For faster navigation, this Iframe is preloading the Wikiwand page for బ్యాంక్ ఆఫ్ ఇండియా.

బ్యాంక్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శాఖ.

బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ) (Bank of India (BOI)) అనేది ఒక భారతీయ జాతీయ బ్యాంకు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉన్నది . బ్యాంకు ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఉంది.బ్యాంక్ ఆఫ్ ఇండియా ను 1906 సంవత్సరంలో స్థాపించబడినది. 1969 సంవత్సరంలో జరిగిన భారత ప్రభుత్వ బ్యాంకుల జాతీయీకరణ నుండి ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది.

ముంబై లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ

31 మార్చి 2021 నాటికి, బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొత్తం వ్యాపారం ₹ 1,037,549 కోట్లు (US $ 140 బిలియన్లు)గా ఉంది, ప్రపంచవ్యాప్తంగా 5,108 శాఖలతో (24 విదేశీ శాఖలతో సహా), 5,551 ఎటిఎంలను కలిగి ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ముంబైకి చెందిన వ్యాపారవేత్తల బృందం 1906 సెప్టెంబర్ 7న బ్యాంక్ ఆఫ్ ఇండియాను 50 లక్షల పెయిడ్-అప్ మూలధనంతో స్థాపించినారు. 1921 సంవత్సరంలో అన్ని వర్గాలకు సేవ చేయడానికి భారతీయలు ఆసక్తి కనబరచి, ప్రోత్సహించిన మొట్టమొదటి బ్యాంకు. 1921 సంవత్సరంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ తో బ్యాంకు వారి క్లియరింగ్ హౌస్ ను నిర్వహించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1946 సంవత్సరంలో లండన్ లో దేశం వెలుపల ఒక శాఖను ప్రారంభించిన మొదటి భారతీయ బ్యాంకు. 1950-1962 మధ్యకాలంలో టోక్యో, ఒసాకా, సింగపూర్, కెన్యా, ఉగాండా, అడెన్, టాంగానికా, హాంగ్ కాంగ్, నైజీరియాలలో తమ శాఖలను ప్రారంభించారు. జూలై 1969 సంవత్సరంవరకు బ్యాంకు ప్రైవేట్ యాజమాన్యం, నియంత్రణలో ఉంది, అప్పుడు దేశంలో జరిగిన బ్యాంకుల జాతీయకరణలో 13 ఇతర బ్యాంకులతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడింది. 1972 సంవత్సరంలో బ్యాంక్ తమ ఉగాండా కార్యకలాపాలను బ్యాంక్ ఆఫ్ బరోడాకు విక్రయించింది. 1974వ స౦వత్సర౦లో వారు యూరప్ పారిస్లో ఒక బ్రా౦చిని ప్రార౦భి౦చిన మొదటిదానిగా,1989 సంవత్సరంలో ముంబాయిలోని మహాలక్ష్మి శాఖలో పూర్తి కంప్యూటరైజ్డ్ బ్రాంచ్, ఎటిఎమ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసిన జాతీయ బ్యాంకుల్లో ఈ బ్యాంకు మొదటిది. 1997 సంవత్సరం లో బ్యాంకు మొదటి పబ్లిక్ ఇష్యూతో ముందుకు వచ్చింది. 1997 నవంబరులో బులియన్ బ్యాంకింగ్ ను ప్రవేశపెట్టారు. చెక్కుల వేగవంతమైన సేకరణ, చెక్కుల వాస్తవ రియలైజేషన్ కొరకు వేచి ఉండకుండా కస్టమర్ లకు తక్షణ నిధులను విడుదల చేయడం కొరకు, 2000 సంవత్సరంలో బ్యాంక్ స్టార్ క్యాష్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ 2000ను ప్రవేశ పెట్టడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్ బీటీ) ద్వారా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ పోలీస్స్ అమలులో 'ది బెస్ట్ బ్యాంక్'గా నిలిచింది.[2]

బ్యాంక్ ఆఫ్ ఇండియా
రకంపబ్లిక్
బి.ఎస్.ఇ: 532149
NSE: BANKINDIA
ISININE084A01016
పరిశ్రమబ్యాంకింగ్
ఆర్ధిక సేవలు
స్థాపన7 సెప్టెంబరు 1906; 118 సంవత్సరాల క్రితం (1906-09-07)
ప్రధాన కార్యాలయంముంబై, భారతదేశం
Number of locations
  • 5,430 శాఖలు
  • 5,551 ఏ టి ఎంలు
 (మార్చ్ 2021)
కీలక వ్యక్తులు

