For faster navigation, this Iframe is preloading the Wikiwand page for ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం.

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసే వారు వృత్తిరీత్యా ప్రభుత్వోద్యోగులు. లలిత కళారాధన వారి ప్రవృత్తి. కవులు, రచయితలు, రచయిత్రులు, నటీనటులు, చిత్రకారులు, గాయకులు, వాద్యకారులు ఇలా సచివాలయ ఉద్యోగులలో వివిధ లలితకళలలో కేవలం ప్రవేశమే కాదు ప్రావీణ్యమున్న వారు ఎందరో ఉన్నారు. ఈ సచివాలయ ఔత్సాహిక కళాకారుల సాంస్కృతిక వేదిక ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం.

స్ధాపించిన తొలి సంవత్సరాలలో సంఘం అలెగ్జాండర్ నాటక ప్రదర్శన చేపట్టిందట. ఆ ప్రదర్శనను దామోదరం సంజీవయ్య అనే కళాశాల విద్యార్థిచూసారు. కాలగతిలో వారు రాష్ట్రముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘ రంగస్థలానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు, అలెగ్జాండర్ వీర్రాజు గారేరని అడిగేరట. దశాబ్దాల క్రితం చూసిన నాటకం వారి మీద ఎంత ముద్ర వేసిందో, వారి స్మృతిలో ఎంతగా నిలిచిందో తెలియ చేయడానికి ఈ సంఘటన తార్కాణం. ఈ సంఘటన విన్నదే కాని వినేటప్పుడు, తలుచుకున్నప్పుట్టు గగుర్పాటు కలుగుతుంది. సంఘం సభ్యులు తమ నేర్పరి తనంతో రసజ్ఞుల అభిమానాన్ని పొందే వారు. తెలియకుండా తమకంటూ అభిమానులను సంపాదించు కునే వారు.

హైదరాబాదు దూరదర్శన్ కేంద్రంలో ప్రసారాలు ప్రారంభమైన తొలి రోజుల్లో నాటకాలు హెచ్చుగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఆ నాటకాలలో చాలా ఉత్సహాంగా పాల్గొనే వారు. అంతే కాదు సినిమా లలో కూడా వారు పాత్రలు ధరించేవారు.శేషగిరిరావు, శ్రీకాంత శర్మ, వి. అర్జునరావు, రామ్మూర్తి, అర్జునరావు, కక్కెర్ల కొమరయ్య చాలా సినిమాలలో కనిపించారు. ముత్యాలముగ్గు చిత్రంతో గుర్నాధం (కంట్రాక్టర్ తో మాట్లాడిన పంచదార వ్యాపారి), పెళ్లీడు పిల్లలు చిత్రంలో సూర్యకాంతం భర్త పాత్రలు పోషించినది శేషగిరిరావు. పెళ్లీడు పిల్లలు చిత్రంలో జె.బి. రావు (జె.వి.సోమయాజులు పోషించిన పాత్ర) కు పి.ఎ. పాత్రను శ్రీకాంత శర్మ పోషించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం రూపొందించిన ఆనందోబ్రహ్మ సీరియల్ లో వి. అర్జునరావు, రామ్మూర్తి కనిపిస్తారు. అరవై ఐదు సంవత్సరాలకు పైగా కళా ప్రస్ధానం సాగిస్తున్న ఆ సంస్ధ, సంస్ధ సభ్యుల గురించి తెలిసిన కొన్ని విషయాలు -

స్ధాపన-తొలితరం సంఘ సారధులు

[మార్చు]

సచివాలయ ఉద్యోగులలో అంతర్లీనంగా లలిత కళలలో వారికి ఉన్న ప్రావీణ్యతని వెలికితీసి, వారి నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో 1943 సంవత్సరంలో, అప్పటి మదరాసు ఉమ్మడి రాష్ట్రంలో కళల పట్ల ఆసక్తి కలిగిన వారిచే స్థాపించ బడింది. సంఘం తొలి అధ్యక్షుడు శ్రీ సంగం బాబు. ఆయనకు సర్వశ్రీ జనార్ధనరావు, భక్తవత్సలం, బి.రామారావు, ఆళ్ల పిచ్చయ్య, సింహాద్రి రాఘవులు మున్నగు వారు తోడుగా నిలిచేరట.

