For faster navigation, this Iframe is preloading the Wikiwand page for లాస్ ఏంజలెస్.

లాస్ ఏంజలెస్

వికీపీడియా నుండి

ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి.
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. ఇటీవలి ఘటనలను, తాజాగా అందిన సమాచారాన్నీ చేర్చి ఈ వ్యాసాన్ని తాజాకరించండి.
లాస్ ఏంజలెస్ పాత నగరం(డౌన్‌టౌన్ )

లాస్ ఏంజలెస్ (లాస్ ఏంజిల్స్) అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల లో న్యూయార్క్ తరువాత అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరం. పడమటి తీర నగరాలలో ఇది అతి పెద్దది. ఎల్.ఎ(L.A).సంక్షిప్త నామము కలిగిన ఈ పట్టణం ప్రపంచ నరరాలలో ఆల్ఫా నగరంగా గుర్తించబడింది. ఈ నగరం 469.1 చదరపు మైళ్ళ విస్తీర్ణము కల్గి 2006 నాటి అంచనా ప్రకారము 38,49,368 జనసంఖ్యను కల్గి ఉంది. కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతంలో పసిఫిక్‌ మహాసముదపు తీరాన ఉన్న ఈ నగరం మధ్యధరా ప్రాంతపు శీతోష్ణస్థితిని కల్గి ఉంటుంది. గ్రేటర్ లాస్ ఏంజలెస్ అనబడే నగరపాలిత ప్రాంతమైన లాస్ ఏంజలెస్, లాంగ్ బీచ్, శాంటా అన్నా ప్రాంతములో ఒక కోటీ ముప్పది లక్షల మంది నివాసము ఉంటారు. ప్రపంచము నలుమూలల నుండి వచ్చి చేరిన ఇక్కడి ప్రజలు సుమారు నూరు విభిన్న భాషల వరకు మాట్లాడుతుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల లోనే పెద్ద జిల్లా(కౌంటీ)అయిన లాస్ ఏంజలెస్ జిల్లాకు ఈ నగరం కేంద్రము. ఏంజలాన్స్ అనబడే పూర్వీకులు ఇక్కడ నివసించినట్లు గుర్తించారు. ఈ నగరానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యమున్న ముద్దుపేరు సిటీ ఆఫ్ ఏంజల్స్(దేవతల నగరం).

నగర చరిత్ర

[మార్చు]

ఈ నగరం స్పానిష్ గవర్నర్ చే 1781లో కనుగొనబడింది. 1821లో ఇది మెక్సికోలో ఒక భాగమైంది. అమెరికా మెక్సికన్ యుద్ధం ముగిసిన తరువాత చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇది 1848లో అమెరికాలో ఒక భాగంగా మారింది. కాలిఫోర్నియా రాష్ట్ర స్థాయిని సంపాదించడానికి ఐదు నెలల ముందు 1850లో దీనిని మునిసిపాలిటీగా చేసారు.

సంస్కృతికి, వ్యాపారానికి, సాంకేతిక నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రపంచ నగరాలలో లాస్ ఏంజలెస్ కూడా ఒకటి. వ్యాపార, సాంస్కృతిక రంగాలలో ప్రముఖులైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలువురికి ఇది నివాస స్థలము. ఇక్కడ రూపొందించబడే చలనచిత్రాలు, టెలివిజన్(దూరదర్శన్), మూజిక్ ఆల్బములకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది.

లాస్ ఏంజలెస్ లో మొట్టమొదటగా టాంగ్వా, చుమాష్, నేటివ్ అమెరికన్ ల జాతులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ స్థిరపడ్డాయి. 1542లో జాయో కాబ్రిల్హో నాయకత్వములో స్పెయిన్ దేశపు దేవుని నగరంగా దీనిని పేర్కొన్నాడు. 227 సంవత్సరముల తరువాత 1769 ఆగస్టు 2న స్పర్ డీ పోర్టోలాతో వచ్చిన ఫ్రాన్సికన్ మిషనరీకి చెందిన జ్యాన్ క్రెస్పీ ప్రస్తుతపు లాస్ ఏంజలెస్ ప్రాంతానికి వచ్చి చేరాడు. జ్యాన్ క్రెస్పీదీనిని స్వయంపాలిత ప్రాంతంగా అభివృద్ధి చేసాడు. 1771లో వైటియర్ నేరోస్(ప్రస్తుతం శాన్ గాబ్రియల్ అని పిలుస్తారు) సమీపములో శాన్ గాబ్రియల్ ఆర్కేంజిల్ పేరుతో మిషనరీ భవనాన్ని నిర్మించాడు. 1781లో కాలిఫోర్నియా గవర్నర్ కోరికతో నూతన స్పెయిన్ వైశ్రాయి దీనిని అభివృద్ధి చేశాడు. 44 మంది సభ్యులు కలిగిన బృందం ఈ అభివృద్ధి పనిలో పాల్గొన్నది. వీరిలో ఎక్కువ శాతము ఆఫ్రికన్ జాతీయులు, స్పెయిన్, ఫిలిప్పీన్స్, స్థానిక అమెరికన్లు ఉన్నారు. కొన్ని దశాభ్దాల వరకు పశువులపెంపకం, పళ్లతోటల పట్టణంగా ఈప్రాంతం కొనసాగింది.

ప్రస్తుతము లాస్ ఏంజలెస్ పురాతన భాగమైన ఒల్వెరా వీధిలో స్థానిక అమెరికన్ పూర్వీక సంప్రదాయక నివాసాలైన ప్యూబ్లొ నిర్మాణాలు పురాతనత్వానికి గుర్తుగా నిలిచాయి. 1821లో స్పానిష్ సామ్రాజ్యము నుండి స్వాతంత్ర్యము సంపాదించి నూతన స్పెయిన్ ఆవిర్భవించిన తదుపరి, ప్యూబ్లొ మెక్సికోలో భాగంగా కొనసాగింది. మెక్సికన్లకు అమెరికన్లకు మధ్య జరిగిన వరస పోరాటాల అనంతరం 1847, 1848లలో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా మెక్సికన్ల నుండి స్వాధీనపరచుకున్న భూభాగాన్ని కాలిఫోర్నియాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల పాలనలోకి చేర్చడంతో ఈ నగరం కూడా అమెరికాలో ఒక భాగమైంది.

