ఇంటూరి వెంకటేశ్వరరావు
వికీపీడియా నుండి
ఇంటూరి వెంకటేశ్వరరావు | |
---|---|
జననం | ఇంటూరి వెంకటేశ్వరరావు జూలై 1, 1909 గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి |
మరణం | 2002 |
వృత్తి | తెలుగు సినిమా రచయిత |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధులు |
మతం | హిందూ |
తండ్రి | నరసింహం పంతులు |
తల్లి | లక్ష్మీకాంతమ్మ |
ఇంటూరి వెంకటేశ్వరరావు (జూలై 1, 1909 - 2002) స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.
ఇతను గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.
ఇతను సహాయ దర్శకునిగా సుమతి, మాయలోకం, పేద రైతు, లక్ష్మి, సక్కుబాయి, నాగపంచమి, లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు పనిచేశారు. వీరు సృష్టించిన కుమ్మరి మొల్ల కావ్యం నాటకం, రేడియో నాటకం, బుర్రకథ, సినిమాలుగా వెలుగుచూసింది.
వీరు చాలాకాలం నవజీవన్ సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు.వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక చిత్రకళను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు.
స్క్రీన్ (Screen) అనే ఆంగ్ల సినీ వారపత్రిక వీరి జీవితాన్ని సంగ్రహంగా ముద్రిస్తూ "ఎ మ్యాన్ ఆఫ్ మిలియన్ ఐడియాస్"గా అభివర్ణించింది.
రచనలు
[మార్చు]- ఆంధ్ర హాలీవుడ్
- మ్యూజింగ్స్ ఆఫ్ ది సెక్స్
- తెలుగు సినిమా విశ్వరూపం
- లూమినరీస్ ఆఫ్ తెలుగు ఫిలిండమ్ (ఆంగ్లం)
పురస్కారాలు
[మార్చు]- ఆంధ్ర విశ్వకళాపరిషత్తు 1985లో వీరికి కళా ప్రపూర్ణతో సత్కరించింది.
- 1996 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది.
- రామబ్రహ్మం జర్నలిస్టు అవార్డు
- రామనాథ్ అవార్డు
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]యితర లింకులు
[మార్చు]- ఇంటూరి వెంకటేశ్వర రావు గారి జీవిత చరిత్ర Archived 2016-03-05 at the Wayback Machine
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.