రెండవ తరం

[మార్చు]

సర్వశ్రీ శ్రీనివాసరావు, కె.జి.వీర్రాజు, వి.కె.రామారావు, జగన్మోహన రావు, కె.వెంకట్రామయ్య, లక్ష్మణరావు, మంగు అప్పారావు, చెల్లారావు, సుబ్బారావు, డి.నరసింహారావు ప్రభృతులు సంఘాన్ని ముందుకు నడిపించారు.

మొన్నటి తరం

[మార్చు]

సర్వశ్రీ జోళ్యపాళెం సిధ్ధప్ప నాయుడు, ఇ.ఎల్.నరసింహారావు, డి.వి.ఎస్. శాస్త్ర్రి, వి.రాధాకృష్ణమూర్తి, ఆర్.వి.ఎస్. రామస్వామి ప్రముఖులు. సిధ్దప నాయుడు ప్రముఖ రంగస్ధల దర్శకుడు ఎ.ఆర్.కృష్ణ ప్రయోగాత్మకంగా, ప్రతిష్ఠాత్మకంగా ప్రదర్సించిన మాలపిల్ల నాటకంలో రామదాసు పాత్ర పోషించారు. అంతేకాక ఆయన ధర్మదాత, దాసి మొదలగు చిత్రాలలో నటించారు. ఆర్.వి.ఎస్.రామస్వామి ఫ్రముఖ రచయిత ఈయన రచించిన గాలివాన, వలయం నాటకాలు సుప్రసిధ్దాలు. గాలివాన నాటకం పలు పరిషత్తులలో ప్రదర్శించ బడి ఉత్తమ ప్రదర్శన బహుమతులు గెలుచుకొంది. ఈ నాటకంలో ప్రముఖ సినీనటుడు కీ.శే. నూతన్ ప్రసాద్ నటించాడు.

నిన్నటి తరం

[మార్చు]