నగరాభివృద్ధి

[మార్చు]
హాలీవుడ్ కొండలపై నుండి చూస్తున్నప్పుడు పొగమంచుతో కప్పుకుపోయి కనిపిస్తున్న లాస్ ఏంజలెస్ డౌన్ టౌన్ మరియూ గ్రిఫిత్ అబ్సర్వేటరీ

1876లో దక్షిణ పసిఫిక్(సదరన్ పసిఫిక్) రైలు మార్గపు పనులు పూర్తి చేయడముతో లాస్ ఏంజలెస్ నగర వాసులకు రైలు మార్గము సుగమమైంది. 1892లో ఈ నగరంలో చమురు నిల్వలు కనుగొన్నారు. 1923వ సంవత్సరానికి ప్రపంచ చమురు వాడకంలో నాలుగవ భాగాన్ని సరఫరా చేయగలిగిన సామర్ధ్యాన్ని లాస్ ఏంజలెస్ చమురు నిల్వలు సాధించాయి. 1900కి 100,000 సంఖ్యకు చేరిన జనాభా కారణంగా నగరంలో నీటి ఎద్దడి సమస్య ప్రారంభమైంది. విలియ మల్హోలాన్డ్ పర్యవేక్షణలో లాస్ ఏంజలెస్ అక్విడక్ట్ పూర్తి కావడంతో నగరం అభివృద్ధి పథం వైపు అడుగులు వేయడము ప్రారంభించింది. 1920లో చలన చిత్ర నిర్మాణ కార్యక్రమాలు, విమాన నిర్మాణ పరిశ్రమలు నగరానికి జన ప్రవాహాన్ని తీసుకొని వచ్చాయి. 1932కి జనాభా పది లక్షలకు చేరింది. ఈ సమయంలోనే యుద్ధవాతావరణం నుండి తప్పించుకొని వచ్చి చేరే ఐరోపా జనాభా కూడా నగరంలో విలీనము కాసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామంది జపానీస్-అమెరికన్లను నిర్బంధ నివాసాలకు తరలించినప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధం లాస్ ఏంజలెస్ నగరానికి సమృద్ధిని, అభివృద్ధిని తీసుకు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నగరపురాభివృద్ధి మరింత వేగవంతమై శాన్ ఫెర్నాండో వెల్లీ వరకు నగరం విస్తరించేలా చేసింది.

నగర సంస్కృతి

[మార్చు]

అంతర్జాతీయ విఫణిలో గిరాకీ కలిగిన పలు ఇంగ్లీష్ చలన చిత్రాలు ఇక్కడ నిర్మిస్తున్న కారణం వలన లాస్ ఏంజలెస్ నవనాగరిక సంస్కృతికి పేరుపొందినది.చిత్ర ప్రరిశ్రమలో పనిచేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడిన రచయితలు, సంగీతకారులు ఇతర అనేక సాంకేతిక నిపుణులు నివసిస్తున్న కారణంగా వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి పధంలో ఉండటం వలన సంపన్నులు జీవన విధానానికి కావలసిన విలాసాలకు నగరం అనేక వినోదాలకు వలాసాలకు నిలయంగా ఉంది. నగరం సరిహద్దు లోపల కాసినోలు(జూద గృహాలు)నిషిద్ధం కనుక సరిహద్దు దాటి నైట్ క్లబ్బుల నిర్మాణం జరిగింది.సన్‌స్ట్రిప్ అనబడే ఆకర్షణీయమైన విశేష ప్రాచుర్యం పొందిన నైట్ క్లబ్బులు నగరం వెలుపలి భాగంలో అభివృద్ధి చెందాయి. ఒక సమయంలో నగరంలో మధుపానం నిషేధించడం దీనికి ఒక కారణం.

