ఆషాఢమాసము
వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.
అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని 'నవకళేబర ఉత్సవం' అంటారు.
విశేషాలు
[మార్చు]ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు.ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు.శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు. తెలుగునాట ఇది తొలి ఏకాదశి . పేలపిండి తింటారు.ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.
- సా.శ.. 1893 : విజయ సంవత్సరం తిరుపతి వేంకట కవులు ఏలూరు పట్టణంలో శతావధానము నిర్వహించారు.[1]
- సా.శ.. 1894 : జయ నామ సంవత్సరం విశాఖపట్నంలో అష్టావధానము నిర్వహించారు.[2]
- సా.శ.. 1896 : దుర్ముఖి నామ సంవత్సరం: తిరుపతి వేంకట కవులు మొగల్తుర్తి కోటలోశతావధానము జరిపారు.[3]
హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోబడుతుంది.
పండుగలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 12. Retrieved 26 June 2016.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 40. Retrieved 27 June 2016.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 61. Retrieved 27 June 2016.
ఖగోళవేత్తలు |
|
---|---|
పనులు (వర్క్స్) |
|
ఇన్స్ట్రుమెంట్స్ |
|
భావనలు (కాన్సెప్ట్స్) |
|
కేంద్రాలు |
|
ఇతర ప్రాంతాలు |
|
వేద క్యాలెండర్ నెలలు తెలుగు నెలలు |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.