సర్వశ్రీ ఎం. వెంకట్రామయ్య. శేషగిరిరావు, కె.ఎస్.ఆర్. ప్రసాద్, శిఖరం సాంబశివరావు, బి.నారాయణ, ఊటుకూరి సూర్యప్రకాశరావు, సామినేని రంగారావు, కె.హనుమంత రావు, శ్రీనివాసమూర్తి, యడ్ల నాగభూషణం, మల్లిఖార్జునుడు, కీ.శే. పులిశివ మల్లిఖార్జునరావు, చిలుకూరి వెంకటప్పయ్య, పోలిశెట్టి రామ్మోహన్ రావు, కీ.శే. యం.వి.చలపతిరావు, శ్రీకాంత శర్మ, కె.జె.సదానందరావు, కె, కొమరయ్య, బొబ్బిలి భాస్కర్ రెడ్డి, బి.ఎన్.ఎస్.కుమార్, పి.ఎల్.కృష్ణ, శ్రీ కె.వి.సుకుమార్ బాబు, రామ్మూర్తి, వి. అర్జునరావు తదితరులు సంఘానికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. సంఘ కీర్తి పతాకం సగర్వంగా వినీలాకాశంలో సగర్వంగా రెపరెపలాడిన కాలం. ముఖ్యంగా 1975 - 2000 మధ్యకాలం దాదాపు పాతిక సంవత్సరాలు సంఘ కార్యక్రమాలు తారస్ధాయిలో జరిగేయి. రాష్ట్లంలో ఏ సాంస్కృతిక సంస్ధ, సంఘ కీర్తి ప్రతిష్ఠలకు ఎదురు నిలువలేకపోయింది. సంఘ చరిత్రలో ఈ కాలాన్ని సువర్ణాధ్యయంగా పేర్కొన వచ్చు. ముందు తరం నటులతో యువ సభ్యులు కలిసి నడిచారు. కొత్త, పాత కలయికతో ఎన్నో మంచి కార్యక్రమాలు రూపొందాయి. సభ్యుల అంతర్గత కలహాలు, ఆధిపత్యపు పోరులు సంఘ కార్యకలాపాలపై పడలేదు సరికదా ఆ స్ఫర్ధ సంఘ అభ్యుదయానికి మరింతగా తోడ్పడింది. తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించుకోడానికి పోటీపడేవారు. సంఘేతర రచయితల పై ఆధార పడకుండా చిలకూరి వెంకట్పయ్య నాటక రచనకి పూనుకున్నారు. బొబ్బిలి భాస్కరరెడ్డి, కె.ఎస్.ఆర్.మూర్తి వంటి గాయకులు నాటకాలకు తమ గళాన్ని మేళవించారు.
కె.ఎస్.ఆర్.ప్రసాద్ కుక్క సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో కొంత మంది నటీనటులకు వారికి లభ్యమైన పేరు ప్రతిష్ఠలతో వారి పేరు ముందు కుక్క చేరింది. (ఉ. కుక్క పద్మ) ఈ సినిమా ఉదయం ఆటలలో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. నంది బహుమతులను గెలుచుకుంది. శ్రీ బి.ఎన్.ఎస్.కుమార్ గారు గొప్ప రూపశిల్పి. చిలుకూరి వెంకటప్పయ్య నాటక రచయిత. కొన్ని టివి సీరియల్స్ కూడా రచించారు. టి.వి కోసం ఆయన ధూర్జటి సీరియల్, విశ్వనాధ నాయకుడు టెలి ప్లే రచించారు. సంఘం ద్వారా కార్యక్రమాలు చేపట్టలేని సమయంలో అనుబంధ సంస్ధలద్వారా కార్యక్రమాలు చేపట్టారు. చిలకూరి వెంకటప్పయ్య రచించిన శాతవాహన నాటకాన్ని శిఖరం సాంబశివరావు దర్శకత్వంలో రాష్ట్రమంతటా ఎం. వెంకట్రామయ్య, పులిశివ మల్లిఖార్జునరావు, శ్రీకాకుళం సుబ్బారావు, మడకా రామ్మోహన్, ఉష మున్నగు వారు ప్రదర్శించారు.

నేటితరం

[మార్చు]