లాస్ ఏంజలెస్ అనేక దేశాలకు చెందిన వారు, మతాలకు చెందినవారు నివసిస్తున్నారు. అధిక సంఖ్యాకులు హిస్పానిక్స్ రోమన్‌‌కాథలిక్ మతావలంబీకులు. రోమన్‌‌కాథలిక్ ఆర్చ్బిషప్ ఆఫ్ ది లాస్ ఏంజలెస్ పర్యవేక్షణలో ఆర్చ్డియోసెస్(చర్చ్)లు నిర్వహిస్తుంటారు. లాస్ ఏంజలెస్ ఉత్తర సరిహద్దులో రోజర్ మహోనీ పర్యవేక్షణలో కాద్డ్రెల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఏంజలెస్ 2002 లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది.రాబోయే కాలంలో రోమన్‌‌కాథలిక్ లకు,లాటిన్ అమెరికన్స్ ని ఆకర్షణగా ఉంటుందని అంచనా. లాస్ ఏంజలెస్‌లో అనేక చర్చ్‌లు ఉన్నాయి.మార్మన్ టెంపుల్స్ అని పిలబడే లాస్ ఏంజలెస్ కలిఫోర్నియా టెంపుల్ ఆకారంలో రెండవస్థానంలో ఉంది. దీనిని ది చర్చ్ ఆఫ్ జీసెస్‌క్రైస్ట్ ఆఫ్ లేటర్ సెయిన్ట్స్ నిర్వహిస్తున్నారు.వెస్ట్ వుడ్ డిస్ట్రిక్ లో1956 లో సమర్పించబడిన శాంటా మోనికా బుల్‌వర్డ్ మారమన్ టెంపుల్స్‌లో మొదటిది. కట్టిన సమయంలో ప్రపంచంలోఇది అతి పెద్ద చర్చ్.ఈ చర్చ్ ప్రాంగణంలో లాస్ ఏంజలెస్ రీజనల్ ఫేమిలీ హిస్టరీ సెంటర్, విజిటర్స్ సెంటర్ ప్రజల సందర్శనార్ధం తెరచారు ఇదికాక లాస్ ఏంజలెస్ మిషన్ ప్రధాన కార్యాలయం ఈ ప్రాంగణంలోనే ఉంది.
లాస్ ఏంజలెస్ లో 6,21,000 యూదులు నివసిస్తున్నారు.వీరిలో 4,90,000 మంది నగరంలోనూ మిగలిన వారు నగర సరిహద్దు ప్రాంతంలోను నివసిస్తున్నారు.అధిక సంఖ్యాకులు శాన్ ఫెర్నాడో,,పడమటి లాస్ ఏంజలెస్ ప్రాంతంలో నివాసమున్నారు. అధిక సంక్యలో ఆర్ధడాక్స్ యూదులు పడమటి లాస్ ఏంజలెస్ లోని ఫెయిర్ ఫాక్స్, పికో బుల్‌‌వర్డ్స్ల్ల్లో నివసిస్తున్నారు.1923 న్నిర్మించిన లాస్ ఏంజలెస్ తూర్పు ప్రాంతంలోని స్య్నాగోగ్యూస్‌‌కు నివాసంగా ఉంటుంది.ఈ ప్రాంతం ప్రస్తుతం మతమార్పిడి పొందిన ముస్లిమ్ సమూహాలకు కేంద్రంగా ఉంది.ఒక వర్గం యూదుల పవిత్ర స్థలమైన కబ్బాలహ్ సెంటర్ లాస్ ఏంజలెస్‌నే ఉంది.
వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న కారణంగా వివిధ మతావలంబీకులకు చెందిన దేవాలయాలు ఇక్కడ నిర్మితమై ఉన్నాయి. ఇస్లామ్, సూఫీయిజం, హిందూఇజం, సిక్కిజమ్,బహై, జోరోయాస్ట్రియనిజమ్,ఆర్ధడాక్స్ఇంకా ఇతరులు.లాస్ ఏంజలెస్ ఆషియా నుండి వచ్చిన అనేక విభాగాలకు బుద్ధిస్టులకు నిలయం.ప్రస్థితం లాస్ ఏంజలెస్ అమెరికాలోనే అధిక సంఖ్యలో బుద్ధిస్టులు నివసిస్తున్న నగరంగా పరిగణించబడుతుంది. లాస్ ఏంజలెసస్‌లో 300 కంటే అధిక సంఖ్యలో బుద్ధ దేవాలయాలు ఉన్నాయి.
1900 నుండి అనేక హిందూ మతగురువులకు స్వామీజీలకు లాస్ ఏంజలెస్ గమ్యస్థానం. లాస్ ఏంజలెస్ నగరానికి 1920 లో ప్రమహంస యోగాందరాక ఒక ఉదాహరణ.సెల్ఫ్ రియలైజేషన్ ప్రధాన కార్యాలయం హాలీవుడ్‌‌లోను ప్రైవేట్ పార్క్ పసిఫిక్ పాలిసాడెస్‌లోను ఉంది. 1950 లో మహర్షి మహేష్ యోగి ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ ఉద్యమాన్ని ఇక్కడ స్థాపించారు.

ఆర్థిక ప్రాముఖ్యం

[మార్చు]

లాస్ ఏంజలెస్‌కు అంతర్జాతీయ వాణిజ్యం,మీడియా(దూరదర్శన్, చలన చిత్రాలు,మ్యూజిక్ ఆల్బమ్స్ రికార్డింగ్,ఎయిరో స్పేస్, పెట్రోలియం, ఫేషన్, దుస్తులు, పర్యాటకం ద్వారా ఆదాయాం లభిస్తుంది.అంతర్జాతీయ యాత్రీకులను ఇక్కడి సినీ పరిశ్రమ,దిస్నీ వరల్డ్,సమీపంలోని లాస్ వెగాస్ లోని కాసినోలు ఆకర్షిస్తుంటాయి.వస్తు తయారీకి లాస్ ఏంజలెస్ నగరం ప్రఖ్యాతి చెందినది.జంట రేవులు కలిగిన లాస్ ఏంజలెస్ సముద్రతీరం వాణిజ్యానికి అత్యంత అనుకూలమైంది.ఇది అత్యంత చురుకుగా పనిచేసే రేవులలో ఒకటిగా ప్రపంచలోనూ,పసిఫిక్ తీరంలోనూ గుర్తింపు పొందింది.ఇవి కాక చట్టము,రవాణా,ఆర్ధిక సంస్థలు, ఆరోగ్యము,మందులు, సమాచార రంగం కూడా నగరానికి ఆదాయం కలిగించే వనరులలో ప్రధాన వనరులే.
1990 వరకు పలు ఆర్థిక సంస్థలకు లాస్ ఏంజలెస్ కేంద్రస్థానం. అమెరికాలోని వాహన తయారీ సంస్థలకు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.ప్రపంచ వ్యాతంగా ఉన్న వాహన తయారీ దారుల డిజైన్ ‍రూపకల్పనచేసే సాంకేతిక కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి.ఎయిరో స్పేస్ ఒప్పందదారు(కాంట్రాక్టర్)నార్త్‌రోప్ గ్రమ్మన్, ఎనర్జీ సంస్థ ఆక్సిడెంటల్ పెట్రోలియం, ఆరోగ్యసంబంధిత వస్తు తయారీసంస్థ హెల్త్ నెట్,ఇంటి నిర్మాణ సంస్థ కెబి హోమ్ లాంటి ప్రముఖ తయారీ సంస్థతో కలిపి ఫార్చ్యూన్ 500 పేరుతో వ్యవహరించే సంస్థలను లాస్ ఏంజలెస్ నగరం కలిగి ఉంది.
పన్నుల భారంనుండి తప్పించుకోవడానికి అనేక సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలు నగర సరిహద్దు ప్రాంతంలో ఉండేలా చూసుకుంటారు. సంస్థలు నగర సౌకర్యాలను వాడుకుంటూ,పన్నుల భారం తగ్గించుకోవడానికే ఈ ఏర్పాటు.లాస్ ఏంజలెస్ నగరంలో పన్నులు సంస్థల ఆదాయాన్ననుసరించి విధిస్తారు. సరిహద్దులు దాటి స్వల్పంగా మాత్ర్మే పన్నులు విధించడం దీనికి కారణం.లాస్ ఏంజలెస్ కంట్రీకి చెందిన ఇతరనగరాలలో కొన్ని సంస్థలు తమ కార్యాలయాలు నెలకొల్పాయి. ఉదాహరణగా అల్బామాలో షకీజా పీజా ,బివర్లీ హిల్స్‌లో ఉన్న అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ , సిటీ నేషనల్ బ్యాంక్, హిల్టన్ హోటల్స్, బర్బేంక్‌లో ఉన్నడి ఐ సి ఎంటర్టైన్ మెంట్ ,ద వాల్ట్ డిస్నీ కంపనీ ,, వార్నర్ బ్రదర్స్ ,కలబాసాస్ ఉన్న కంట్రీ వైడ్ ఫైనాన్షియల్, టి హెచ్ క్యూ,కాంప్టన్‌లో ఉన్న బెల్కిన్,కల్వర్ సిటీలో ఉన్న సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్‌మెంట్, ఇ ఐ సెగుండో(El Segundo)కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్, డిరెక్ టివి, మట్టెల్(Mattel), అనోకాల్(Unocal Corporation) గ్లెండేల్‌లోఉన్న డ్రీమ్ వర్క్స్ , లాంగ్ బీచ్లోఉన్న సీ లంచ్ ,మరీనా డెల్ రేలో ఉన్న ఐసిఎఎన్‌ఎన్(ICANN), శాంటా క్లారిటాలో ఉన్న కనార్డ్ లైన్ , ప్రిన్సెస్ క్రూసెస్, శాంటా మోనికాలో ఉన్న ఏక్టివిషన్ , రాండ్ ఇందుకు తార్కాణం.

