For faster navigation, this Iframe is preloading the Wikiwand page for ఖర్జూరం.

ఖర్జూరం

వికీపీడియా నుండి

ఖర్జూరం
మొరాకో దేశంలో 'మెర్జువొగా'లో ఖర్జూరం చెట్లు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
ఆరెకేల్స్
Family:
Genus:
Species:
పి. డాక్టీలిఫెరా
Binomial name
ఫీనిక్స్ డాక్టీలిఫెరా

ఖర్జూరం (ఆంగ్లం Date Palm) ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. పామే (palm) కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ఫీనిక్స్‌ డాక్టీలిఫెరా. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. తాటిచెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి. ఒక మగచెట్టు నుంచి వచ్చే పరాగరేణువులు సుమారు 50 ఆడచెట్లను ఫలవంతం చేస్తాయట. అయితే ఇటీవల ఆపాటి మగచెట్లను పెంచడం కూడా ఎందుకనుకుని పరాగరేణువుల్ని నేరుగా మార్కెట్లో కొని ఫలదీకరించే పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు. 5-8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది అక్టోబరు - డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్‌ మార్కెట్టుకెళ్లినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసిన విభిన్న ఖర్జూరాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో కచ్చితంగా తెలియకున్నా మనిషికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని ఒయాసిస్సు ప్రాంతాలే దీని స్వస్థలం అని కొందరంటారు. పర్షియన్‌ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీ.పూ. సుమేరియన్లు తొలిగా పెంచారనీ తరువాత బాబిలోనియన్లూ అస్సీరియన్లూ ఈజిప్టియన్లూ మరింతగా పెంచి పోషించినట్లుగా చెబుతారు. ఆపైన అరబ్బుల ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కీ అక్కడ నుంచి కాలిఫోర్నియాకీ దీని శాఖలు విస్తరించినట్లుగా కనిపిస్తోంది. అందుకే యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి గౌరవిస్తారు. శాంతికీ, న్యాయానికీ, రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట. ఈ చెట్టును కేవలం పండ్ల కోసమే కాక నీడకోసం పశువుల మేతకోసం కలపకోసం ఆయుధాలు, తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఖర్జూరం సాగు

[మార్చు]
ఖర్జూరం పండించే మొదటి పది దేశాలు — 2005
(వేల టన్నుల్లో)
 Egypt 1,170.00
 సౌదీ అరేబియా 970.49
 ఇరాన్ 880.00
 United Arab Emirates 760.00
 Algeria 516.29
 పాకిస్తాన్ 496.58
 Sudan 328.20
 Libya 150.00
 China 130.00
 Tunisia 125.00
మొత్తం ప్రపంచ ఉత్పత్తి 5526.56
వనరు:
ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (FAO)
[1] Archived 2007-03-10 at the Wayback Machine

ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగుచేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరచెట్ల బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆలీస్‌ స్ప్రింగ్స్‌తోపాటు పశ్చిమ చైనా, పశ్చిమ భారతం, దక్షిణ పాకిస్తాన్ లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్‌వన్‌గా ఈజిప్టు మన్ననలందుకుంటోంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు.

ఖర్జూరంలో రకాలు

[మార్చు]

పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా ఉంటే రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా ఉంటాయి. మూడో రకం తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే 'కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌' అని కూడా అంటారు. తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని 'హనీ బాల్‌' అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే 'డెగ్లట్‌ నూర్‌', పుడ్డింగ్‌లా కనిపించే 'ఖాద్రావి', అచ్చం తేనెలా ఉండే 'హనీ', నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే 'బ్లాక్‌ డేట్‌', పొడవుగా కాస్త అంబరు (amber) వర్ణంలో నమిలేటట్లుగా ఉండే 'గోల్డెన్‌ ప్రిన్సెస్‌'... ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి.

ఎండు ఖర్జూరాలు

[మార్చు]

ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండుఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.

పవిత్రఫలం

[మార్చు]

సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహమ్మద్‌ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖోరాన్ పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. అంతేగాక, ముస్లింల ప్రథమ మసీదు మదీనా లోని మస్జిద్ ఎ నబవీ (ప్రవక్త గారి మసీదు) నిర్మాణం కొరకు ఉపయోగించింది, ఖర్జూరపు చెట్టు కలప, పై కప్పులకు ఖర్జూరపు చెట్టు ఆకులు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

ఉపయోగాలు

[మార్చు]
ఖర్జూరం చెట్టు పైభాగాన గెలలు
ఎండు ఖర్జూరం, డెగ్లెక్ట్ నూర్ (తినగలిగే భాగాలు)
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి1,180 కి.J (280 kcal)
75 g
చక్కెరలు63 g
పీచు పదార్థం8 g
0.4 g
2.5 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ సి
0%
0.4 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు21 g
  • Units
  • μg = micrograms •mg = milligrams
  • IU = International units
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database
అమ్మకానికి ఖర్జూర పండ్లు. కొత్తపేట మార్కెట్ వద్ద తీసిన చిత్రము

ఖర్జూరం, పండుగానే కాక చెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

  • లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు.
  • ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరికప్పులుగా వాడటమూ ఎక్కువే.
  • తాటి ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
  • ఎండుటాకులు చీపుళ్లుగానూ వంటచెరకుగానూ ఉపయోగపడతాయి.
  • ఆకుల్లోని పీచుతో తాళ్లు, టోపీలు, నేతబట్ట... లాంటివీ అల్లుతారు.
  • కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.
  • నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి.
  • సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు.
  • ఆక్జాలిక్‌ ఆమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు.
  • కాఫీ బీన్స్‌ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలపడమూ కద్దే.
  • ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు.
  • పూమొగ్గల్ని సలాడ్‌లలో ఎండుచేపల కూరల్లో వాడతారు.

ఖర్జూరంతో వైద్యం

[మార్చు]
  • పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
  • గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.
  • డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.
  • చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.
  • ఖర్జూర తినడము వలన మలబద్ధకం తగ్గుతుంది, ఎముకలు బలంగ తయారవుతాయి, ఉదర క్యాన్సర్ తగ్గుతుంది.
  • ఖర్జూర పండు అధిక ఇనుము కలిగి ఉంటుంది. అందువలన ఇది రక్తహీనత తగ్గించడములో సహాయపడుతుంది.

jirna shakthi peruguthundhi

ఇతర విశేషాలు

[మార్చు]
  • గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఖర్జూరపండ్లు కనీసం నెలరోజులు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు.
  • ఒకవేళ మరీ ఎక్కువ ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్‌ ద్వారా వాటిని పంచదార, జామ్‌, జెల్లీ, జ్యూస్‌, సిరప్‌, వినెగర్‌గా మార్చి విక్రయిస్తున్నారు.
  • బలవర్థకమైన ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్‌ను తేనెలా రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటుంటారు.
  • ఇస్లామిక్‌ దేశాల్లో రంజాన్‌ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్‌ లాంటి పానీయాన్ని తాగుతున్నారు.
  • మొరాకోలాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని వంటల్లో విరివిగా వాడతారు.
  • సహారా వాసులు గుర్రాలు, ఒంటెలు, కుక్కలకు ఆహారంగా ఎండు ఖర్జూరాల్ని వాడతారు.
  • ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ రకమైన బీరును తయారుచేస్తారు.

మూలాలు

[మార్చు]


బయటి లింకులు

[మార్చు]


{{bottomLinkPreText}} {{bottomLinkText}}
ఖర్జూరం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?