సర్వశ్రీ/ శ్రీమతి /కుమారి పాలేటి చంద్రశేఖర్, కె.ఎస్. అర్ మూర్తి, కె.వి.శేషు, వి.పి.కె.బసవయ్య, ఎ.బదరీనారాయణ స్వామి, ఆర్. అలెగ్జాండర్, లంక లక్ష్మీ నారాయణ, పింగళి సాంబశివరావు, ఆర్.కె.హరినాధ్ బాబు, సరస్వతుల రామ నరసింహం (సరసి), శ్యామ్ నాదెండ్ల, కె.వి.ఎస్.కె.ఎస్. పాపారావు, శ్రీకాకుళం సుబ్బారావు, తంగిరాల ప్రభాకరరావు, మడకా రామ్మోహన్ రావు, బి.రామ్మోహన్ రావు, డి.మనోహర్, ఎస్. సుబ్రహ్మణ్యం, డి.స్వర్ణరాజ్, బారిక శ్రీనివాసులు, డా.చిల్లర భవానీదేవి, వి.జయంతి, టి. కోటీశ్వరరావు, ఎం.సత్యనారాయణ, ఎం. ఏడుకొండలు, పి.దేవప్రియం, ఆర్. సీతారామారావు, సి. విశ్వనాథ్, నండూరి నాగసరస్వతి. సి.కళ్యాణలక్ష్మి, చిట్టూరి కృష్ణకుమారి, హెచ్. హేమవతి, ఆలూరి కుమారస్వామి, వేమూరి వెంకటకృష్ణశాస్త్రి, పి.జె.ఎస్.వెంకటేశ్వరరావు, పద్మారావు, ఎస్.ఎం.ఎల్. నాగమాంబ, నండూరి నాగసరస్వతి, సి.కళ్యాణలక్ష్మి, ధనలక్ష్మి, వైఢూరి, బి.నిర్మల. ఎస్.కనకదుర్గాదేవి రాజ్ కుమార్ తదితరులు తమ కళా పాటావాన్ని ప్రదర్శిస్తూ తమ నైపుణ్యాన్ని మెరుగు పరచుకుంటున్నారు. వీరిలో కొందరు ఇటీవల పదవీ విరమణ చేసిన వారున్నారు. సచివాలయ ఉద్యోగినులు కూడా నాటకాలలో పాత్రలు ధరించడానికి ముందుకు వచ్చారు. ఎస్.ఎం.ఎల్. నాగమాంబ, నండూరి నాగసరస్వతి, సి.కళ్యాణలక్ష్మి, ధనలక్ష్మి, వైఢూరి, బి.నిర్మల. ఎస్.కనకదుర్గాదేవి మున్నగు వారు నాటకాలు ప్రదర్శించారు. ఊటుకూరి సూర్యప్రకాశ రావు దర్శకత్వంలో ఎస్.ఎం.ఎల్. నాగమాంబ, నండూరి నాగసరస్వతి, బి.నిర్మల మున్నగు వారు తనికెళ్ల భరణి నటించిన గోగ్రహణం నాటిక ప్రదర్శించారు. నాటికలో నటించడం మాట అటుంచి, అప్పటి దాకా నాటకం చూడని సి.కళ్యాణ లక్ష్మి తొలిసారి రంగస్ధలం మీద నటిస్తూ, అఖిల భారత సివిల్ సర్సీసెస్ పోటీలతో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. చిలుకూరి వెంకటప్పయ్య బాటలో డా. చిల్లర భవానీదేవి, కె.వి.ఎస్.కె.ఎస్. పాపారావు నాటక రచన చేపట్టారు.
రామనరసింహం సరసి పేరుతో కార్టూన్ల సంపుటి విడుదల చేసారు.
కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు రచించిన మృత్యుకౌగిలి నాటకాన్ని అనుబంధ సంస్ద ద్వారా కె.జె.సదానందరావు దర్శకత్వంలో ఎం. సత్యనారాయణ, కక్కెర్ల కొమరయ్య, లంక లక్ష్మీనారాయణ, సుకమార్ బాబు, కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు, శ్యామ్ నాదెండ్ల, రత్నకుమారి, శ్రీ వల్లి మున్నగు వారు గుంటూరు, హైదరాబాదులో మూడు పర్యాయాలు (బి.హెచ్.ఇ.ఎల్.పరిషత్, నందినాటకోత్సవ పోటీలలో ప్రదర్శనలతో కలిపి), ఏలూరు. విజయవాడ నగరాలలో ప్రదర్శించారు. దూరదర్శన్ ప్రసారం చేసిన నాటకంలో బి.నారాయణ, లంకలక్ష్మీనారాయణ, శిఖరం సాంబశివరావు, ఊటుకూరి సూర్యప్రకాశరావు, రత్నకుమారి, శ్రీవిద్య మున్నగు వారు నటించారు.
మనవి
వీరే కాక, సంస్ద కార్యక్రమాలలో ప్రతక్ష్యంగా, పరోక్షంగా పాల్గొనిన వారున్నారు. స్ధలాభావం వలన కానీ, ఆ సమయంలో స్ఫురణకు రాకపోవడం వలన కాని కొందరిని ప్రస్తావించక పోయి ఉండ వచ్చు. అంతే కాని వారిని వారి సేవలను విస్మరించడం కాదు. ఇది సహజమైన పరిణామంగా బావించాలి. తెరముందు వారు స్మృతి ఫథంలో మెదలినట్లు తెరవెనుక వారి సేవలు అజ్ఞాతంగా ఉండి పోతాయి. ఉదాహరణకు వెంకన్న బాబు, పద్మనాభ స్వామి, తంగిరాల ప్రభాకారరావు తెరవెనుకగా ఎంతో సాయం అదించారు. ఆర్. అలెగ్జాండర్, ఎం. సత్యనారాయణ మంచి సాంకేతిక పరిచాలకులు. ముఖ్యంగా హిరణ్యగర్భ నాటకానికి ఆర్. అలెగ్జాండర్ పాత్రలవేషధారణకు, రంగాలంకరణకు రూపకల్పన చేసారు. ఆ నాటక ప్రత్యేక ప్రస్తావన దేనికంటే ఆ నాటక కథా కాలానికి నిర్ధుష్టత లేదు. అది పౌరాణిక, చారిత్రక, సమకాలీన అని నిర్వచించ లేనిది. నంది నాటకోత్సవ క్షేత్రీయ స్ధాయి పోటీలలో వరంగల్ లో ప్రదర్శించి నప్పుడు ఆ రూపకల్పన రసజ్ఞుల మన్నన పొందింది. పులిశివ మల్లిఖార్జునరావు తెర ముందే కాదు తెరవెనుకా కూడా అంతగా శ్రమించేవారు. నాటకం మీద వారికి చాలా మక్కువ.