జనాభా

[మార్చు]

2000లో సేకరించిన జనాభా లెక్కలను అనుసరించి నగర జనాభా 36,94,820 గా ఉంది. 7,98,407 కుటుంబాలు ఈ నగరంలో నివసిస్తున్నాయి. ఒక చదరపు మైల్‌కు జన సాంద్రత 7,876.8.
లాస్ ఏంజలెస్ విభిన్న సంస్కృతులకు సంబంధించిన ప్రజలు నివసించే నగరాలలో ఒకటి. గడిచిన దశాబ్ధాలలో ఈ నగరంలో లాటిన్, ఆషియా దేశాల నుండి వచ్చి ఇక్కడ నివాసమేర్పరుచుకున్న దేశాంతర వాసుల సంఖ్య అధికం. వీరిలో 46.9% శ్వేతజాతీయులు, 11.24% ఆఫ్రికన్ అమెరికన్లు,10% ఆసియన్లు, 0.8% అమెరికా సంతతి, 0.16% పసిఫిక్ ద్వీపాల వారు, 25.9 ఇతర దేశస్థులు, 5.2% సంకర జాతీయులు.

42.2% ప్రజలు ఇంగ్లీష్,41.7% స్పానిష్, 2.4 కొరియన్, 2.3 తాగ్‌లాగ్,1.7 ఆర్మేనియన్, 1.3% పర్షియన్, 1.5% భాషలను వారి ప్రధాన భాషలుగా కలిగిఉన్నారు. 1880 వరకు లాస్ ఏంజలెస్ జనాభాలో అల్పసంఖ్యాకులే అధికం.

జనాభా లెక్కలను అనుసరించి 35.5% కుటుంబాలలో 18 సంవత్సరాల వయసుకు లోబడిన పిల్లలను కలిగి ఉన్నారు. 41.9% వివాహితులు.14.5% స్త్రీలు ఒంటరి జీవతం గడుపుతున్న వివాహితులు. 37.4% కుటుంబమంటూ లేనివారు,28.5% అవివాహితులు. 65 పైబడిన వయసులో ఒంటరి తనంలో జీవిస్తున్నవారు 7.4%. ఒక్కొక్క నివాసానికి సరాసరి జనాభా 2.83, ఒక కుటుంబంలో 3.56
26.6% జనాభా 18 సంవత్సరముల లోపలి వయసువారు. 11.1% జనాభా 18 నుండి 24 వయసులో ఉన్న వారు, 34.1% జనాభా 24 నుండి 44 వయసులోఉన్న వారు, 18.6% 45 నుండి 64 వయస్సు వారు, 9.7% జనాభా 65 వయసు వారు. సరాసరి వయస్సు 32. 100 మంది స్త్రీలకు 99.4 మంది పురుషులు, 18 వయసు అంతకు పై బడిన స్త్రీలకు 97.5 మంది పురుషులు.
గృహ ఆదాయం సరాసరి $36,687. కుటుంబ ఆదాయం సరాసరి $39,942. పురుషుల తలసరి ఆదాయం $31.880. స్త్రీల తలసరి ఆదాయం $30,197.తలసరి సరాసరి ఆదాయం 20,671. 18.3% కుటుంబాలు పేదరికానికి దిగువస్థాయిలో ఉన్నారు. 18 సంవత్సరాలకు లోబడినవారు 30.6%, 12.6% 65 వయసు పైబడిన వారు పేదరికానికి దిగువ స్థాయిలో ఉన్నారు.
లాస్ ఏంజలెస్‌లో నివసిస్థున్నారిలో 140 దేశాలనుండి చెందిన ప్రజలు ఉన్నారు. గుర్తింపు పొందిన 224 భాషలు మాట్లాడే ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఆయా దేశ సంసంస్కృతీ, సంప్రదాయాలు కలిగిన ప్రదేశాలైన చైనాటౌన్, ఫిలిప్పినో టౌన్,కొరియా టౌన్, లిటిల్ ఆర్మేనియా, లిటిల్ పర్షియా, లిటిల్ ఎథియోపియా,లిటిల్ ఇండియా, లిటిల్ టోకియో, లిటిల్ టౌన్ వివిధ సంస్కృతుల ప్రజల ఉనికికి నిదర్శనం.

