిని ధరించరు.

స్వరూపం

[మార్చు]

బ్యాడ్జ్‌లో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం, దానికి పైన సామ్రాజ్య కిరీటం ఉంటాయి. కిరీటం క్రింద లారెల్ పుష్పగుచ్ఛం ఉంటుంది. సెంట్రల్ మెడల్లియన్‌లో కిరీటంతో ఉన్న జార్జ్ V లేదా జార్జ్ VI ప్రొఫైల్ చుట్టూ ఉన్న బ్యాండ్‌లో బిరుదు రాసి ఉంటుంది. 1933 వరకు రాజు ముఖం బొమ్మ కుడివైపుకు తిరిగి ఉండేది. తరువాత, జార్జ్ V ముఖం ఎడమ వైపుకు చూస్తున్నట్లుగా మార్చారు. జార్జ్ VI ముఖం కూడా ఎడమవైపే చూసేది. [9]

వెనుకవైపు సాదాగా ఉండి, గ్రహీత పేరు, వివరాలు చెక్కి ఉండేవి. [2]

మూడు తరగతులు ఒకే పరిమాణంలో ఉండేవి: 58 మి.మీ. (2.3 అం.) ఎత్తు, 45 మి.మీ. (1.8 అం) వెడల్పు ఉంటాయి. వాటి లోహపు కూర్పు, రిబ్బను కింది విధంగా ఉంటాయి: [10]

  • 1 వ తరగతి: వెండి గిల్టు మీద లేత నీలం రంగులో ఎనామెల్ చేసిన సెంట్రల్ మెడల్లియన్‌లో బిరుదు రాసి ఉంటుంది. రిబ్బన్ లేత నీలం రంగులో, ముదురు నీలం అంచుతో, ఉంటుంది;
  • 2 వ తరగతి: ఎనామెల్ లేకుండా వెండి గిల్టు. రిబ్బన్ ఎరుపు రంగులో, ముదురు ఎరుపు అంచుతో ఉంటుంది;
  • 3 వ తరగతి: వెండి, ఎనామెల్డ్ ముదురు నీలపు సెంట్రల్ మెడల్లియన్లో బిరుదు రాసి ఉంటుంది. రిబ్బన్ ముదురు నీలం రంగులో, లేత నీలిరంగు అంచుతో ఉంటుంది.

అన్ని తరగతుల బ్యాడ్జీలను 39 మి.మీ. (1.5 అం) వెడల్పున్న రిబ్బనుతో మెడలో వేలాడదీసుకుంటారు. [11] అయితే కొన్నిసార్లు అనధికారికంగా ఇతర పతకాలతో పాటు ఎడమ ఛాతీపై ధరిస్తారు. [c]

ఇవి కూడా చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. Often also awarded to Sikhs from the Punjab.
  2. There may have been a Sardar Sahib Title Badge for Sikhs from the Punjab. Elsewhere they were rewarded as Hindus.
  3. Confirmed by contemporary photographs, e.g. C. S. Ratnasabhapathy Mudaliar

మూలాలు

[మార్చు]
  1. Captain H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
  2. 2.0 2.1 Mussell, John W., ed. (2015). Medal Yearbook 2015. Token Publishing Limited, Honiton, Devon. p. 305.
  3. Captain H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
  4. Tagore, Abanindranath; Tagore, Gaganendranath (2018). Fantasy Fictions from the Bengal Renaissance: Abanindranath Tagore's The Make-Believe Prince (Kheerer Putul); Gaganendranath Tagore's Toddy-Cat the Bold. Oxford University Press. ISBN 978-0-19-909217-8. Retrieved 12 August 2020.
  5. Tagore, Abanindranath; Tagore, Gaganendranath (2018). Fantasy Fictions from the Bengal Renaissance: Abanindranath Tagore's The Make-Believe Prince (Kheerer Putul); Gaganendranath Tagore's Toddy-Cat the Bold. Oxford University Press. ISBN 978-0-19-909217-8. Retrieved 12 August 2020.
  6. Joan G. Roland (1998). The Jewish communities of India. Transaction Publishers. p. 35. ISBN 0765804395. Retrieved 2020-08-12.
  7. Mussell, John W., ed. (2015). Medal Yearbook 2015. Token Publishing Limited, Honiton, Devon. p. 305.
  8. Captain H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
  9. Mussell, John W., ed. (2015). Medal Yearbook 2015. Token Publishing Limited, Honiton, Devon. p. 305.
  10. Captain H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
  11. Captain H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
బ్రిటిషు భారతదేశంలో బిరుదు పతకాలు
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?