ఉపసంహారం

[మార్చు]


కాగా, నేటితరం శీర్షిక క్రింద పేర్కొన్న విశేషాలు సంఘం నిద్రావస్థకు చేరుకునే ముందు మెరిసిన మెరుపులు మాత్రమే. ప్రస్తుతం సంఘం గత ఘన కీర్తి మీదే మనుగడ సాగిస్తోంది. కార్యక్రమాలు క్రమక్రమంగా తగ్గాయి. ప్రస్తుతం సంఘం అచేతనంగా ఉంది. నిష్ఠూరంగా తోచినా ఇది నిజం. ఇటీవల కాలంలో వెలసిన సుదూర ప్రాంతాలలో కోలనీలు, వినోదం టివి ద్వారా ఇంట్లోనే లభ్యమవడం వంటి కారణాలతో పాటు ఆసక్తి ఉన్న వారు పదవీ విరమణ చేయడం కార్యక్రమాలలో తగ్గుదల దోహదపడే కారణాలైనా, యువకులలో కావలిసిన మేరకు లలిత కళలలో ఆసక్తి తగ్గడం సంఘ కార్యకలాపాలకు అవరోధం ఏర్పడడానికి ప్రధాన కారణం. సంఘం పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని ఆశిద్దాం. ప్రస్తుతం సంఘ అధ్యక్షులు శ్రీ లంక లక్ష్మీనారాయణ.

సంఘం ప్రత్యేకంగా రూపొందించిన నాటకాలు

[మార్చు]
  1. అలెగ్జాండర్ (రచయిత దర్శకుల వివరాలు తెలియదు)
  2. చంఘీజ్ ఖాన్ (రచన:పరుచూరి వెంకటేశ్వరరావు)
  3. అల్లూరి సీతారామారాజు (రచన:పడాల, దర్శకత్వం: ఇ.ఎల్.నరసింహారావు, ముఖ్య భూమికలు: కె.హనుమంతరావు, పులిశివమల్లిఖార్జునరావు, మట్టిపల్లి గోపాలకృష్ణమూర్తి)