ప్రభుత్వం

[మార్చు]
లాస్ ఏంజలెస్ సిటీ హాల్

లాస్ ఏంజలెస్ నగర ప్రిపాలనా విధానాన్ని మేయర్ కౌన్సిల్ అంటారు. లాస్ ఏంజలెస్ 15 సిటీ కౌన్సిల్స్‌గా విభజించ బడింది.లాస్ ఏంజలెస్ సిటీ సెంటర్ లో నగరపాలిత కార్యాలయ భవనాలు అన్నీ ఒకేచోట ఉంటాయి. వాషింగ్‍టన్ డి సి తరువాత లాస్ ఏంజలెస్ ఆమెరికాలోనే అత్యధికంగా నగరపాలిత కార్యాలయ భవనాలు కలిగిన నగరంగా పేరు పొందింది. న్యాయ సంబధిత వ్యవహారాలు సిటీ అటార్నీ ఆధీనంలో ఉంటాయి,సిటీ పరిమితిలో జరిగే చిన్న చిన్న నేరాలకు సంబంధించిన వ్యవహారాలు సిటీ అటార్నీప్రయవేక్షణలో పరిష్కరిస్తుంటారు.కంట్రీ ఓట్స్ ద్వారా ఎన్నుకొనబడే డిస్ట్రిక్ అటార్నీ ఆద్వరైంలో 78 విభాగాలుగా విభజింపబడిన లాస్ ఏంజలెస్ నగరానికి చెందిన 88 సిటీ వ్యవహారాలూ ఉంటాయి. డిస్ట్రిక్ అటార్నీ మొత్తం లాస్ ఏంజలెస్ కంట్రీలో జరిగే చిన్నచిన్న నేరాలనే కాక చట్టం అమలు చేసే వ్యవహారాలు చూసుకుంటుంటాదు.
లాస్ ఏంజలెస్ రక్షణవ్యవహారాలను లాస్ ఏంజలెస్ పోలిస్ డిపార్ట్‌మెంట్(LAPD)చూసుకుంటుంది.LAPD తో చేరి నాలుగు ప్రత్యేక పోలిస దళాలు రక్షణబాధ్యతలను నిర్వహిస్తుంటారు.సిటీ హాల్,సిటీ పార్క్(నగర ఉద్యానవనాలు),గ్రంథాలయాలు, లాస్ ఏంజలెస్ జూ, కాన్వెన్షన్ సెంటర్ ప్రాంతాలు ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఆధీనంలో ఉంటాయి.హార్బర్ ప్రాంతానికి సబంధించిన భూమి, వాయు, జల పరిమితి రక్షణ చట్ట అమలు వ్యవహారాలుది పోర్ట్ పోలిస్ ఆధీనంలో ఉంటాయి. లాస్ ఏంజలెస్ నగరంలోని అన్ని స్కూల్స్ సంబంధిత చట్ట అమలు రక్షణ వ్యవహారాలు ది లాస్ ఏంజలెస్ సిటీ స్కూల్స్ పోలిస్ డిపార్ట్‌మెంట్ అధీనంలో ఉంటాయి.నగరానికి స్వంతమైన ఎయిర్ పోర్ట్ రక్షణ వ్యవహారాలు ది పోర్ట్ పోలిస్ ఆధీనంలో ఉంటాయి.
ఎల్‌ఎపెల్(LAPL),లాస్ ఏంజలెస్ యునైటెడ్ స్కూల్ డిస్ట్రిక్ (LAUSD)లాస్ ఏంజలెస్ కంట్రీలో పెద్ద సంస్థలుగా గుర్తింపు పొందాయి.LAUSD అమెరికాలోనే రెండవ పెద్ద సంస్థగా పేరుపొందింది. మొదటి స్థానంలో న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంటాఫ్ ఎజ్యుకేషన్ ఉంది.నగరానికి కావలసిన నీటి సరఫరాను ది లాస్ ఏంజలెస్ డిపార్ట్‌మెంటాఫ్ వాటర్ అండ్ పవర్ అందిస్తుంది.

విద్య

[మార్చు]

నేరం

[మార్చు]

1990 మధ్య భాగం నుండి లాస్ ఏంజలెస్లో నేరాలు తగ్గుముఖం పట్టడం ఆరంభం అయినది. 2007 లో ఇది అత్యల్పస్థాయికి చేరింది. 1992 లోఅత్యధికంగా 72,667 హింసాత్మక నేరాలు నమోదుకాగా వీటిలో 1,062 హోమీసైడ్స్ అనబడే గృహాంతరంలో జరిగిన హత్యలు. 2,45,129 ఆస్తి వివాదాలు. గృహాంతరంలో జరిగే హత్యలు సౌత్ లాస్ ఏంజలెస్, హార్బర్ ప్రాంతాలు కాగా, డౌన్ టౌన్ దాని పరిసర ప్రాంతాలలో సగభాగం నమోదుకాగా మిగిలిన సగం నగ్రంలోని ఇతర ప్రాంతాలలో నమోదౌతుంది.

లాస్ ఏంజలెస్ ముఠా నేరస్తులకు,నేరాన్ని వృత్తిగా చేస్తున్న వారికి నివాసస్థలము.2001 లోనేషనల్ డ్రగ్ ఇన్టెలిజన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా 1,350 ముఠాలకు చెందిన 1,52,000 వేల నేరస్థులు లాస్ ఏంజలెస్‌లో నివసిస్తున్నట్లు తేలింది.దీనివలన లాస్ ఏంజలెస్ని గేంగ్ కాపిటల్ ఆఫ్ అమెరికా వ్యవహరిస్తున్నారు. కారు చేసింఘ్ కూడా పోర్ట్ కాంప్లెక్స్‌లో పరిపాటే.