  • (Non-Exe Chairman)[3]
  • Atanu Kumar Das
    (MD & CEO)[4]
ఉత్పత్తులు
  • కన్స్యూమర్ బ్యాంకింగ్
  • కార్పొరేట్ బ్యాంకింగ్
  • ఆర్ధిక &ఇన్సూరెన్స్
  • ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్
  • తనఖా లోన్లు, ప్రైవేట్ బ్యాంకింగ్
  • ప్రైవేట్ ఈక్విటీ
  • సేవింగ్స్
  • సెక్యూరిటీస్
  • అస్సెట్ మేనేజిమెంట్
  • వెల్త్ మేనేజిమెంట్
రెవెన్యూIncrease 48,040.93 crore (US$6.0 billion) (2021)[5]
Operating income
Increase 10,872 crore (US$1.4 billion) (2021)
Net income
Increase 2,160 crore (US$270 million) (2021)[5]
Total assetsIncrease7,25,856.45 crore (US$91 billion) (2021)[5]
యజమానిభారత ప్రభుత్వం (81.41%) (2021) [6]
ఉద్యోగుల సంఖ్య
51,459 (మార్చ్ 2021) [7]
మాతృ సంస్థఆర్ధిక శాఖ, భారత ప్రభుత్వం
మూలధన నిష్పత్తి14.93% (2021)[5]

సేవలు

[మార్చు]

బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు క్రింది సేవలను భారతీయ ఖాతాదారులకు, ప్రవాస భారతీయాలకు అందిస్తుంది.[8]

  • కన్స్యూమర్ బ్యాంకింగ్
  • కార్పొరేట్ బ్యాంకింగ్
  • ఇంటర్నెట్ , మొబైల్ బ్యాంకింగ్
  • ఫైనాన్స్ , ఇన్స్యూరెన్స్ లు
  • ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్
  • తనఖా రుణాలు
  • ప్రైవేట్ బ్యాంకింగ్
  • సెక్యూరిటీలు
  • సంపద నిర్వహణ
  • ఆస్తుల నిర్వహణ
  • పొదుపు, ఈక్విటీ , ఇతరములు.

అవార్డులు

[మార్చు]

బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు అందించిన సేవలకు, బ్యాంకింగ్ రంగములో సాంకేతిక అందుబాటును తీసుక రావడ వంటి వాటికి వివిధ సంస్థలచే గుర్తించి, అవార్డులను అందుకున్నది.[9]

  • 2009 సంవత్సరానికి గాను బ్యాంకింగ్ టెక్నాలజీలో సాధించిన విజయానికి గుర్తింపుగా ఉత్తమ బిజినెస్ ఎనేబుల్ మెంట్ ఇనిషియేటివ్ కేటగిరీలో ఐబిఎ నుండి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్ 2010లో విజేతల అవార్డును బ్యాంక్ అందుకుంది.
  • దలాల్ స్ట్రీట్ ద్వారా ఎఫ్ ఈ-ఈవై మోస్ట్ ఎఫిషియంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ 2010 గా గుర్తింపు.
  • ఎన్ డిటివి ప్రాఫిట్ బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్ 2009 – బెస్ట్ పిఎస్ యు బ్యాంక్
  • అవుట్ లుక్ మనీ ఎన్ డిటివి ప్రాఫిట్ అవార్డ్స్ 2009 - బెస్ట్ ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడర్ - రన్నరప్
  • CIO గ్రీన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవార్డు.
  • డన్ & బ్రాడ్ స్ట్రీట్ - రోల్టా కార్పొరేట్ అవార్డ్స్ 2009, బ్యాంకింగ్ కేటగిరీ కింద ఉత్తమ బ్యాంకు.

మూలాలు

[మార్చు]
  1. "Bank of India - Annual Report -2020-21" (PDF). bankofindia.co.in/. 1 July 2022. Archived from the original (PDF) on 20 జూలై 2021. Retrieved 1 July 2022.
  2. "Bank of India". Business Standard India. Retrieved 2022-07-01.
  3. "BOI | Bank of India". www.bankofindia.co.in. Archived from the original on 2019-10-29. Retrieved 2022-07-01.
  4. "bank-of-baroda-bank-of-india-and-canara-bank-get-new-md-ceos". livemint. Retrieved 21 January 2020.
  5. 5.0 5.1 5.2 5.3 "Annual Report of Bank of India" (PDF). Archived from the original (PDF) on 2021-07-20. Retrieved 2022-07-01.
  6. "Share Holding Pattern 2021" (PDF). Archived from the original (PDF) on 2021-10-17. Retrieved 2022-07-01.
  7. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; సంవత్సర నివేదిక 2020-21 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. 99Employee (2022-05-21). "Bank of India History". 99Employee (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-01.((cite web)): CS1 maint: numeric names: authors list (link)
  9. "Bank Of India: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of Bank Of India - NDTVProfit.com". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-01.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
బ్యాంక్ ఆఫ్ ఇండియా
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?