నీలిదీపాలు
దర్శకత్వం : కె.ఎస్.ఆర్. ప్రసాద్, పులి శివ మల్లిఖార్జున రావు
ముఖ్య భూమికలు  : కె.హనుమంతరావు, మట్టి పల్లి గోపాలకఋష్ణమూర్తి మున్నగువారు.
పల్నాటి యుధ్దం
రచన : చిలుకూరి వెంకటప్పయ్య
దర్శకత్వం : కె.ఎస్.ఆర్. ప్రసాద్, అద్దేపల్లి సుదర్శనం
ముఖ్య భూమికలు : యం. వెంకట్రామయ్య, పులి శివ మల్లిఖార్జున రావు, శ్రీకాంత శర్మ, ఎ.బదరీ నారాయణ స్వామి, శిఖరం సాంబ శివరావు, అర్జున రావు, పాలేటి చంద్రశేఖర్, కె.జె. సదానందరావు, మల్లిఖార్జునుడు, శివపార్వతి మున్నగువారు
(ఈ నాటకం రాష్ట్రంలోనే కాక దేశమంతటా దాదాపు 45 పర్యాయాలు ప్రదర్శంచబడింది. హైదరాబాదు దూరదర్శన్ కేంద్రం ద్వారా ప్రసారమైంది)
సంఘం మారాలి
రచన : రామకృష్ణయ్య ఐ.ఎ.ఎస్. (రిటైర్డ్)
దర్శకత్వం : ఊటుకూరి సూర్యప్రకాశ రావు
ముఖ్య భూమికలు : శిఖరం సాంబ శివరావు, మడకా రామ్మోహన్ రావు, సుమ మున్నగు వారు
అప్పాజీ
రచన : చిలుకూరి వెంకటప్పయ్య
దర్శకత్వం : ఊటుకూరి సూర్యప్రకాశ రావు
ముఖ్య భూమికలు బి.నారాయణ, పింగళి సాంబశివరావు, పులిశివ మల్లిఖార్జున రావు, మడకా రామ్మోహన్ రావు, మున్నగు వారు
బొబ్బిలి యుధ్దం
రచన : డా. చిల్లర భవానీ దేవి
దర్శకత్వం  : కె.ఎస్.ఆర్.ప్రసాద్, శిఖరంసాంబశివరావు
ముఖ్యభూమికలు : రత్నకుమార్, ఎ.బదరీ నారాయణస్వామి, వెంకటేశ్వర్లు, పాలేటి చంద్రశేఖర్, శ్రీకాకుళం సుబ్బారావు, కె.జె.సదానందరావు, మడకా రామ్మోహన్ రావు, లంక లక్ష్మీనారాయణ, పద్రప్రియమున్నగు వారు.
ఖడ్గతిక్కన
రచన : కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు
దర్శకత్వం: శిఖరంసాంబశివరావు
ముఖ్యభూమికలు: టి.కోటేశ్వరరావు, ఎ.బదరీ నారాయణస్వామి, పాలేటి చంద్రశేఖర్, శ్రీకాకుళం సుబ్బారావు, లంక లక్ష్మీనారాయణ, ఎం. సత్యనారాయణ, డి.స్వర్ణరాజ్, శ్రీనివాసాచారి, నిర్మల, పద్రప్రియ మున్నగు వారు.
హిరణ్యగర్భ
రచన : డి.విజయభాస్కర్
సాంకేతిక పరిచాలన  : ఆర్. అలెగ్జాండర్
దర్శకత్వం: శిఖరంసాంబశివరావు
ముఖ్యభూమికలు: ఎ.బదరీ నారాయణస్వామి, శ్రీకాకుళం సుబ్బారావు, లంక లక్ష్మీనారాయణ, ఎం. సత్యనారాయణ, డి.స్వర్ణరాజ్, కక్కెర్ల కొమరయ్య, నిర్మల, పద్రప్రియ మున్నగు వారు

రాణీరుద్రమదేవి
రచన : కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు
సంగీతం: సి.కృష్ణకుమారి, బొబ్బిలి భాస్కర్ రెడ్డి, ఎస్.శ్రీనివాసులు
సాంకేతిక పరిచాలన  : ఆర్. అలెగ్జాండర్
దర్శకత్వం : కె.జె, సదానందరావు, అర్.కె.హరినాధ్ బాబు
ముఖ్యభూమికలు: సి.కళ్యాణలక్ష్మి, పాలేటి చంద్రశేఖర్, ఎం. ఏడుకొండలు, శ్రీకాకుళం సుబ్బారావు, శ్యామ్ నాదెండ్ల, లంక లక్ష్మీనారాయణ, సీతారామారావు, సి.విశ్వనాధ్, బి.శ్రీనివాసులు, బి.రామ్మోహన్ రావు మున్నగు వారు
( ఈ నాటకం హైదరాబాదు, వరంగల్, విజయవాడ నగరాలలో ప్రదర్శించబడింది. దూరదర్శన్ కేంద్రం ద్వారా ప్రసారమైంది)
బ్రహ్మనాయుడు
రచన : చిలుకూరి వెంకటప్పయ్య
దర్శకత్వం : ఎ.బదరీనారాయణ స్వామి
ముఖ్యభూమికలు: ఎ.బదరీనారాయణ స్వామి, పాలేటి చంద్రశేఖర్, కె.వి. శేషు, ఎం. ఏడుకొండలు, శ్రీకాకుళం సుబ్బారావు, శ్యామ్ నాదెండ్ల, లంక లక్ష్మీనారాయణ మున్నగు వారు
(ఈ నాటకం దూరదర్శన్ కేంద్రం ద్వారా ప్రసారమైంది)