నగర భౌగోళిక రూపురేఖలు

[మార్చు]

క్రమమైన ఆకారంలేని 498.3 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన నగరం లాస్ ఏంజలెస్.469.1 చదరపు మైళ్ళ భూప్రదేశాన్ని, 29.2 మైళ్ళ జలప్రదేశాన్ని కలిగిన నగరం. లాస్ ఏంజలెస్ అమెరికాలోనే భూభాగంలో14 వ స్థానంలో ఉంది.నగరం 44 మైళ్ళ పొడవు,29 మఈళ్ళ వెడల్పు విస్తరించి ఉంది.అమెరికాలోనే లాస్ ఏంజలెస్ పర్వతాలతో ఆవరించబడి ఉన్న ఏకైక నగరం.సిస్టర్ ఎల్సీ పీక్ లాస్ ఏంజలెస్‌లో ఎత్తైన ప్రదేశంగా గుర్తించారు.ఇది శాన్ ఫెర్నాండో లోయ ఈశాన్యపు అంచులలో ఉంది.దీని ఎత్తు 5,080 అడుగులు.లాస్ ఏంజలెస్ చెందిన కనోగ పార్క్ డిస్ట్రిక్‌లో ఉన్నలాస్ ఏంజలెస్ రివర్ నగరంలో ఉన్న పెద్ద నది. ఇది వెర్నాన్ మార్గంగా ప్రవహించి పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇది ఎక్కువగా నగరంలో ప్రవహిస్థుంది కనుక ఇరువపులా కాంక్రీట్ నిర్మాణం చేయబడింది. ఇది సంవత్సరంలో కొంతకాలం మాత్రమే ప్రవహిస్తుంటుంది.

క్రీడలు

[మార్చు]

వాతావరణం

[మార్చు]

లాస్ ఏంజలెస్ వాతావరణం సముద్రతీరాలలో ఉండే ప్రత్యేక మైన వాతావరణం.వెచ్చని చలికాలం,చల్లని వేసవి కాలం ఇక్కడి ప్రత్యేకం. సాధారణంగా సముద్రతీరాలలో ఉండే దట్టమైన మబ్బులు అప్పూడప్పుడు కమ్ముకుని ఉండటం వలన సంవత్సరమంతా చల్లని వాతావరణం నెలకొని ఉంటుంది. సరాసరి వేస్వి పగటి పూట ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారెన్ హీట్ రాత్రులలో 82 డిగ్రీల ఫారెన్ హీట్. చలికాలంలో పగటి ఉష్ణోగ్రత 63 డిగ్రీల ఫారెన్ హీట్ రాత్రి వేళలలో 48 డిగ్రీల ఫారెన్ హీట్.ఇక్కడ చలికాంలోనూ,వసంత కాలంలోనూ వర్షాలుకురుస్తూ ఉంటాయి. ఏంజలెస్ వర్ష పాతం 15 అంగుళాలు.జూలై నుండి సెప్టెంబరు వరకు వేడిగా ఉంటుంది. టొర్నాడో హెచ్చరికలు అప్పుడప్పుడు చేస్తుంటారు.ఇవి అపూర్వంగా డౌన్ టౌన్లో రావడం అపూర్వం.సిటీ బేసిన్లో మంచు కురవడం చాలా అపూర్వం. 1932 లో 2 అంగుళాల మంచు కురిసినట్లు నమోదైంది.నగర పరిమితిలో ఉన్న పర్వత శిఖ్రాగ్రాలలో ప్రతి సంవత్సరం మంచుకురుస్తుంటుంది.

నగర వర్ణన

[మార్చు]
హాలీవుడ్ ప్రధాన వీధి

లాస్ ఏంజలెస్ నగరం అనేక చిన్న చిన్న ఊర్లుగా విభజించబడింది.నగరాభివృద్ధిలో సరిహద్దులను ఆనుకొని ఉన్న అనేక ఊర్లు నగరంలో కలిసిపోయాయి.నగరం లోపల వెలుపల ఉన్న ఊర్లు నగరానికి సంబంధించిన ఊర్లుగా గుర్తింపబడుతూ ఉన్నాయి.నగరంలో కలిసిపోయిన,నగర పరిసరాలలో ఉన్నఊర్లు ఈశాన్య దిశలో డౌన్‌టౌన్ ఆగ్నేయంలో హైలాండ్ పార్క్,ఈగల్ పార్క్(ప్రజలు దీనిని దక్షిణ మధ్య భాగంగా వ్యవహరిస్తారు)హార్బర్ ఏరియా,హాలీవుడ్,విల్‌షైర్,వెస్ట్‌సైడ్,ఇవి కాక శాన్‌ఫెర్నాండో,క్రిసెంటా లోయలు.వెస్టాడమ్స్,వాట్స్,వెనిస్ బీచ్,డౌన్ టౌన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్,లాస్ ఫెలిజ్,సిల్వర్ లేక్,హాలివుడ్,హన్ కాక్ పార్క్,కొరియాటౌన్,వెస్ట్ వుడ్, బెల్ ఎయిర్,బెన్‌డిక్ట్ కాన్‌యాన్,హాలీవుడ్ హిల్స్,పసిఫిక్ పాలిసాడెస్, బ్రెంట్ వుడ్ లాస్ ఏంజలెస్‌లో ప్రఖ్యాత పూర్వీక సమాజాల నివాసిత ప్రదేశాలు.

ప్రసిద్ధ ప్రదేశాలు

[మార్చు]

లాస్ ఏంజలెస్ లోని చైనా టౌన్, కొరియా టౌన్,లిటిల్ టోకియో, డ్స్నీ కన్సర్ట్ హాల్, కొడాక్ దియేటర్,గ్రిఫ్త్‌అబ్జర్వేటరీ, గెట్టీ సెంటర్, లాస్ ఏంజలెస్ మెమోరియల్ కొలిసియం, లాస్ ఏంజలెస్ కంట్రీ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్ గ్రౌ మన్స్ చైనీస్ దియేటర్, హాలీవుడ్ సైన్,హాలీవుడ్ బుల్‌వర్డ్, కేపిటల్ రికార్డ్ టవర్, లాస్ ఏంజలెస్ సిటీ హాల్,హాలీవుడ్ బౌల్, వాట్స్ టవర్, స్టాపుల్స్ సెంటర్, డ్రాడ్జెర్ స్టేడియమ్, లా ప్లేసిటా ఒల్వేరా స్ట్రీట్.

