పాండవులు పాండవులు తుమ్మెద
వికీపీడియా నుండి
పాండవులు పాండవులు తుమ్మెద | |
---|---|
రచన | గోపీమోహన్ |
తారాగణం | మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, రవీనా టాండన్ |
నిర్మాణ సంస్థ | లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ |
పంపిణీదార్లు | లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ |
విడుదల తేదీ | 31 జనవరి 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పాండవులు పాండవులు తుమ్మెద 2014 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు మోహన్ బాబు స్వంత నిర్మాణ సంస్థ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో 58వ చిత్రంగా ఇది నిర్మితమవుతున్నది.
కథ
[మార్చు]నాయుడు (మోహన్ బాబు) బ్యాంకాక్ లో టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తుంటాడు.ఆయనకు ముగ్గురు కొడుకులు (మంచు మనోజ్,వరుణ్ సందేశ్, తనీష్) అక్కడే హోటల్ వ్యాపారం చేసే సత్య (రవీనా టాండన్)కు ఇద్దరు కొడుకులు (మంచు విష్ణు, వెన్నెల కిషోర్) అయితే ఇక్కడ చిన్న ప్రేమ కథ ఉంది. ఈ నాయుడు సత్య కొన్ని కారణాల వల్ల గతంలో ప్రేమించి విడిపోతారు. రవీనా ఇంట్లో అతిధిగా ఉండే హనీ (హన్సికా మోట్వాని) వీరి విషయం తెలుసుకుని వారిద్దరికీ పెళ్ళి చేసి ఇద్దరినీ ఒక ఇంటి వారిని చేస్తుంది. అయితే వారిద్దరి పిల్లలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. అలాంటి సమయంలో పిల్లలకు తాము అనాథలమని తెలుస్తుంది. అప్పుడు వారు తమను పెంచుతున్న తల్లితండ్రి తమ కోసం చేసిన త్యాగం ఏమిటనేది తెలుసుకుంటారు.అలా ఉంటున్న సమయంలో ఓ గ్యాంగ్ వచ్చి హనీని బలవంతంగా తీసుకు వెళ్ళి పోతుంది. ఆమెను కాపాడు కోవడం కోసం నాయుడు కుటుంబం ఏమి చేసింది అనేది మిగిలిన కథ.
నటవర్గం
[మార్చు]- మోహన్ బాబు
- రవీనా టాండన్
- మంచు మనోజ్
- బ్రహ్మానందం
- ఎం. ఎస్. నారాయణ
- ఆలీ
- రఘుబాబు
- గుర్లిన్ చోప్రా
- అలేఖ్య వర్మ
- తెలంగాణ శకుంతల
- గిరిబాబు
- పోసాని కృష్ణమురళి
- కాశీ విశ్వనాథ్
- కృష్ణ భగవాన్
- సుప్రీత్
- తనికెళ్ళ భరణి
- తాగుబోతు రమేశ్
పాటల జాబితా
[మార్చు]సత్తెమ్మ సత్తెమ్మ , గానం.శ్రేయా ఘోషల్ , మనో
బుర్ర గిర గిర , గానం.అచ్చు రాజమణి, రంజిత , శ్రీలేఖ పార్ధసారధి
పాండవులు పాండవులు తుమ్మెదా , గానం.బాబాసెహగల్
గుచ్చి గుచ్చి నువ్వుచూడలేక , గానం.అదాన్ సామి , శ్రేయా ఘోషల్
చూసా నేను , గానం.ఉదిత్ నారాయణ
సాటర్ డే నైట్ , గానం: హేమచంద్ర , చారు సెంవై జోనిత . .
సాంకేతికవర్గం
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]- చిత్ర మొదటి ప్రచార పత్రిక
- చిత్రంలో మోహన్ బాబు గెటప్ Archived 2013-11-16 at the Wayback Machine
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.