నాటికలు

[మార్చు]

నేను సైతం
రచన : మారెళ్ళ
దర్శకత్వం : కె.ఎస్.ఆర్. ప్రసాద్
ముఖ్యభూమికలు: ఆర్. అలెగ్జాండర్, పోలిశెట్టి రామ్మోహన్ రావు, గొల్లపూడి రామ్మోహన్ రావు, బి.నాగరాజ, తెలంగాణా శకుంతల
తమసోమాజ్యోతిర్గమయ
రచన : కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు
దర్శకత్వం: ఊటుకూరి సూర్యప్రకాశరావు, కె.జె, సదానందరావు, అర్.కె.హరినాధ్ బాబు
ముఖ్యభూమికలు: ఆర్. అలెగ్జాండర్, ఎం. సాంబమూర్తి, కె.వి.శేషు, కాంతారావు, పద్మప్రియ భల్లమూడి, వి.పి.కె.బసవయ్య, ఎం. సత్యనారాయణ, పి.దేవప్రియం, సి.కళ్యాణలక్ష్మి, ఎం. ఏడుకొండలు, శ్రీకాకుళం సుబ్బారావు, కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు, శ్యామ్ నాదెండ్ల, లంక లక్ష్మీనారాయణ, బి.రామ్మోహన్ రావు, మున్నగు వారు
ఈ నాటిక హైదరాబాదు, న్యూఢిల్లీ, రాజమండ్రి నగరాలలో ప్రదర్శించబడింది. పాట్నాలోజరిగిన 2002 అఖిల భారత సివిల్ సర్వీసెస్ పోటీలలో ఉత్తమప్రదర్శన, ఉత్తమ రచన బహుమతులతో పాటు సి.కళ్యాణలక్ష్మి (ఉత్తమనటి, శ్రీకాకుళం సుబ్బారావు, ఎం. సత్యనారాయణ (ఉత్తమ నటులు) బహుమతులు గెలుపొందారు.

సంఘం కార్యక్రమాల ఛాయాచిత్రాలు

[మార్చు]
ఖడ్గతిక్కన నాటక ప్రదర్శనానంతరం పాత్రపరితచయం
రవీంద్రభారతిలో శ్రీకృష్ణరాయబారము నాటక ప్రదర్శన సందర్భంగా నాటి మంత్రివర్యులు గౌ. కె.ఇ.కృష్ణమూర్తి, బి.వి.మోహన్ రెడ్డి లతో భీష్మ పాత్రధారి
ముంబాయిలో సంఘం ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారము నాటక ప్రదర్శనలో సన్నివేశం
ఇటీవల సంఘం ప్రదర్శించిన హాస్య నాటికలో సన్నివేశం
సిలికినాంధ్ర నిర్వహించిన అన్నమయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ గాయనీ మణులు
అంతర్విభాగ నాటిక తమసోమాజ్యోతిర్గమయ నాటికలో దృశ్యం


అంతర్విభాగ నాటిక పోటీల బహుమతి ప్రదానం
అంతర్విభాగ నాటిక పోటీల బహుమతి ప్రదానం
సంఘం నిర్వహించిన రాష్ట్రస్ధాయి నాటిక పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?