కవలలు
వికీపీడియా నుండి
ఒకే తల్లికి ఒకసారి పుట్టిన లేదా ఒకే గర్భ నుంచి జన్మించిన ఇద్దరు పిల్లలను కవలలు అంటారు. వాళ్ళు ఏ లింగానికైనా చెంది ఉండవచ్చు. వారు ఒకే పోలికలతో ఉంటే మోనోజైగోటిక్, వేర్వేరు పోలికలతో డైజీగోటిక్ అని వ్యవహరిస్తారు.
అవిభక్త కవలలు
[మార్చు]గర్భంలో ఇద్దరు పిల్లల శరీరాలు కలిసిపోయి జన్మిస్తే వారిని అవిభక్త కవలలు. లేదా సియామీ కవలలు (Siami Twins) అంటారు. చాలా అరుదైన పరిస్థితుల్లోనే ఇలా జన్మించడం జరుగుతుంది. సాధారణంగా ఇది 50 వేలలో ఒకరి నుంచి రెండు లక్షలలో ఒక పుట్టుకల్లో సంభవించే అవకాశం ఉంది.
గణాంకాలు
[మార్చు]2006 వ సంవత్సరంలో జరిపిన ఒక సర్వే ఆధారంగా ప్రపంచం మొత్తం మీద 12.5 కోట్ల కవలలు నివసిస్తున్నట్లు ఒక అంచనా.[1] ఇది ప్రపంచ జనాభాలో 1.9 శాతం. వీరిలో మోనోజైగోటిక్ కవలలు 10 మిలియన్లు కాగా మిగతా వారందరూ డైజీగోటిక్ కవలలే.
పురాణాలలో కవలలు
[మార్చు]- వేదాలలో అశ్వినీ దేవతలు.
- రామాయణంలో సీతారాముల కుమారులు లవుడు, కుశుడు.
- మహాభారతంలో పాండురాజు మాద్రి కుమారులు నకులుడు, సహదేవుడు.
ఆధునిక కవలలు
[మార్చు]- ఆర్కాటు రామస్వామి ముదలియర్, ఆర్కాటు లక్ష్మణస్వామి ముదలియర్
- స్టీవ్ వా — మార్క్ వా (ఆస్ట్రేలియా)
మూలాలు
[మార్చు]- ↑ Oliver, Judith (2006). "Twin Resources". Economic and Social Research Council. Archived from the original on 2009-05-15. Retrieved 2009-04-21.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.