వాతావరణ కాలుష్యం

[మార్చు]

లాస్ ఏంజలెస్ వాహనాల రద్దీ కారణంగా వాతావరణంలో కాలుష్యం అధికం ఔతూఉంది. దీనికారణంగా పోర్ట్ కాంప్లెక్స్ వాసులు స్మాగ్(కాలుష్యంతో నిండిన పొగమంచు)బాధ పడుతూ ఉంటారు.లాస్ ఏంజలెస్ ఫెర్నాండో లోయలు,లాస్ ఏంజలెస్ బేసిన్ లో రైల్ ఇంజన్,నౌకా నిర్మాణము,విమానాల తయారీ కర్మాగారాలు ఉన్నందున వాతావరణ కాలుష్యం అధికం కావడానికి కారణం అయ్యాయి. మిగతా నగరాలకంటే వర్షపాతం తక్కువ కనుక కాలుష్యం శాతం పెరుగుతూనే ఉంది.లాస్ ఏంజలెస్ సరాసరి వర్షపాతం 15 అంగుళాలు. కాలుష్యానికి సంబంధించి చర్చలు అధికం కావడంవలన కాలుష్యానికి సంబంధించి క్లీన్ ఎయిర్ ఏక్ట్ తెచ్చింది.సరికొత్తగా కలిఫోర్నియా ప్రభుత్వం తక్కువ కాలుష్యాన్ని కలిగించేవాహనాల్ని ఉపయోగించాలని చట్టం అమలు చేయడం వలన కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించగలిగారు. 1970 లో సంవత్సరంలో 100 సార్లు చేసిన స్మాఘ్ హెచ్చరికలు 1 సారికి తగ్గింది.ఒక వపు అభివృద్ధిని సాధించినా ఇంకొక వైపు అమెరికన్ లంగ్ అసోసియేషన్ లాస్ ఏంజలెస్ స్వల్ప కాల, అధిక కాల కాలుష్యంలో లాస్ ఏంజలెస్ మొదటి స్థానంలో ఉన్నట్లు గుర్తించింది. లాస్ ఏంజలెస్ భూగర్భ జలాలు తగ్గుతూ ప్రభుత్వాన్ని భయపెడుతూనే ఉంది. లాస్ ఏంజలెస్ నగరపాలన వాయు,జల కాలుష్యాలను తగ్గించడానికి చర్యలను తీసుకుంటూనే ఉంది.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

లాస్ ఏంజలెస్లో 27 ఫ్రీవేస్(ఓవర్ బ్రిడ్జ్)ఉన్నాయి. వీటిలో మిలియన్ (10 లక్షలు)ల జనం రోజూ ప్రయాణిస్తుంటారు. అత్యధికంగా కార్లు కలిగిన అంతర్జాతీయ నగరాలలో లాస్ ఏంజలెస్ ఒకటి. 1.8 జనాభాకు 1 కారు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు.

రైల్ వసతి

[మార్చు]

లాస్ ఏంజలెస్ కంట్రీ మెట్రో పాలిటన్ అధారిటీ, ఇతర సంస్థలు విశేష రీతిలో బస్సులు, సబ్‌వే, లైట్ రైల్ రవాణాను నిర్వహిస్తున్నాయి. న్యూయర్క్లో 53% ప్రయాణీకులు, చికాగోలో 30% ప్రయాణీకులు రవాణా ‌సర్వీసులను ఉపయోగించుకుంటుండగా, పోల్చి చూచినప్పుడు లాస్ ఏంజలెస్ 10% ప్రయాణీకులు మాత్రమే మాస్‌రవాణా ‌సర్వీసులను ఉపయోగించు కుంటున్నారు. ఎక్కువ మంది జనాభా లైట్ ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు. ఒక రోజులో 6,50,00,000 ప్రయాణీకులు లైట్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఉంటారు. నగర సబ్‌వే రద్దీలో దేశంలోనే 9వ స్థానంలో ఉంది. లైట్ ట్రైన్‌లో ప్రయాణాలు దేశంలో 3వ స్థానంలో ఉన్నాయి. ఒక రోజులో 2,76,900 సార్లు లైట్ ట్రైన్‌లు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. 0.4% ప్రయాణీకులు లైట్ ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు. ట్రిప్పులను పెంచడం ద్వారా బస్ ప్రయాణీకులు 17,00,000 వరకు వృద్ధి చెందారు. ఎరుపు, వైలెట్ రంగులలో స్బ‌్‌వే లైనులను, అలాగే గోల్డ్(బంగారు), బ్లూ(నీలం)గ్రీన్(ఆకుపచ్చ)రంగులలో లైట్ ట్రైన్‌ లైన్లలోను ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి. ఆరంజ్(కాషాయము)లైన్‌లో బస్ రాపిడ్ ట్రాన్సిస్ట్ బస్సు సర్వీసులను నడుపుతూ ఉంటారు. లైట్ ట్రైన్‌ సర్వీసులలాగా నిరంతరము సేవలందిస్తుంటారు.

గోల్డ్ లైన్ సర్వీసులను డౌన్‌టౌన్ నుండి ఈస్ట్(తూర్పు)లాస్ ఏంజలెస్ వరకు పొడిగించే పనులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి 2009 ఆఖరిలో పూర్తి అవుతుందని అంచనా, రెండవ మార్గం పాసడేనా లోని ఫూట్ హిల్స్ వరకూ పొడిగించే పనులు ఆలోచనలో ఉన్నాయి. డౌన్ టౌన్ నుండి కల్వర్ సిటీ వరకు ఎక్స్పో లైన్ పనులు నిర్మాణదశలో ఉన్నాయి. ఇది 2010లో తన నిర్మాణపు పనులు పూర్తి చేసుకుంటుందని అంచనా. పర్పుల్(వై లెట్)లైన్ ను శాంటా మోనికా సముద్ర తీరం వరకు పొడిగించే పనులు అనుమతి పొంది ఉన్నాయి. ఈ పనులను బుల్‌షైర్ బుల్‌వర్డ్ క్రిందగా శాంటా మోనికా వరకు నెమ్మదిగా సాగిస్తారు. రైల్ మార్గాలను చారిత్రాత్మక యూనియన్ స్టేషను నుండి అమ్‌ట్రాక్, మెట్రో లిన్క్ సంస్థలచే అందించ బడినాయి. సరకు రవాణా యనియన్ పసిఫిక్ రైల్‌రోడ్, బి ఎన్ ఎస్ ఎఫ్(BNSF) రైల్‌వే మార్గాల ద్వారా నిర్వహిస్తారు.

విమాన వసతి

[మార్చు]

లాస్ ఏంజలెస్ నగరంలో ఉన్నన్ని విమానాశ్రయాలు ప్రపంచంలో ఏ నగరంలోనూ లేవు. లాస్ ఏంజలెస్‌లో ఆరు వినాశ్రయాలు ప్రజల సేవల నిమిత్తం నిర్వహిస్తున్నారు.వీటిలో ప్రధానమైనది లాస్ ఏంజలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం(IATA,LAX,ICAO,KLAX).ప్రయాణీకుల రద్దీలోఇది అంతర్జాతీయంగా 5వ స్థానంలోనూ, అమెరికాలో మూడవ స్థానంలోను ఉంది. 2006వలో ఈ విమానాశ్రయంనుండి 6,10,00,000 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. 20,00,000 టన్నుల సరకు రవాణా చేశారు.ఇవి కాకుండా ఈ నగరంలో విమానదళ విమానాశ్రయాలు అనేకం ఉన్నాయి.

  • (IATA: ONT, ICAO: KONT)ఎల్.ఎ/ఒన్‌టారియో అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది లేండ్ ఎమ్‌పైర్‌లో ఉన్న లాస్ ఏంజలెస్ నగరానికి స్వంతమైన విమానాశ్రయం.
  • (IATA: BUR, ICAO: KBUR)బాబ్‌ హోప్ విమానాశ్రయం. దీనిని బర్ బ్యాంక్ విమానాశ్రయంగా వ్యవహరిస్తారు. ఇది శాన్ గాబ్రియల్, సాన్ ఫెర్నాడో వాసులకుఓందుబాటులో ఉంది.
  • (IATA: LGB, ICAO: KLGB)లంగ్ బీచ్ విమానాశ్రయం. ఇది లాంగ్ బీచ్,హార్బర్ వాసులకు అందుబాటులో ఉంది.
  • (IATA: SNA, ICAO: KSNA)జాన్ వేన్ విమానాశ్రయం. ఇది ఆరంజ్ కంట్రీ వాసులకు అందుబాటులో ఉంది.
  • (IATA: PMD, ICAO: KPMD)పాల్మ్ డేల్ విమానాశ్రయం. లాస్ ఏంజలెస్ నగరానికి స్వంతమైన విమానాశ్రయం. ఇది ఉత్తర ప్రాంతంలో ఉన్న శాంటా క్లారిటా,ఏంటి లోప్ వాసులకు అందుబాటులో ఉంది.
  • (IATA: VNY, ICAO: KVNY)వేన్ నుయిస్ విమానాశ్రయం. ఇది లాస్ ఏంజలెస్ నగరంలో ఉన్న ప్రపంచంలోనే రద్దీ అయిన విమానదళ విమానాశ్రయం.

హార్బర్(రేవు)

[మార్చు]

లాస్ ఏంజలెస్ హార్బర్ పోర్ట్ ఆఫ్ లాస్ ఏంజలెస్ శాన్ పెడ్రో సమీపంలో శాన్ పెడ్రో సముద్రతీరంలో ఉంది. ఇది డౌన్ టౌన్‌కు దక్షిణంలో 20 మైళ్ళ దూరంలో ఉంది.దీనిని లాస్ ఏంజలెస్ హార్బర్ అని,వరల్డ్ పోర్ట్ ఎల్‌ఎ అని కూడా అంటూ ఉంటారు. ఇది 7,500 ఎకరాలు విస్థిరించి ఉంది. సముద్ర తీరాన్ని ఆనుకొని 43 మైళ్ళ పొడవున ఉంది.ఇది పోర్ట్ ఆఫ్ లాంగ్ బీచ్‌ ని ఆనుకొని ఉంది.
పోర్ట్ ఆఫ్ లాస్ ఏంజలెస్ , పోర్ట్ ఆఫ్ లాంగ్ బీచ్‌ కాకుండా లాస్ ఏంజలెస్ సముద్రతీరంలో ఇతర అవసరాలకు మరికొన్ని చిన్న, చిన్న హార్బర్స్ ఉన్నాయి. రెడాన్డో,మరీనా డెల్ రే వాటిలో కొన్ని. వీటిని సెయిల్ బోట్స్ కోసం వినియోగిస్తారు.
పోర్ట్ ఆఫ్ లాస్ ఏంజలెస్ , పోర్ట్ ఆఫ్ లాంగ్ బీచ్‌ కలిపి అమెరికాలోనే అతి పొడవైన హారర్ పేరు పొందింది. ప్రపంచంలో ఇది అయిదవ స్థానంలో ఉంది.
హార్బర్‌లో నాలుగు వంతెనలు ఉన్నాయి. ఇవి వరసగా విన్సెంట్ థోమస్ బ్రిడ్జ్, హెన్నీ ఫోర్డ్ బ్రిడ్జ్, గెరాల్డ్ డెస్మాండ్ బ్రిడ్జ్.

ఒలింపిక్ క్రీడలు

[మార్చు]

1932 జూలై 30 నుంచి ఆగస్టు 14 వరకు 10 వ ఒలింపిక్ క్రీడలకు ఈ నగరం వేదికగా నిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనడంతో ఈ క్రీడలకు కేవలం 37 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. అప్పటి అమెరికా ఉపాద్యక్షుడు చార్లెస్ కర్టిస్ ఈ క్రీడలను ప్రారంబించాడు. పతకాల పట్టికలో 41 స్వర్ణాలతో అమెరికా ప్రథమ స్థానంలో నిల్చింది. భారత్ కు హాకీలో స్వర్ణ పతకం లభించింది. పతకాల ప్రధానోత్సవంలో విజేతల జాతీయ గీతాల స్వరాలాపన ఈఒలింపిక్ క్రీడల నుంచే ప్రవేశపెట్టినారు.
1984లో మరోసారి 23 వ ఒలింపిక్ క్రీడలను ఈ నగరం నిర్వహించింది.

{{bottomLinkPreText}} {{bottomLinkText}}
లాస్ ఏంజలెస్
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?